మన రాష్ట్రంలో సీ. పీ. ఎం . వారి లౌకిక వాద భావనలు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటాయ్. ఆంధ్రప్రదేశ్ లో పూర్తి లౌకికవాద లక్షణాలున్న పార్టీగా వారికి ఒక పార్టీని సూచిస్తున్నారు. వారి అభ్యర్ధులు లేని చోట ఆ పార్టీ కే వోటేయ్యమని సదరు లౌకికవాద పార్టీ కోరకుండానే వీరు తమ కార్యకర్తలకు సందేశాలందించారు. (కనీసం తటస్థంగా ఉండమని కోరి ఉండొచ్చు ). కానీ వార్తల్లోకి తొంగి చూస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రార్ధనామందిరాలలో ఏ పార్టీ కోసం డబ్బు పంపిణీ జరిగిందో ఎవరికైనా అవగతమైపోతుంది (ఒక్క సీ. పీ. ఎం . నాయకులకు తప్ప ). బహుశా ఇంత బహిరంగంగా ఇంతకు ముందు మరే ప్రార్ధనా మందిరాలలో ఇలాంటి ప్రయత్నాలు జరిగి ఉండవని నా నమ్మకం.
దేశ పరిస్థితి అత్యంత విషమంగా మారి ..... యువత మొత్తం సరైన దిశా నిర్దేశం లేకుండా .... భవిష్యత్తంతా అగమ్యగోచరంగా మారిన నేటి పరిస్థితులలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మొత్తం Leftist పార్టీ లను ఏకం చేసి ఎలక్షన్ లో పోటీ చేసే ఒకే ఒక్క Left party ని తయారు చేయవలసిన ఆవశ్యకత ఉన్న ఈ పరిస్థితులలో .... కార్యకర్తలను అత్యంత అవినీతి మూలాలతో పుట్టిన పార్టీ వైపు చూసేలా చేసిన CPI (M ) నాయకత్వం యొక్క ఈ తప్పుడు నిర్ణయం ..... కొత్తగా ఏర్పడబోతున్న సీమాంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన గొప్ప ద్రోహం తప్ప వేరేమీ కాదు.
దేశ పరిస్థితి అత్యంత విషమంగా మారి ..... యువత మొత్తం సరైన దిశా నిర్దేశం లేకుండా .... భవిష్యత్తంతా అగమ్యగోచరంగా మారిన నేటి పరిస్థితులలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మొత్తం Leftist పార్టీ లను ఏకం చేసి ఎలక్షన్ లో పోటీ చేసే ఒకే ఒక్క Left party ని తయారు చేయవలసిన ఆవశ్యకత ఉన్న ఈ పరిస్థితులలో .... కార్యకర్తలను అత్యంత అవినీతి మూలాలతో పుట్టిన పార్టీ వైపు చూసేలా చేసిన CPI (M ) నాయకత్వం యొక్క ఈ తప్పుడు నిర్ణయం ..... కొత్తగా ఏర్పడబోతున్న సీమాంధ్ర రాష్ట్ర ప్రజలకు చేసిన గొప్ప ద్రోహం తప్ప వేరేమీ కాదు.
కుహనా కమ్మ్యూనిష్టులు ప్రజలకు ఎప్పుడు మేలు చేసారు గనుక?
రిప్లయితొలగించండిఇలా అంటున్నందుకు ఏమీ అనుకోవద్దు. మీరు బ్రాహ్మణులనుకుంటా. నేనూ బ్రాహ్మణ్ణే. మిగతా జనం కంటే అధికులమనే భావనలో సామాన్య జనమంతా వోటు వేసే దిశకి ప్రతిసారీ వ్యతిరేకదిశలో వోటు వేస్తూ మన కులం ఇప్పటికే చాలా చాలా నష్టపోయింది. బ్రాహ్మణకులాన్ని ఒక పథకం ప్రకారం దుంపనాశనం చేసిన తెలుగుదేశంతో పోలిస్తే YSRCP మరీ అంత చెడ్డదేమీ కాదు. 1987-88 నాటి సంగతులు మీకు తెలియవనుకుంటా. ఎవరినైనా అర్చకుల్ని అడగండి, చెబుతారు.
