చెప్పేవాడికి వినేవాడు లోకువ......నేను చెబుతూ ఉంటాను ...మా బావమరిది వింటూ ఉంటాడు.బావ మరిది అంటే మా శ్రీమతికి అన్నే అని కాదు వాడు నాకు మేనమామ కొడుకే. కానీ ఇప్పుడు సీను రెవర్స్ లో ఉంది. అంటే వాడికేదో జ్ణానం ఒకే సారి పెరిగి పోయిందని కాదు. ప్రస్తుతం వాడి చేతులో గ్లాసు ఉంది..... దానిలో ద్రవం ఉంది.అదిస్తున్న బలం ఉంది. పక్కన వాడి చెల్లెలు వండిన పకోడీలు ఉన్న ప్లేటు ఉంది.
"సరేరా మొత్తానికి నీవు చెప్పేదేమిటి" మా బావ మరిది మరలా అడిగాడు.
నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. నేనెన్ని సార్లు చెప్పినా వాడి బుర్రకు అంతకంటే ఎక్కదని నాకెప్పుడో అర్దమయ్యింది.
"నీవన్నది కరెక్టే గాని మరీ "ఆ నలుగురూ" లో రాజెంద్ర ప్రసాద్ లా నూటికీ కోటికీ ఒక్కడుంటాడు. పైగా మనిషన్నాకా యీ మాత్రం కళలుండాలి"
వాడి రెండు చేతులూ చూపించాడు.
"ఆ మాత్రం కొద్దిగా నాకూ ఉన్నాయి కదరా..."
"యేంటి బాబూ...నీ పొట్టలో పోసినా ఒకటే ..డస్ట్ బిన్ లో పోసినా ఒకటే....ముఖంలొ కొంచెం ఫీలింగ్సన్నా మారవ్..."
తాగిన తరువాత ఎలా ఉండాలన్న విషయంలో వాడికి చాలా స్థిరాభిప్రాయాలున్నాయ్.
" మన చిన్నప్పుడు ఇద్దరం కలసి ఒక సైకిల్ మీద మన క్వారీ కాలవ గట్టు మీదుగా కడియం టూరింగ్ టాకీస్ లో సినిమా చూసొచ్చి బోల్డంత ఆనంద పడే వాళ్ళం....మరిప్పుడు మన అబ్బాయి గార్లకు అలా వెళ్ళమని చెప్పి చూడు...నిన్నూ నన్నూ కలిపి తొక్కేత్తారు.కాబట్టి మారిన కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారాలి మరి"
సరేలే అన్నట్టుగా తల వూపి పక్కనున్న పుస్తకాన్ని నెమ్మదిగా అందుకో బోయాను.
" ఒరెయ్ బాబూ నీకో నమస్కారం ...అవి మాత్రం కాస్సేపు ముట్టుకోకురా బాబూ......" గట్టి గా అరిచాడు. తింటున్న పకోడీ గొంతులో అడ్డు పడుతుందేమోననుకున్నాను. కానీ మరింత ద్రవంతో దానిని లోనికి నొక్కేసాడు.
"సరేరా..... ఇప్పుడు నేనేం చేయాలి?" నెమ్మదిగా అడిగాను.
"అమ్మయ్య దారిలోకి వచ్చావురా బాబూ.....ఇప్పుడు వచ్చిన గొడవేమిటంటే నీ మాట తప్ప అది ఎవరి మాటా వినదు కాబట్టి నీవు ఊ.. అంటే అది కూడా ఊ... అన్నట్లే.ఆ విధంగా చూస్తే అది నీ కంటే బెటెరే అనొచ్చు నీవైతే ఎవరి మాటా వినవు కదా....."
"మొన్ననే మీ వాసు చిన్నాన్న ఇలానే ...ఏరా అమ్మాయికి పెళ్ళి సంబందాలు చూడవా అని అడిగాడు..."
"మరేం చెప్పావ్..."
"రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి మగవాళ్ళు .....చీరలు బంగారం...గురించి ఆడవాళ్ళు మాట్లాడని కుటుంబం ఏదైనా ఉంటే అలాంటి కుటుంబంలో పెరిగిన కుర్రాడెవరైనా ఉంటే చూడు "అన్నాను
ఉలిక్కిపడ్డాడు.ఎందుకో నాకు తెలియదు.
"ఏం చెప్పావురా...?"
మరలా అదే చెప్పాను.
"బుజ్జీ నీవెళ్ళి ఒక ఆమ్లేట్ వేసి పట్రావే ....ఇవ్వాళ నా కోటా దాటడం ఖాయం....వీడెక్కడ దొరికేడే బాబూ నీకు...ప్రపంచంలో ఇలాంటి కండిషన్స్ ఎవడైనా పెడతాడా..."తన చెల్లెలి వంక చూసి చెప్పాదు.
"అంతే కాదొరే.... వాళ్ళకు కాస్త చైతన్యం కూడా ఉండాలి"
వాడు కాస్త రిలీఫ్ గా చూసాడు.
"అది ఫరవాలేదులేరా యీ రోజుల్లో రాజకీయాలగురించి తెలియని వాడెవ్వడులే.."
"రాజకీయ చైతన్యం అంటే నీకు నచ్చిన వార్తలు వేసే పేపర్ మొదటి నుండి చివరి వరకూ చదివేయడం కాదు..."
"చ...చ..అదేమీ కాదు...నేనున్నాననుకో...ఇంటిదగ్గర ఈనాడు...ఫాక్టరీలో...ఆంధ్ర జ్యోతి ...పక్కింటి మాస్టరు గారింటి నుండి సాక్షి తెప్పించుకొని మరీ చదవుతాను.
