నాకొక అందమైన కల ఉండేది . ఏమో కొంత మంది పిచ్చి కల అని కూడా అంటారేమో.....
ఒక చక్కటి కాలనీ ..అంటే అది కాలనీ లా ఉండ కూడదు. ఒక చక్కటి తోటలో ఇళ్ళు పేర్చి నట్లుగా ఉండాలి. ఆ ఇళ్ళుకూడా భారీ కాంక్రీట్ భవనాలు కాదు. అవసరానికి సరి పడా ..హోం అనే పదానికి పర్యాయపదం గా ఉండాలి. ఇంటి చుట్టూచక్కటి చెట్లు...విరిబూస్తున్న పూవులు...చెట్లకు కాస్తున్న పళ్ళు.... ఆకు కూరలు ఒక పక్కన...కాయ గూరలు ఒకపక్కన...కార్లు అన్నీ కాలనీ బయటే పార్కింగ్ ...ఒక్క నడవలేని స్థితి లో ఉన్న వారికే కారుతో కాలనీ లోకి ప్రవేశించేసౌకర్యం .....కాలనీ లో తిరగడానికి కాలి నడకే సాధనంగా ఉండాలి..లేకుంటే సైకిల్ ....
కాలనీ లో ఏ మతానికీ సంబందించిన ప్రోగ్రామ్స్ జరగ కూడదు. లో లోపల ఏ మతాన్ని అభిమానించినా బయట మాత్రంఒకే కామన్ మతం. మానవతా వాదం. మైక్ గోల అనేది ఉండ కూడదు. మరీ అంత మూర్ఖత్వమా....అనుకుంటున్నారా...మతానికి సంబందించని....ఒక గొప్ప కళాకారులకి మాత్రం అందరి అనుమతితోప్రోగ్రాం ఎరేంజ్ చేయవచ్చు...దానికోసం చక్కని ఆడియో సౌకర్యం ఉండే ధియేటర్ ఉండాలి. దానికి ఆనుకొనే ఒక చక్కటిలైబ్రరీ ఉండాలి. దానిలో చక్కటి పుస్తకాలతో బాటు.. అనేక ఉచిత"ఈ "బుక్స్ చదువుకొని డౌన్ లోడ్ చేసుకొనేసదుపాయం..(రుసుము వసూలుతోనే ..) ఉండాలి. లైబ్రరీ కి వచ్చినా రాక పోయినా ...దానికి అయ్యే ఖర్చు మాత్రంఅందరి మీదా పడుతుంది. ప్రతి నెలా ఒక రోజు ప్రపంచ గతిని మార్చి వేసిన మహనీయుల పుస్తకాల మీద చర్చ లుఉంటాయి. ఉత్తమ ఉపన్యాసకుడికి పుస్తక బహుమతి లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలనీ వాసులుఅందరూ భరించాలి. అంతే కాదు బయట ప్రదర్శితం కాని ఉత్తమోత్తమ చలన చిత్రాలను కూడా కాలనీ వాసులకి అందుబాటులో ఉంచాలి.
వయో బేధం లేకుండా అందరికీ శారీరక వ్యాయామాలు చేసే సదుపాయం ఉండాలి. తక్కువ ఖర్చుతోనే ఉల్లాస్సాన్నిచ్చే వాలీ బాల్, బాడ్మింటన్ లాంటి క్రీడలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ ఉండాలి.
నేనేమన్నా ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నానేమో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ యొక్క ప్రకటనలు ఒక్క సారి చూస్తే నావేమీ గొంతెమ్మ కోర్కెలు కావని సులువుగా ఎవరికైనా అర్దం అవుతుంది. క్లబ్ హౌస్ ..జిమ్...స్విమ్మింగ్ ఫూల్స్ ఒకటేమిటి మనలను ఫూల్స్ చేసే సమస్తం అందులో కనబడతాయి. ఈ ఏడ్స్ చూస్తున్నప్పుడు నాకేదో వెలితి ఉన్నట్లుగా అనిపించేది. ఇవన్నీ ఆ యా కాలనీ వాసులని ఆత్మీయంగా ఉంచుతాయా...ఎవరి మానసిక ప్రపంచంలో వారిని బ్రతికేలా చేస్తాయా....అలోచించి నాకంటే తెలివైన వారు చర్చిస్తే బాగుంటుంది.