రిప్లయితొలగించండిజగన్ క్రైస్తవుడు కావడమే మీ అభ్యంతరానికి కారణమైతే మనకు క్రైస్తవ ముఖ్యమంత్రులు కొత్తేమీ కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి ఎవరు ? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎవరు ?
ఇహ అవినీతి అంటారా ? చంద్రబాబునాయుడిలా రాష్ట్రాన్ని దోచుకుతిన్న ముఖ్యమంత్రి చరిత్రలోనే కనిపించడు. 54 ప్రభుత్వసంస్థల్ని తనవాళ్ళకి కారుచవగ్గా అమ్మేసిన మహానుభావుడాయన. ఆలోచించండి.
క్షమించండి .....నా కులం బ్రాహ్మణ కులం కాదు. కులం ....మతం రెండిటినీ అధికార వర్గాలు చాలా తెలివిగా వాడుకుంటున్న ఈ తరుణం లో నిజమైన లౌకిక వాద పార్టీ ఏదైనా సరే భాజపా ను ఎంత దూరంగా ఉంచారో వైకాపా ను కూడా అంత దూరంగానే ఉంచాలనేది నా ఉద్దేశ్యం. మనం కొన్ని ప్రమాణాల ప్రకారం వెళ్దాం. మీరు చెప్పిన CBN అవినీతి గురించి తెలుగు పత్రికలు కాకుండా కూడా మరేవైనా ప్రచురిస్తే తెలియజేయగలరు. కానీ కొన్ని ప్రమాణాలు పాటించినవై ఉండాలి. ఇంకొక విషయం కూడా మీకు చెబుతున్నాను తిరుపతి కి వెళ్ళి తలనీలాలు అర్పిస్తే పాపవిముక్తిడై పోతావు అని చెప్పడాన్ని ఎంత వ్యతిరేకించాలో ....బాప్టిజం పొందిన వాడికి పాపాలు అంటవు...అని ప్రచారం చేయడాన్ని కూడా అంతే వ్యతిరేకించాలి. రెండూ ఒకటే ....
రిప్లయితొలగించండిమీరు చెప్పిన 54 కంపెనీ ల పేర్లు నాకు పంపగలిగితే ....పూర్తి చరిత్రను సంపాదించగలిగిన సర్కిల్ నాకు ఉంది. నిజాలను వెలుగులోనికి తేవడం లో నేను కూడా భాగస్వామినౌతాను .
నేను ఈ పై అజ్ఞాతనే. చంద్రబాబు పరిపాలన ఎంత దరిద్రమో ఈ క్రింది సైట్ లోకి వెళ్ళి చూడండి :
రిప్లయితొలగించండిhttp://www.okacharitra.com/tag/world-bank-reforms/
మీరు మరొక్క సారి నా పోస్ట్ మరియు వ్యాఖ్య చదవండి .నేను రాసింది సి.పి.ఎం పార్టీ వారి అర్ధం లేని లౌకిక వాదం గురించి....అంతే కాక వారు చేయవలసిన బృహత్తర కార్యం గురించి చర్చించడానికి మాత్రమే. అవినీతి అనేదాని గురించి చర్చిచడానికి కాదు. మీరు నేనడిగిన లిస్టు పంపండి. మీరు పంపిన Website లో నేనడిగిన సమాచారం లేదు. అవినీతి రహిత సమాజం గురించి ఆలోచించడం మంచిది కానీ ఎవరిది ఎక్కువ అవినీతి అని చర్చించుకుంటూ సమయం వృధా చేసుకోవడం మంచిది కాదు. ఒకరి అవినీతిని విమర్శించిన వ్యక్తిని ఆటోమాటిక్ గా వేరొక ప్రధాన ప్రతిపక్షానికి కట్టెయ్యడం మంచిది కాదు. వీరిరువురికీ మించిన చైతన్యం ఉన్న వారు చాలా మంది ఉన్నారు.
రిప్లయితొలగించండిVery good answers
రిప్లయితొలగించండి