మా మూర్తికి కొంత జ్ఞానోదయం కలగజేయాలన్న సత్సంకల్పమ్ కలిగి ఒక రోజు తనతో చెప్పుకుంటూ వచ్చాను .
"మా బంధువుల కుటుంబాల లోని ఒక కుటుంబం సంగతి నీకు విన్నవించదలుచుకున్నాను. ఆ కుటుంబ యజమాని చక్కగా మూడు పూటలా తాగుతాడు . ఒక విధంగా చెప్పాలంటే ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు . అదృష్ట వశాత్తూ రియల్ ఎస్టేట్ మహర్దశ ఆ వూరికి కూడా చేరింది కాబట్టి ఉన్న భూమి విలువ బాగానే చేస్తుంది . ..... నిజమే మీకొచ్చిన సందేహమే నాకూ వచ్చింది. అంతలా తాగుతుంటే ఆయన శ్రీమతి ఏమి చేస్తుంది అని .. ? ఆవిడ బలహీనతలన్నీ మన వాడికి కొట్టిన పిండి . ఆవిడ గొడవ చేసిన వెంటనే మన వాడు ఆమెను చక్కగా బజారుకి తీసుకెళ్ళి బట్టల కొట్టుకి తీసుకెళ్ళి ముద్దు చేస్తాడు . ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ అలా చిలకా గోరింకల లా గడిపేస్తున్నారు . రియల్ ఎస్టేట్ "ఢామ్ " అంటే ఎలా అనేది తరువాత సంగతి .... ప్రస్తుతానికి పని జరిగి పోతుంది కదా ..అని మన వాడు .... సిలుకు చీర చూసుకుని ఆవిడా అలా మురుసుకుంటున్నారు నెమ్మదిగా వాళ్ళకున్న భూమి చేజారిపోతుందన్న వాస్తవం తెలిసినా బలహీనతల వలన వచ్చిన ఉపేక్ష . పక్కనున్న రైతు కి అటువంటి అలవాట్లు లేవు కాబట్టి చాలా చిన్న ముక్క అమ్మి నెమ్మదిగా నలుగురి దగ్గరా అడ్వాన్సులు తీసుకుని బిల్డర్ అయ్యి నలుగురికి ఉపాధి కూడా కల్పించాడు ....... " ఇంకా చెప్పబోయాను .
"ఆగాగు..." గట్టిగా అరిచాడు మూర్తి .
"అదే ... అలా అరిచావ్ ... "విస్తుపోతూ అడిగాను
" చూడు బాస్ ... పాలకులని మొదటి ఫామిలీ లో ఎంజాయ్ చేస్తున్న యజమాని లాగా ... వోటర్ ని బలహీనతల పెళ్ళాం క్రింద పోల్చావ్ అంతేనా ?"
మూర్తి లోని ఎదుగుదల నాలో ఎంతో సంతోషాన్ని కలగ జేసే లోపులోనే మరలా గట్టిగా నవ్వి ....
"ఈ విషయం దారిన పోయే ప్రతి దానయ్య కూ తెలుసు . ఇంకొకటి చెప్పనా ... నీవనుకుంటున్నట్లు రెండో వాడి పద్దతిలో వెళ్తే పైకి వస్తామని తెలిసినా వాడి దారి లోకి వెళ్ళరు . నీ వూరి రోడ్ మోకాలి లోతు గుంటలు పడ్డా ఎవడూ అడగడు . వాడికి కావలిసిందల్లా కష్టపడ కుండా ఫ్రీ గా వచ్చే తిండి గింజలు వగైరా ... అంతే ..."
ఇదేమిటి .... మూర్తి నాకు జ్ఞానోదయం కలిగిస్తున్నాడు అనుకుంటూనే సందేహం ఒకటి నివృత్తి చేసుకోవాలనుకున్నాను .
"మరి అలా జరుగుతుంటే మొదటి వాడి కుటుంబం నాశనం అయినట్లుగా మన ఆర్ధిక వ్యవస్థ ..... "
"నీతో వచ్చిన చిక్కే ప్రసాదూ .... ప్రతిదీ లోతుల్లోకి వెళ్లి ఆలోచించోద్దంటే వినవ్ . ఎవరికీ అంత ఓపికల్లేవ్ ..... .... హేపీ గా ఉద్యోగం చేసుకుని ... ఇంటికి వచ్చి టీవీ లలో దూరడం తప్ప .... నీకింకొక విషయం చెప్పనా .... మొదటి వాడిలా విలాసంగా బ్రతికే వాడు తన లాంటి నలుగురిని కలుపుకుని తను తాగే మందే .. అంటే అంత ఖరీదైనది కాదనుకో .... నలుగురికీ అలవాటు చేసి వాళ్ళ వోట్లతో గెలిచి రెండో వాడిలా కష్టపడే వాడిని నయానా... భయానా బెదిరించి..... "
"ఆగాగు నాకేదో సాఫ్ట్ వేర్ కంపెనీ గుర్తుకు వస్తోంది " నాకేదో పోలిక కనిపించి అన్నాను .
"సరేలే .... ఇంకా చాలా దొరకొచ్చు ...... పూర్తిగా విను .... అలా వచ్చిన డబ్బుతో ఒక మంచి బాకా కొనుక్కుని .... జనాలను ముందు నుండీ సబ్సిడీ /ఫ్రీ ల గారడీ లో ముంచి ఎలక్షన్ రోజున నిజమైన మత్తులో ముంచితే చాలు విజయం తధ్యం అనే సిద్దాంతం తోనే కొన్ని పార్టీలుంటుంటే ..... "
"మరి మన పారిశ్రామిక పురోగతి ..... "
"అదే మరి ... నిన్ను అలాంటి గ్రాంధికం మాట్లాడ వద్దన్నానా ..... "
"మరి .... మిగిలిన పార్టీలు .... "
"అందరికీ తప్పడం లేదు ..... అనవసర సబ్సిడీ ల వల్ల అనర్దాలు చెప్పి చేతులారా ఓటమి తెచ్చుకునే వెర్రి వాళ్ళెవరూ ఉండరు . యధా ... రాజా ..తధా ప్రజా కాదు బాబూ .. ఆ రోజులు పోయాయి ... ఇప్పుడు యదా ప్రజా ...తధా రాజా ... "
"మరెలా ..... "
"వెళ్లి మీ బోసు బాబు కి మాథ్స్ చెప్పుకో .... ఏదో టాలెంట్ టెస్ట్ రాసుకుంటాడు . " మూర్తి జ్ఞానోదయాన్ని ముగించాడు .
నేను మాత్రం "ఎలా ..... " అనుకుంటూ ముందుకు నడుస్తూనే ఉన్నాను .... ఎప్పటికైనా నా వెనుక కొంతమందైనా చేరతారనే ఆశతో .....
( తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ 1600 మందిలో 610 మంది ఈ మధ్యే బయటకు వచ్చిన ఇంజనీర్స్ అన్న వార్త విన్న తరువాత కలిగిన స్పందన )