నేనెప్పుడు సెలవులకి వూరికి వెళ్ళినా మా నాన్న గారు.."ఏమిటోరా ...జనం ఎవరూ కలవడం లేదు..ఏమీ తోచుబడి కావడం లేదు " అంటూనే ఉంటారు. మరి ఇంట్లో టీవి తో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. నాకర్దమైన విషయం ఏమిటంటే మనం టీవీ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చూడొచ్చు. అంటే మనం కేవలం ప్రేక్షకుడి గానే మిగిలిపోతాం.మన ఆలోచనలన్నీ మన లోనే ఇమిడి పోతుంటాయి. సమాజం లో అసలు ఇబ్బంది అక్కడే కనిపిస్తుంది. మామూలుగా ఉండవలసిన సోషల్ interaction ఉండడం లేదు. కేవలం కొన్ని స్పెషల్ ఫంక్షన్ లోనే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాస్త సమయం లోనే లేని పోని భేషజాలు ప్రదర్సిస్తున్నాం. ఇదంతా చూసి చూసి....నాలో పైన చెప్పిన కల ప్రారంభమైంది.
దీని గురించి అలోచిస్తున్నప్పుడే అనుకోకుండా మా మామయ్య తన మనసులో ఉద్దేశ్యం చెప్పాడు. గనులు తవ్వడం పూర్తవ్వగా మిగిలి పొయిన గోతులలొ మంచి మట్టి నింపగా ఇంచు మించు నాలుగు యెకరాల ఖాళీ స్థలం యెర్పడిందనీ..దానిలో యేదైనా నేచురోపతి కి సంబందించిన ఆశ్రమమేదైనా కట్టాలనున్నదని చెప్పాడు . నాకెందుకో ఇది జరిగే పనేనా అనిపించింది. కానీ తనే పది సార్లు ఫోన్ చేసేసరికి నెమ్మదిగా ఒక్కొక్కటీ డిజైన్ చేయడం ప్రారంభించాను. ప్రారంభించిన కొద్ది రోజులకి బ్రోచర్ వేయడం జరిగింది.దానిని చూస్తే నా కలలు కొన్నైనా నెరవేరే సూచనలున్నాయని మీరే ఒప్పుకుంటారు.
పైనున్న బొమ్మ బ్రోచర్ మొదటి పేజ్ . యీ క్రింది పేజ్ యోగా హాల్ కి సంబందించినది. దీనిలో మొదటి అంతస్తు అన్ని హంగులతోనూ పూర్తికావస్తోంది. పక్కన ఇచ్చిన సమాచారం 100% వాస్తవం.
నా కలలలో చాల భాగం ఇక్కడ నిజ రూపం దాల్చనున్నాయి. వాటితో బాటు మనకు అవసరమైన ఆయుర్వేద మొక్కలతో ఒక పూర్తి స్థాయి పార్క్ డిజైన్ చేయడం జరిగింది. ఆ మొక్కలన్నీ కూడా జైపూర్ (ఒడిషా) నుండి ఉపలభ్యం కానున్నాయి. వాటి మీద నుండి వచ్చే గాలి కూడా మానవ శరీరానికి స్వాంతన చేకూరుస్తుంది.
మానసికంగా ఉల్లసం కలిగించడానికి చక్కటి లేండ్ స్కేపింగ్ దిజైన్ చేయబడింది. యీ మొత్తం పనిలో సంకేతికతలో (టెక్నికల్) ముఖ్య భూమిక నిర్వర్తించగలిగినందుకు నా కలలే కాకుండా నా జీవితం కూడా సాఫల్యం చెందుతుందని మనసారా నమ్ముతున్నాను. యెందుకంతే మల్తీ స్పెషాలిటీ పేరుతో జరుగుతున్న దొపిడీ కి వ్యతిరేకంగా నా వంతు పాత్ర నేను నిర్వర్తించగలుగుతున్నాను.
