22, ఆగస్టు 2014, శుక్రవారం

నా .....మతం ......అందరిదీ కావాలని .....





                నాకూ మతం ఉంది .....నేను కూడా కుటుంబంతో సహా అనేకానేక పుణ్యక్షేత్రాలు తిరిగాను. అందుకే మతం అంటే ఎలా ఉండాలనేది నా పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రింద రాసాను. ఎవరైనా జ్ఞానులు .........మహానుభావులు నా (అ ) జ్ఞానాన్ని సరిచేసే ప్రయత్నమేదైనా చేస్తే వారికి సర్వదా ఋణపడి ఉంటానని మనవిచేసుకుంటున్నాను. అంతే తప్ప నేను ఏ మతాన్నీ కించపరచడానికి మాత్రం రాయలేదని ఇందుమూలముగా విన్నవించుకుంటున్నాను. 




వరస సంఖ్య
మంచి దారి చూపే  మతం
వేరే దారి చూపే మతం
1
స్వార్ధానికి విరుగుడు కేవలం ప్రేమ మాత్రమే ....మనుషులను తోటి వారిని ప్రేమించేలా చేసేదే మంచి మతం.
ప్రేమించడం కంటే ద్వేషించడం నేర్పే మతాన్ని ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా వదిలించుకోడం అత్యుత్తమం.
2
కేవలం తను నమ్ముకున్న భక్తి మార్గం కంటే కూడా ....తోటి వారి పట్ల నిబద్దత కలిగి ఉండేలా చేసేదే మంచి మతం ......

దైవ దర్శనానికి వెళుతూ కూడా క్యూను పట్టించుకోని  విధంగా భక్తులను తయారు చేస్తే ఆ మతంలో ఎక్కడో పొరబాటు జరుగుతోందని అర్ధం చేసుకోవాలి.
3
భక్తులు  నమ్ముకున్న భక్తి మార్గం సమాజంలో మిగిలిన  వారికి ఇబ్బంది కలిగించే విధంగా లేకుండా చూసుకోమని ఉద్భోదించేదే మంచి మతం ...
భక్తి అనేది మనసులో చేసే ధ్యానం మాత్రమే ....
తప్ప మైకులు పెట్టి గోల చేయడం మాత్రం కాదనే విషయాన్ని భక్తులకు అర్ధం అయ్యేలా చేయడం లేదంటే అర్ధం .....ఆ మతం గాని దాని పీటాధిపతులు కాని భక్తులను తప్పు త్రోవ పట్టిస్తున్నారని అర్ధం.
4
భక్తి అనేది భక్తుడిని మోక్ష మార్గం వైపుకి తీసుకెళ్ళే ఒక మార్గం మాత్రమే ......అంతే కాకుండా తోటి వారికి సహాయపడడం లాంటి భిన్న మార్గాలు మరింత త్వరగా భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాయని భక్తులు నమ్మేలా చేసేదే మంచి మతం.
మోక్ష మార్గం గా కాకుండా తమను  తమ పాపాల నుండి విముక్తి/శుద్ది  చేసే మార్గంగా భక్తిని ....ప్రజలు నమ్ముతుంటే మాత్రం ఆ ప్రజలను ఆ మతం తప్పుదోవ పట్టిస్తుందనే అనుకోవాలి . పాపం చేస్తే శిక్ష తప్ప శుద్ది ఉండదని ప్రజలు నమ్మితే బాబాల దగ్గర కోట్లాది రూపాయలు ప్రోగుపడవని అర్ధం చేసుకోవాలి .....
5
ప్రజలను ఒక మార్గంలో నడిపించేది చట్టం .....చట్టాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వమూ ..కోర్టులూ ఉంటాయి ...వీటిని గౌరవించడం మన కర్తవ్యమని ప్రజలు పూర్తిగా నమ్మేలా చేసేదే మంచి మతం.
మతం పేరు మీద అన్నిటినీ దిక్కరించేలా చేసేది .....అంటే ధిక్కరించే అవసరం కోసం ఉపయోగ పడితే అది మంచి మతం కాదనే అర్ధం....
6
మనుషులను నిరంతరం ప్రశాంతంగా జీవించేలా చేసేదే మంచి మతం . ఒక విధంగా ప్రశాంతతతను ప్రేమించేలా చేసేది మంచి మతం .
అకారణంగా .....తార్కికంగా...హేతుబద్దంగా  ఆలోచించనీయకుండా ....ద్వేషాన్ని మాత్రమే నూరి పోసేది మంచి మతం కాలేదు. ఎవడో ఒకడి మూర్ఖత్వాన్ని ఉపేక్షించేలా ప్రజలను తయారు చేసేది కూడా మంచి మతం కాదు
7
చక్కటి విశ్లేషణా శక్తితో .....హేతుబద్దంగా ఆలోచిస్తూ ....నచ్చని విషయాలను ప్రశ్నిస్తూ ....మానసికంగా దృఢమైన మనస్తత్వాలను పెంపొందించేది మంచి మతం .....
కేవలం మూర్ఖత్వాన్ని మాత్రమే రంగరించి పోసేది మంచి మతం అనిపించుకోదు