పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగకు ఆనందంగా మా వూరు వెళ్తుండగా మా పాప ఫోన్ చేసి ఒక మంచి ఆనందకరమైన వార్త చెప్పింది. తనకు కాట్ ఎగ్జాం లో 99.69 పెర్సెంటైల్ వచ్చిందని. అనుకోకుండా ఆ రోజు ఎల్.టీ.టీ ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ యెక్కాం. అంతకు ముందు ఏ.సీ. ఎక్కడమే తప్ప మా వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ యెక్కి ఉండ లేదు.పైగా ఒక స్నేహితుని కుటుంబం అనుకోకుండా కలిసింది. ప్రయాణం చాలా ఆనందంగా సాగుతుండంగానే మా పాప ఆ వార్త చెప్పింది. మా వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయ్. ఆ సమయం లోనే అనుకున్నాను మా వూరిలో కూడా ఏవో కొన్ని అందరికీ ఆనందాన్నిచ్చే పనులు చేయలని. మా బంధుజనం లోని కుర్రాళ్ళని అక్కడ నుండే కాంటాక్ట్ చేసాను.సరదాగా వాలీ బాల్ టోర్నమెంట్ పెడదామన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన టోర్నమెంట్ కూడా అదే. వూళ్ళోకి దిగగానే ఆ ఏర్పాట్లలో పడ్డాను. మా కుర్రాళ్ళు చెప్పినదాని ప్రకారం ముందుగా ఎంపైర్లను వెదుక్కోవాలి.మా వూరి స్కూల్ డ్రిల్ మాస్టారి ఇంటికి వెళ్ళాం. అప్పుడే చూశాను జీవన్ దాసు మేస్టారిని. వచ్చీ రాగానే పార్టిసిపేట్ చేస్తున్న టీం ల లిస్ట్ లు తీసుకుని ఒక చిన్న పిల్లాడిని పిలిచి ద్రా తీయిచేసారు.ఆ వెంటనే టోర్నమెంట్ షెడ్యూల్ కూడా చకా చకా తయారు చేసేశారు. ఒక అనుభవజ్ఞుడైన టైలర్ గుడ్డను చకా చకా కట్ చేసి కుట్టడానికి రెడీ చేసిన తీరులో ఆయన ఆ టోర్నమెంట్ ఏర్పాట్లు చేసేసారు. ఎక్కువ మాట్లాడరు. ఆ ఏరియా లో ఉన్న డ్రిల్ మాస్టర్లందరికీ ఆయన గురుతుల్యులు. మొదటి రోజు ఏర్పాట్ల బిజీ లో ఉండడం వలన మేమిద్దరం మొదటి రోజున ఎక్కువగా మాట్లాడుకో లేదు. రెండో రోజు ఉదయం పూట ఆయన అందరికంటే ముందు వచ్చి టోర్నమెంట్ కోసం వేసిన షామియానా లో కూర్చున్నారు. అంతకు ముందు నేను చూసిన బ్రెజిల్...యూ.ఎస్. టీం ల మద్య జరిగిన ఒక మాచ్ గురించి మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్న సర్వీస్ లా మన వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయడం లేదని అడిగాను.
" చేసే వాళ్ళు ఉంటారు సార్...మా వాడు చేసే వాడు" అన్నారు.
"అరే....మరి టొర్నమెంట్ కు రాలేదే "
మాస్టారు సెల్ ఫోన్ తీసారు.వాళ్ళబ్బాయికి ఫోన్ చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ దాంట్లో ఫొటోస్ ఓపెన్ చేసి ఒక యువకుడి ఫొటో చూపించారు.
" వీడే సార్....మా వాడు"
ఏదో అనుమానం మనసులో లీలగా మెదిలింది.
"అంటే...'
"లేడు సార్...నన్నిలా వదిలి వెళ్ళిపొయ్యాడు......నా కోరిక మేరకే వాడు మంచి వాలీ బాల్ ప్లేయర్ అయ్యాడు...డ్రిల్ మేస్టరుగా సెలెక్షన్ కూడా వచ్చింది.....నా ఖర్మ...లవ్ ఫైల్యూర్...వద్దని మేము అనలేదు... ఆ అమ్మాయి ఒప్పుకోలేదు....యీ అమ్మా ...నాన్నా...వాడికి గుర్తు రాలేదు.."
