........అబ్బ......మంచి కార్డ్ పడింది.....లైఫ్ లేకుండా గేం మొదలుపెట్టినప్పుడు మొదటంతా టెన్షనే...తరువాత ఒక్కొక్క ముక్క కలిసి వస్తున్నప్పుడు మాంచి రిలీఫ్ గా ఉంటుంది...ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వానిది అదే పరిస్థితి...
రాష్ట్రమంతా ఒక్క కాంగ్రెస్ దే అన్నట్లు ఒక నిర్ణయం ప్రజల మీదకు వదిలారు. కాబట్టి ఒక జోకర్ దొరికినట్లయ్యింది. తెలంగాణాలో టీ.ఆర్.ఏస్. తో కలసి సీట్లు పంచుకోవచ్చు.సమైక్యాంధ్ర కావాలంటూ ఇక్కడ ప్రజలు ఆందోళనలు మొదలుపెట్టారు. వారికి కావలిసింది కూడా అదే....ఎందుకంటే ఇక్కడ గెలిచే పరిస్థితి ఎలాగూ లేదు. ప్రధాన ప్రతిపక్షం చేష్టలుడిగి నిలబడిన మహదవకాశాన్ని చేజేతులా అంది పుచ్చుకున్నారు.లైఫ్ కోసం ఆట్టే శ్రమ పడలేదు.జగన్ ను వదిలి పెట్టి "షో" అన్నారు.
మా వాళ్ళు పొలాల్లో పేకాట ఆడుతున్నప్పుడు వాళ్ళకు ఉప్మాలు ..కాఫీలు అందించడానికి ఎవరినైనా పన్లొ పెట్టుకుంటుంటారు. వీళ్ళకు పేకాట గురించి పెద్దగా తెలియదు ...ఆ ఆడే వాళ్ళలో గెలిచినవాడు "షో " అని అరిచినప్పుడు వాళ్ళ అరుపులకు కేరింతలకు ..హావ భావ విన్యాసాలకు ..వీళ్ళు కూడా ఆనంద పడడం ఈ పనివాళ్ళకు నెమ్మదిగా అలవాటై పోతుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రజల పరిస్థితి అదేనా....
కొసమెరుపు...
జగన్ బాబు ని కాస్త రెస్ట్ తీసుకోనిమ్మని చాకో మహాశయులు ప్రజలకు విజ్ణప్తి చేస్తున్నారు. పైగా జైలు లో ఎక్కువ కాలం ఎవరినీ ఉంచడౌంచడం కాంగెస్ కు ఇష్టం ఉండదంటున్నారు.
...రానున్న దొంగల రాజ్యమా....వర్ధిల్లు...వర్ధిల్లు....