ఒక విద్యార్ధి ...... పరీక్షల ముందు రోజు వరకూ face book లో updates చూసుకుంటూ ..... చాటింగ్ చేసుకుంటూ .... ear phones పెట్టుకుని సంగీత జలధి లో స్నానం చేస్తూ ...... కూడా రాయబోతున్న ఎగ్జామ్ లో తనదే అన్న ధీమాతో ఉంటాడు . ఆ ధీమా ఎవరి వలన వచ్చింది ... ?
ఒక ఆటోవాలా ఏ మాత్రం ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ...... ఇష్టం వచ్చిన స్పీడ్ లో డ్రైవ్ చేస్తూ .... ఫుల్ వాల్యూం లో పాటలు పెట్టి శబ్దం కాలుష్యం కూడా పెంచేస్తూ ..... ఒక ముసలి స్కూటరిస్ట్ ను గుద్దినంత పని చేసి ..... పైగా "నీవేం చేసుకుంటావో చేసుకో బే "అంటాడు .... వయసు కి కూడా మర్యాద లేకుండా ..... ఆ ధీమా ఎవరి వలన వచ్చింది ... ?
ఒక కాంట్రాక్టర్ ..... ఎస్టిమేట్ చేసిన రేట్ కంటే తక్కువ రేట్ కోట్ చేస్తాడు. సిమెంట్ తగ్గించినా తనను ఎవరూ ఏమీ చేయలేరు సరి కదా ..... పరుగులు పెడుతూ బిల్స్ కూడా చేస్తారనే ధీమా . ఆ ధీమా ఎవరి వలన వచ్చింది ... ? ఆ కలలకు ప్రేరణ ఎవరు ?
అంతే కాదు రాత్రికి రాత్రే పెరిగిపోయిన కుహనా రియల్ ఎస్టేట్ వారు .... ఖనిజాలు కొల్లగొట్టే ఘనులు ..... దొంగ నోట్లు మార్చే వాళ్ళు .... ముద్రించే వాళ్ళు ..... ప్రభుత్వ భూములు ఆక్రమించుకునే వారు .....
అందరికీ అదే కల ....ధీమా ... మేమే కాబోయే పరిపాలకులమని ...... ......
నా చుట్టూ కూర్చుంటున్న కాంట్రాక్టర్లంతా " నిజాయితీ పరులెవ్వరు సార్ ...... అంతా మోసమే ఉంటుంది సార్ .... కాబట్టి మా వాళ్ళదే రాజ్యం ..... " అంటున్నప్పుడు కళ్ళ ముందు కదలాడిన భయానక దృశ్యం . ముందు ముందు తరాలు మొత్తం జనాభా అంతా ఒకళ్ళనొకళ్ళు స్వచ్చత కరువై ..... ఎదుటి వాడు మోసం చేస్తున్నాడేమో అన్న అనుమానంతో ప్రవర్తిస్తూ ..... సహజత్వానికి దూరమైన బ్రతుకు ఈడుస్తూ బ్రతకాలా .....
నిన్న మొన్నటి వరకూ ఇదే ఆలోచనతో నిద్ర కరువైన రాత్రులెన్నో ...... కానీ ఇప్పుడు నమ్మకం కుదురుతోంది ....పాముల్ని మట్టబెట్టేందుకు చీమలన్నీ దండుగా కదులుతున్నాయ్. 16 వ తారీఖు గురించి ఆశగా ఎదురు చూస్తున్నాను. అందమైన భవనాలు సృష్టించగల నా architectural పరిజ్ఞానాన్ని ఈ పాములకి గోరీ కట్టడానికి కూడా వాడతాను. కానీ పరమ భీభత్సంగా ..... ఉండేలా డిజైన్ చెయ్యాలి ..... చూసిన వారు .... కలలో కూడా ప్రజల భూములని ..... పంచ భూతాలని తాకాలంటేనే భయంతో స్పృహ తప్పాలి.
ప్రజలు చూపించిన ..... చూపించబోతున్న ...చైతన్యానికి నా శతకోటి వందనాలు. ఒక 1000 నోటుకి .... ఒక మందు సీసాకి లొంగి పోయే వెర్రి వాజమ్మలుగా జనాన్ని అంచనా వేసిన రాబందుల శవాల మీద నాట్యం చేయడానికి చేయీ చేయీ కలపండి .