యీ మహత్తర ఆశ్రమం 99% దసరా పవిత్ర దినం నుండి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
యీ ఆశ్రమం చుట్టూ ఉన్న భూమి చక్కటి కాలనీ కట్టడానికి యెంతో అనువుగా ఉంతుంది. స్నేహితులు ...ఆప్తులు సహకరిస్తే ...పచ్చటి చెట్లు.... ..రంగు రంగుల పూవులు.....పక్షుల కిలకిలలు.... పిల్లల ఆట పాటలు...నడి వయస్సు వారి ఆత్మీత తో కూడుకున్న పలకరింపులు...సమాజానికి మార్గ దర్సకత్వం వహించేవారి చర్చలకు కేంద్రంగా....చర్చలే కాదు కార్యాచరణకు కూడా కేంద్రంగా ..కృత్రిమత్వం అనేది కనుచూపులో లేకుండా ..హేతుబద్దమైన సాంప్రదాయ సాంస్కృతిక కార్యకలాపాల నిలయంగా ..పరిసరాలు చూడ గానే ..."అందమె ఆనందం ..." అనే మధుర గీతాన్ని పెదవుల పైకి తెచ్చే విధంగా ..ఒక కాలనీ నిర్మిచాలని ఉన్నది. అది అందరికీ నచ్చక పోవచ్చు కానీ మహా మానవతా సువాసనలు జీవిత చరమాంకం వరకూ ఆఘ్రాణించాలనుకునే వారికి పూర్తి అనువుగా ఐతే ఉండగలుగుతుంది.
చివరిగా చిరునవ్వుతో ముగిస్తాను. నా అలోచన అంతా విన్న మా బావ మరిది ఒకరు " ఇంతకూ ఆ కాలనీ కి యే పేరు పెడతావు బావా ?" అని అడిగేడు.
"థింకర్స్ కాలనీ అని పెడితే యెలా ఉంటుంది ?" అన్నాను.
" వూరుకో బావా...హేపీ గా డ్రింకర్స్ కాలనీ అని పెట్టు ...నెల రొజుల్లో ప్లాట్స్ అన్నీ నేనే అమ్మించేస్తాను" అన్నాడు
నిజమేనేమో...
ఒక చక్కటి కాలనీ ..అంటే అది కాలనీ లా ఉండ కూడదు. ఒక చక్కటి తోటలో ఇళ్ళు పేర్చి నట్లుగా ఉండాలి. ఆ ఇళ్ళుకూడా భారీ కాంక్రీట్ భవనాలు కాదు. అవసరానికి సరి పడా ..హోం అనే పదానికి పర్యాయపదం గా ఉండాలి. ఇంటి చుట్టూచక్కటి చెట్లు...విరిబూస్తున్న పూవులు...చెట్లకు కాస్తున్న పళ్ళు.... ఆకు కూరలు ఒక పక్కన...కాయ గూరలు ఒకపక్కన...కార్లు అన్నీ కాలనీ బయటే పార్కింగ్ ...ఒక్క నడవలేని స్థితి లో ఉన్న వారికే కారుతో కాలనీ లోకి ప్రవేశించేసౌకర్యం .....కాలనీ లో తిరగడానికి కాలి నడకే సాధనంగా ఉండాలి..లేకుంటే సైకిల్ ....
ఇంతేనా...ఇంకా చాలా ఉంది ....ఎవ్వరూ ...రెండో అంతస్తు మించి కట్ట కూడదు. ఆ కాలనీ లో పవర్ అనేది ప్రాబ్లం గా ఉండకూడదు. కిచెన్ వేస్ట్ దగ్గర నుండి ప్రతి డిస్పోసబుల్ మెటీరియల్ బయో గాస్ ఉత్పాదనకు వినియోగించాలి. మంచినీళ్ళతయారీ ..అంతా...సోలార్ సిస్టం తో నడవాలి. నీళ్లన్నీ వృధా కాకుండా రీ సైకిల్ చేసి మొక్కలకోసం వాడాలి. సర్ఫేస్ నీరు తప్ప గ్రౌండ్ వాటర్ జోలికి వెళ్ల కూడదు. ముఖ్యమైన విషయం ప్లాస్టిక్ వస్తువేదీ కాలనీ లో కనబడ కూడదు. పిచ్చిబాగా తలకెక్కిందనుకుంటున్నారు కదా...లేదు ఇంకా మోకాలి దగ్గరే ఉంది....