అప్పుడు నాకర్ధమయ్యింది. మాష్టారు ఎందుకు ఆ ఆట లో ములిగి పోయి ఉంటారో ..ఒక విధంగా ఆయన వాళ్ళబ్బాయి తో కలిసి ఉంటున్న ఆనందంలో ఉంటారేమో.
ఆ రోజు సాయంత్రం మాస్టారు నన్ను పక్కకు పిలిచారు.
" నాదో చిన్న రిక్వెస్ట్ సార్...."
మాస్టారి రెండు చేతులూ పట్టుకున్నాను.
" మీరు మాకెంతో సహాయం చేసారు....నా ఆనందాన్ని నేను ..మా వాళ్ళంతా పుట్టిన నా గ్రామానికి కొంతైనా పంచుదామనుకున్న నా అలోచనకు రూపాన్నిచ్చిందే మీరు. ఎవరికి ఏ గిఫ్ట్ లు కొనాలో చెప్పండి అన్నీ ఇప్పుడే కొనేద్దాం." మాస్టారు గిఫ్ట్ ల కోసం సంకోచిస్తున్నారేమో అనుకున్నాను.
"అలాంటిదేమీ లేదు మీరు యువకులుగా ఉన్నప్పుడు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఎలా కండక్ట్ చేసేవారో చాలా మంది చెప్పారు.....నాకు రేపు సాయంత్రం కొంచెం త్వరగా సెలవిప్పించాలి"
"అదేమిటి మాస్టారూ....రేపు సాయంత్రం ఘనంగా బహుమతి ప్రధానోత్సవం చేయాలనుకున్నాం కదా....'
" ఆ కార్యక్రమమే... కొంచెం త్వరగా ముగించేద్దామని...."
" మీ ఇష్టం మేస్టారూ.....మీకెలా బాగుంటుందో అలా చేయండి" మేస్టారి మీదే పెట్టేసాను. కానీ కారణం కనుక్కోవాలనిపించింది.అడిగేసాను.
" ఏమీ లేదు సార్....మా వాళ్ళంతా పార్టీ మారారు...ఏదో కొత్త పార్టీ పేరు మీద మా వీధిలో ముగ్గుల పోటీల లాంటివి పెడుతున్నారు...నేను దూరంగా ఉంటే బాగుండదు కదా...అని"
"ఓస్ అంతేనా...అలాగే కానిచ్చేద్దాం సార్" మాస్టారిని ఆప్యాయంగా సాగనంపాను.
తరువాత రోజు అన్నీ సక్రమంగా ముగిసాయి.మాస్టారిని సాగనంపడానికి కొంతదూరం నడుచుకుంటూ వచ్చాను.
ముందు రోజు రాత్రి నుండీ నా మనసులో మెదులుతున్న సందేహాన్ని అడుగుదామా లేదా అనే మీమాంసలో ఉన్నాను. ఒక సారి మాష్టారి ముఖంలోకి చూసాను. చిరునవ్వుతో ఉన్నారు.
"చాలా సహాయం చేసారు మాష్టారూ...వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేద్దాం సార్" మరొక సారి కృతజ్ణతలు తెలియ జేసాను.
" యీ రోజుల్లో తమకు కలిగిన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే వాళ్ళే ఉండరు సార్..అటువంటిది మీరు ఇంత కార్యక్రమాన్ని నెత్తిన వేసుకుంటే ఆ మాత్రం సాయం చేయడంలో ఏముంది సార్"
మాష్టారి వినయం చూసి కాస్త ధైర్యం వచ్చింది.
"మాష్టారూ మూడు రోజులనుండీ మిమ్మలను చూస్తున్నాను...మీ మంచితనం అర్ధం అయ్యింది..కాబట్టే ఒక్క చిన్న ప్రశ్న అడుగుదామనుకుంటున్నాను. తప్పైతే క్షమించండి."
