30, జనవరి 2011, ఆదివారం

మా అత్తా మామ గార్లు


మా అత్త మామ గార్లు...... కనుమరుగవుతున్న గ్రామీణ స్వచ్చతకు దర్పణంగా ఉండేవారు. ఇంకా ఉండేవారేమో....డిసెంబర్ ౨ ౨౦౦౭ తెల్లవారు ఝాము మా మామగారి కి మృత్యు పాశం విసరక పొతే......ప్రస్తుతం మనం అనుకుంటున్నా అభివృద్దికి చక్రాలు ఉంటున్నాయి కానీ కళ్ళు వుండడం లేదు. వేగం ఒక్కటే దానికి తెలుసు. పల్లెలు ఆ అభివృద్ధి కి అలవాటు పడేటప్పటికి వాటి మూలాలు సమూలంగా కనుమరుగయ్యేతట్లున్నాయి.

ఎన్ని మార్పులు.....

తలుచుకుంటుంటే ఒక్కక్కప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ ఊరిలో మార్పులు చూసినా మన దేశంలో మార్పులు అర్ధం చేసుకోవచు. మాఊరేమీ ప్రత్యేకం కాదు. ముందు ముందు ఇంకా ఏ మార్పులు రానున్నాయో వుహిస్తుంటే ఎప్పటి కప్పుడు ఒక వీడియో కెమెరా తో జరుగుతున్న ప్రతి ఫంక్షన్ రికార్డు చేసుకోవాలని పిస్తోంది. అది ఎవరిదైనా మరణం కావచు లేదా పెళ్ళైనా కావచ్చు. మన చేస్తున్న పనిలో నిజాయితీ శాతం చూస్తుంటేనే బాధగా వుంటుంది. ఇంటికి వెళ్ళగానే అతిధులకి ఇత్తడి చెంబుతో కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి ఆహ్వానించే రోజులనుండి ముక్తసరిగా ఒక్క మాటతో పలకరించి టీవి సీరియల్ లో తలడుర్చే సంప్రదాయానికి vacchesaము .