ఏ.సి. వాడితే కాలనీ లో గాలి వేడెక్కే అవకాశం ఉంది కాబట్టి వాటి పైన నిషేధం ఎలాగూ ఉంటుంది. మరి వేసవి తాపాన్నితట్టుకోడం ఎలా...దానికి కూడా సమాధానం ఉంది...గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ తో .....స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ,కొచ్చిన్ వారుసూచించిన విధంగా గాలి వెలుతురూ ..ధారాళంగా వచ్చే విధంగా ....కేవిటీ గోడలు మరియు పైకప్పు వేసి..ఆ పైన ఇటుకముక్కలు ..సున్నం కలిపి..ఒక పొరగా వేసి..దాని పై న సూర్య రశ్మి లోని రేడియేషన్ ని తగ్గించగల తెల్లటి రిఫ్లెక్టింగ్ టైల్స్వేసుకుంటే నిస్సందేహంగా ఇంట్లో ౩౦ డిగ్రీలు మించి వేడి ఉండదు. వేడి తక్కువగా ఉన్నప్పుడు ఒక మామూలు ఫ్యాన్సహాయంతో ఉక్క పోతను తట్టుకోవచ్చు. పిచ్చి నడుము దాకా...వచ్చింది కదా......మిగిలింది చూద్దాం. కాలనీ లో ఏ మతానికీ సంబందించిన ప్రోగ్రామ్స్ జరగ కూడదు. లో లోపల ఏ మతాన్ని అభిమానించినా బయట మాత్రంఒకే కామన్ మతం. మానవతా వాదం. మైక్ గోల అనేది ఉండ కూడదు. మరీ అంత మూర్ఖత్వమా....అనుకుంటున్నారా...మతానికి సంబందించని....ఒక గొప్ప కళాకారులకి మాత్రం అందరి అనుమతితోప్రోగ్రాం ఎరేంజ్ చేయవచ్చు...దానికోసం చక్కని ఆడియో సౌకర్యం ఉండే ధియేటర్ ఉండాలి. దానికి ఆనుకొనే ఒక చక్కటిలైబ్రరీ ఉండాలి. దానిలో చక్కటి పుస్తకాలతో బాటు.. అనేక ఉచిత"ఈ "బుక్స్ చదువుకొని డౌన్ లోడ్ చేసుకొనేసదుపాయం..(రుసుము వసూలుతోనే ..) ఉండాలి. లైబ్రరీ కి వచ్చినా రాక పోయినా ...దానికి అయ్యే ఖర్చు మాత్రంఅందరి మీదా పడుతుంది. ప్రతి నెలా ఒక రోజు ప్రపంచ గతిని మార్చి వేసిన మహనీయుల పుస్తకాల మీద చర్చ లుఉంటాయి. ఉత్తమ ఉపన్యాసకుడికి పుస్తక బహుమతి లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా కాలనీ వాసులుఅందరూ భరించాలి. అంతే కాదు బయట ప్రదర్శితం కాని ఉత్తమోత్తమ చలన చిత్రాలను కూడా కాలనీ వాసులకి అందుబాటులో ఉంచాలి.
వయో బేధం లేకుండా అందరికీ శారీరక వ్యాయామాలు చేసే సదుపాయం ఉండాలి. తక్కువ ఖర్చుతోనే ఉల్లాస్సాన్నిచ్చే వాలీ బాల్, బాడ్మింటన్ లాంటి క్రీడలకు ప్రత్యేక ప్లే గ్రౌండ్ ఉండాలి.