"మరి ఒక్కటడుగుతాను చెప్పొరే...మన చిన్నప్పుడు మన వూరి కంసాలి భద్రం గరికి ఒక్క ఇల్లే ఉండేది...కానీ మనం పెద్దయ్యే సరికి వాళ్ళ కొడుకులుకు ఒక్కక్కళ్ళకూ ఒక్కొక్క మేడ కట్టించి ఇచ్చాడు...."
"అవును.."
"ఆ టైం లో మన రైతుల్లో ఎవరూ కూడా అంతంత ఇళ్ళు వారసులందరికీ కట్టి ఇవ్వ లేదు"
"అవును"
"ఇప్పుడు మన వాళ్ళు వాళ్ళ దగ్గరకు కూడా కాకుండా ఆ మద్య కాలంలో రాజమండ్రీ లో జెట్టీ జ్యూయలర్స్ లాంటి షాప్ లకు వెళ్ళేవారు.అవునా..."
" ఆ తరువాత నెమ్మదిగా మన వూల్లో అమ్మకానికి వచ్చిన పొలాలన్నీ...ఆ జ్యూయలరీ షాపుల వాళ్ళూ..బట్టల షాపుల వాళ్ళూ మాత్రమే కొన్నారు అవునా...."
"అవును"
"అంటే ...మన రైతుల దగ్గర ఉంటున్న సేవింగ్స్ ఏదైనా ఉంటే అది నెమ్మదిగా ఎవరి దగ్గరకు వెళ్తోంది?"
"షాపుల వాళ్ళ దగ్గరికే...."
"వాళ్ళేం చేసారు..?"
"ఏమి చేస్తారు .....లేఔట్ లు వేసారు"
"మన పక్క వూరు వరకూ లెక్కేస్తే ఇంచు మించు 12000X500=6000000 చదరపు మీటర్ల
వ్యవసాయిక భూమి ఉత్పాదన లేకుండా పడి ఉంది.అవునా...."
"కాదని ఎందుకంటాను.."
"అంటే మన ఆడంబరాలు ...అలవాట్లు మనలనే మన భూముల నుండి దూరం చేస్తున్న పరిస్థితులుంటున్నప్పుడు మనం ఇంకా మారవలసిన అవసరం లేదంటావా....ఆ మాత్రం చైతన్యం ఉన్న వాళ్ళతోనే మనం సంబందాలు పెంచుకునే అవసరం లేదంటావా....?"
వాడు గాల్లోకి చూస్తూ ఉండిపొయ్యాడు."చాలా కష్టం....చాలా కష్టం.." అంటూ రెండు మూడు సార్లు గొణిగాడు.
"అంటే బిజినెస్ చేసే కుటుంబాల లో సంబందాలు ఏవీ పనికి రావా...."
"అలా అని నేననను....నీకొక చిన్న ఉదాహరణ చెబుతాను...మనకుండే వాతావరణ పరిస్థితులలో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ తో ఇళ్ళు కట్టే ఆలోచన చేయొచ్చు. మొదట్లో ఖర్చు ఎక్కువవ్వొచ్చు..కానీ ఏ.సీ.ల ఖర్చు తో పోలిస్తే...ఐదారు సంవత్సరాల లోనే ఆ మాత్రం సేవ్ అవుతుంది.వనరులు మిగులతాయ్....పర్యావరణానికి రక్షణ ......నా ఉద్దేశం ఏమిటంటే మనం చేసే ఏ పనైనా మనకు ఆదాయాన్ని ...ఆనందాన్ని యీయడంతో బాటు ..సమాజానికి ఏ విధమైన హానీ చేయకుండా ఉండాలి.ఏ సమాజంలో నీవు బిజినెస్ చేస్తున్నావో దాని బాగోగుల గురించి కూడా కాస్త ఆలొచించాలి. అంతే గాని...క్లబ్ హౌస్ అనీ...స్విమ్మింగ్ పూల్ అనీ....పవర్ వేస్ట్ చేసే సౌకర్యాల కంటే ఇది చాలా బెటర్ కదా..."
"ఒరేయ్....ఎక్కడో అక్కడ కోచింగ్ తగలెట్టి ఐ.ఐ.టీ...లోనో...బిట్స్ లోనో...ఎన్.ఐ.టీ లోనో చదివేసి....హాయిగా ఉద్యోగం చేస్తూ....నీవన్నావే...స్విమ్మింగ్ పూల్..క్లబ్ హౌస్ ఉన్న ఫ్లాట్ కొనుక్కుని ...ఒక మాంచి కార్ లో రోడ్ మీద సర్రున జారే విధంగా డ్రైవ్ చేస్తూ ..బ్రతకాలనుకునే కుర్రాడిని తేగలం కానీ.....ఈ చైతన్యం..అదీ ఉన్న వాడు ఎక్కడ దొరుకుతాడ్రా బాబూ....చీ...చీ...బుర్ర పాడై పోయింది ఇంకో క్వార్టర్ తెచ్చుకోవాలి....ఒరేయ్...నీ డిమాండ్లు అన్నీ ఇప్పుడే చెప్పు మళ్ళీ అవింకొక సారి చెప్పేవంటే తెచ్చిన క్వార్టర్ కూడా చాలదు....బుజ్జీ.....వీడూ..వీడికూతురూ...మొండోళ్ళే......కష్టాలన్నీ నీకూ...నాకే.....సర్లే నీవు ఆమ్లేట్ లో ఉల్లి పాయలు వేయడం మరిచి పోకు..." అంటూ బయటకు కదిలాడు.