"అయ్యో అదేమిటి సార్....అడగండి"
"ఏమీ లేదు మాష్టారూ....మనం ఒక కొత్త రాజకీయ పార్టీలోకి మారాలంటే దాని విధానాలు పాత పార్టీ విధానాల కంటే మనకు సహాయ పడేవిగా ఉందాలి కదా....(నేను కావాలనే అభ్యుదయం అన్న మాట వాడ లేదు).అటువంటివేమన్నా మీకు స్పష్టంగా ఉన్నాయా...దయుంచి సంక్షేమ పధకాల గురించి మాత్రం చెప్పకండి. మరలా అదో పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది."
"అదేమీ నాకు తెలియదు సార్..ఇప్పటిదాకా మేమున్న పార్టీ ఇంతకు ముందులా లేదని యీ కొత్త పార్టీ లోకి మారిపొయ్యారు...నేను మాత్రం నలుగురితో బాటు...అంతే...."
" ఒక్క మాట సార్...నిజంగానే ఇప్పటి వరకూ ఉన్న పార్టీ ఇంతకు ముందులా లేదు...అలానే అనుకుందాం ..అలాంటప్పుడు..యీ కొత్త పార్టీ కంటే ముందే ఒక వివాద రహితుడు ..మేధావి గా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఒక పార్టీ పెట్టాడు కదా.....మరి దాని గురించి అలోచన కూడా చేయకుండా యీ కొత్త పార్టీ మీద ఇంత ప్రేమ ఏ ప్రాతిపదిక మీద పుట్టుకొస్తోంది? ఆ ప్రాతిపదిక కరెక్టేనా.....మార్పు కావాలనుకున్నప్పుడు మంచి వాళ్ళనివదిలేసి అత్యంత వివాదాస్పదుడిగా ఉన్న వ్యక్తి వెనుక సమీకృతమవ్వడం మంచిదేనా? ఈ మార్పు మీకు గాని ..సమాజానికి గాని...వ్యవస్థకు గాని ఏమైనా మేలు చేస్తుందా సార్? ఇదే ప్రాతిపదికను ఎదుటి వాళ్ళు కూడా అనుసరించరా? పోనీ యీ కొత్త నాయకుడు గతంలో ఉద్యమాలలో పని చేసాడా...ఏమైనా ఆర్ధిక వేత్తా....లేక ఏదైనా పర్యావరణ ఉద్యమాల లాంటి వాటిలో పని చేసాడా....ఏదైనా ఒక్క ప్రత్యేకత చెప్పండి. ఇదంతా మీతో ఎందుకని అంటున్నానంటే మీ మంచితనం నాకు నచ్చింది...మీలాంటి వాళ్ళు అలోచిస్తే సమాజానికీ...వ్యవస్థకూ మంచి జరగొచ్చని ఆశ అంతే వేరే విధింగా అర్ధం చేసుకోకండి "
"ఎంత మాట సార్ ..కులాల పేరుతో బాడ్మింటన్ కోర్ట్ లు ఉన్నటువంటి ఈ గ్రామంలో మీ కాలేజ్ రోజుల్లోనే ఒకే బాడ్మింటన్ కోర్ట్ లో ఊరందరినీ ఆడించిన మిమ్మలని తప్పుగా ఎలా అర్ధం చేసుకుంటాను సార్. కానీ ప్రస్తుతం మీకు సమాధానం చెప్పలేను....ముందుగానే చెప్పాను అబ్బాయి పోయిన దగ్గరినుండీ ఒంటరిగా ఉండలేక ...ఎప్పుడూ నలుగురి మద్యలో ఉండాలనే ఇన్ని వ్యాపకాలు పెట్టుకుంటున్నాను.ఎక్కువగా ఆలోచించి ..ఆ తరువాత వాదించితే ఆ నలుగురికీ దూరమైపోతానేమోనని భయం సార్..అంతే..టోర్నమెంట్ త్వరగా ముగించేసి మిమ్మలని బాధ పెట్టి ఉంటే క్షమించండి".
మాష్టారి చెయ్యి ఆప్యాయంగా నొక్కి సెలవు తీసుకున్నాను.