నేనేమన్నా ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నానేమో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్స్ యొక్క ప్రకటనలు ఒక్క సారి చూస్తే నావేమీ గొంతెమ్మ కోర్కెలు కావని సులువుగా ఎవరికైనా అర్దం అవుతుంది. క్లబ్ హౌస్ ..జిమ్...స్విమ్మింగ్ ఫూల్స్ ఒకటేమిటి మనలను ఫూల్స్ చేసే సమస్తం అందులో కనబడతాయి. ఈ ఏడ్స్ చూస్తున్నప్పుడు నాకేదో వెలితి ఉన్నట్లుగా అనిపించేది. ఇవన్నీ ఆ యా కాలనీ వాసులని ఆత్మీయంగా ఉంచుతాయా...ఎవరి మానసిక ప్రపంచంలో వారిని బ్రతికేలా చేస్తాయా....అలోచించి నాకంటే తెలివైన వారు చర్చిస్తే బాగుంటుంది.
నేనెప్పుడు సెలవులకి వూరికి వెళ్ళినా మా నాన్న గారు.."ఏమిటోరా ...జనం ఎవరూ కలవడం లేదు..ఏమీ తోచుబడి కావడం లేదు " అంటూనే ఉంటారు. మరి ఇంట్లో టీవి తో సహా అన్ని సదుపాయాలూ ఉన్నాయి. నాకర్దమైన విషయం ఏమిటంటే మనం టీవీ లో ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా చూడొచ్చు. అంటే మనం కేవలం ప్రేక్షకుడి గానే మిగిలిపోతాం.మన ఆలోచనలన్నీ మన లోనే ఇమిడి పోతుంటాయి. సమాజం లో అసలు ఇబ్బంది అక్కడే కనిపిస్తుంది. మామూలుగా ఉండవలసిన సోషల్ interaction ఉండడం లేదు. కేవలం కొన్ని స్పెషల్ ఫంక్షన్ లోనే కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాస్త సమయం లోనే లేని పోని భేషజాలు ప్రదర్సిస్తున్నాం. ఇదంతా చూసి చూసి....నాలో పైన చెప్పిన కల ప్రారంభమైంది.
దీని గురించి అలోచిస్తున్నప్పుడే అనుకోకుండా మా మామయ్య తన మనసులో ఉద్దేశ్యం చెప్పాడు. గనులు తవ్వడం పూర్తవ్వగా మిగిలి పొయిన గోతులలొ మంచి మట్టి నింపగా ఇంచు మించు నాలుగు యెకరాల ఖాళీ స్థలం యెర్పడిందనీ..దానిలో యేదైనా నేచురోపతి కి సంబందించిన ఆశ్రమమేదైనా కట్టాలనున్నదని చెప్పాడు . నాకెందుకో ఇది జరిగే పనేనా అనిపించింది. కానీ తనే పది సార్లు ఫోన్ చేసేసరికి నెమ్మదిగా ఒక్కొక్కటీ డిజైన్ చేయడం ప్రారంభించాను. ప్రారంభించిన కొద్ది రోజులకి బ్రోచర్ వేయడం జరిగింది.దానిని చూస్తే నా కలలు కొన్నైనా నెరవేరే సూచనలున్నాయని మీరే ఒప్పుకుంటారు.
పైనున్న బొమ్మ బ్రోచర్ మొదటి పేజ్ . యీ క్రింది పేజ్ యోగా హాల్ కి సంబందించినది. దీనిలో మొదటి అంతస్తు అన్ని హంగులతోనూ పూర్తికావస్తోంది. పక్కన ఇచ్చిన సమాచారం 100% వాస్తవం.
అంతే కాకుండా నేను కలలు గన్న గ్రీన్ హౌస్ కాన్సెప్ట్
తో కట్టబోయే కాటేజ్ లు కొద్ది రొజుల్లోనే రూపు దిద్దుకోబొతున్నాయి. అనతి కాలం లోనే యే విధమైన యే.సీ. లు వాడకుండానే మనం చల్లగా ఇంటిని ఉంచగలమని చూపిస్తున్నాము. వాటి నమూనా నమూనా క్రింద ఇస్తున్నాను.