స్థలం: వెయిటింగ్ హాల్ ,ఐ.ఐ.ఎం.కలకత్తా
పీ.జీ.డీ.యెం. కోర్స్ కు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయ్. అదృష్టమో... యేంటో తెలియడం లేదు....కార్పొరేట్ నాయకులను తయారు చేసే కార్ఖానా లోకి అడుగు పెట్ట గలిగాను ..మా అమ్మాయికొచ్చిన కాట్ స్కోర్ వలన.
"అదేంటమ్మా....అలా బిగదీసుకుపోయి ఉన్నారేంటి..?
మా అమ్మాయిని అడిగాను..అక్కడకొచ్చిన యువతీ యువకులను చూసి....
"వూరుకో నాన్నా...మన తెలుగు వాళ్ళు కూడా ఉండొచ్చు ఇక్కడ .....టెన్షన్ వలన ముఖాలు అలానే ఉంటాయి.... "
"టెన్షన్ యెందుకమ్మా.....వీళ్ళడిగిన కట్ ఆఫ్ మార్కులకి బయట కూడా మంచి ఉద్యోగాలో....వేరే కాలేజ్ లలో గాని సీట్ దొరుకుతుంది కదా...,ఇంత గొప్పవి కాక పోయినా ఉద్యోగానికైతే ఢోకా ఉండదు కదా......."
"ఇప్పుడవన్నీ యెవరూ చూడరు నాన్నా...ఇక్కడ వచ్చే పేకేజ్ రేంజ్ వేరు."
నిజమేనేమో.....కాంపస్ల లోనే ఉద్యోగాల సెలెక్షన్ అంటేనే మా టైం లో పెద్ద ఆశ్చర్యం.
యే.సీ. బాగానే పని చేస్తుంది. అయినా చాలా మంది ముఖాలకు చెమటలు పడుతూనే ఉన్నాయి. మధ్యలో లేచి టాయిలెట్ కి వెళ్ళి వస్తున్నారు. ఇంటర్వ్యూ దగ్గర పడ్డ వారు సూట్ సరి చేసుకుంటున్నారు.
"నీవు కూడా సూట్ వేసుకోవలసింది పప్పీ ...."
శ్రీమతి మా అమ్మాయికి సలహా యీయబోయింది.
"వూరుకోమ్మా...బయట ఉక్క యెలా చంపేస్తుందో చూడు.. నా ఒంటికి యేది హాయి అనిపిస్తే అది వేసుకుంటాను...."
మా అమ్మాయి ఖయ్యిమంది.
నిజానికి ఆ మాటలో చాలా విలువుందనిపించింది. మనకు నచ్చినట్టుగా మనం ఉండడానికి మించిన ఆనందం ఏముంది ? హుందాతనానికి సూట్ వేసుకోవడమొక్కటేనా మార్గం? నిజానికి సూట్ వేసుకున్నందుకు ఒక్క మార్క్ యెక్కువ వేసినా అది ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళ బానిస బుద్దికి నిదర్శనం మాత్రమే అవుతుంది.
ఎందుకో నాకు ముందు నుండీ కొన్ని సందేహాలు ఉంటూ ఉండేవి.ఈ కాలేజ్ అంటే ఐ.ఐ.ఎం. లాంటి విద్యా సంస్థలు కార్పొరేట్ లీడర్లను మాత్రమే తయారు చేస్తాయా... ? నిజమే 1500000 ఫీజ్ కట్టి సమాజానికి పనికి వచ్చే చదువు ఎందుకు చదవాలి?
ఇక్కడే ఇంకొక సందేహం కూడా వస్తుంది. సామాజిక ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా ఎందుకు ఉండాలి?
మా అమ్మాయికి ఫైనల్ సంవత్సరపు పరీక్షలు లాంటివి యెక్కువగా ఉండడంతో మంచి మంచి టాపిక్ పై ఆర్టికల్స్ కోసం నేను ఎక్కువగా చదివాను. మొత్తానికి మా అమ్మాయికి ఎలా ఉన్నా గానీ నా జ్ఞానాభివృద్దికి బాగా ఉపయోగపడింది.
అలా చదువుతున్నపుడే కొన్ని కొన్ని విచిత్రమైన విషయాలు కూడా తెలిసాయి. ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లాంటి టాపిక్స్ గురించి చూస్తున్నప్పుడు హ్యూమన్ హేపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటుందనీ.....దానిలో కూడా రాంక్స్ ఉంటాయనీ వాటికీ హ్యూమన్ డెవలప్మెంట్ లో ఇచ్చిన రాంక్స్ కు చాలా వత్యాసాలు ఉన్నాయనీ....
అంటే డెవలప్మెంట్ అనేది అన్ని వేళలా సంతోషాన్ని సృష్టించదని చాలా స్పష్టంగా అంకెలతో నిరూపితమయ్యింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన పక్కనే ఉన్న చిన్న రాజ్యం భూటాన్ అత్యంత సంతోషంగా జీవించే దేశాల జాబితాలో 8 వ రాంక్ లో ఉంటే అమెరికా 22వ రాంక్ కు పరిమిత మయ్యింది. మరి మనకు ఆనందం కావాలా....అభివృద్ది కావాలా...కొంతమందికే ఫలాలు దక్కే అభివృద్ది మనకు అవసరమా.....
అలాగే ఒక ఉత్తమమైన వ్యాపారమంటే ఏమిటి ......అనేదానికి నిదర్శనంగా నిలిచిన ఆర్చిడ్ హోటల్ దానిని ఆ స్థానంలోకి తెచ్చిన వెంకటేష్ కామత్ భారత వ్యాపార ప్రపంచానికి ..అలాగే యావత్ ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాలకు అందించిన సందేశం ...అనేక విషయాల గురించి మా అమ్మాయి బాగా చదివింది కానీ వాటి మీద మా అమ్మాయినే కాదు ఆ రోజు ఇంటర్వ్యూ లో యెవరినీ అడగలేదు...మరొక రోజు ఎప్పుడైనా అడిగారేమో తెలియదు. అత్యుత్తమమైన మూడు కాలేజ్ ఇంటర్వ్యూలు చూసిన తరువాత నాకనిపించిందేమిటంటే ఆ ఇంటర్వ్యూల కెళ్ళే వాళ్ళు జ్ఞానాని కన్నా అదృష్టాన్ని నమ్ముకుని వెళ్తే ఉత్తమమని.
అక్కడ అటెండ్ అవుతున్న వాళ్ళని చూస్తే ఎందుకో గాని నాకు గోదావరి తీరంలో ఉన్న మా స్వంత వూరికి వెళ్ళినప్పుడు .."యేరా అబ్బాయి..ఇదేనా రావడం..అంటూ పలకరించే మా నాన్న గారి అన్నదమ్ములు... ఎండని పడి వచ్చావ్..కాళ్ళు కడుక్కో ..భోజనం చేసేద్దువు కాని..అంటూ పీట వాల్చి పళ్ళెం పెట్టే మా పెద్దమ్మలు...పిన్నమ్మలు...మిగిలిన బంధువుల అప్యాయంతో కూడిన పలకరింపులు..వ్యవసాయాలు కిట్టక పోయినప్పటికీ యెండల్లో పడి పనిచేసి ఇంటికి వచ్చి భోజనం కానిచ్చి కాస్త నడుము వాల్చి ..లేచిన తరువాత తుండు భుజాన వేసుకుని పొలానికి పొయ్యే ఆ కర్మ యోగులు మనసులో మెదిలారు. వీళ్ళ స్థాయికి వాళ్ళు ఏనాటికీ రాలేక పోవచ్చు.....
ఇంటర్వ్యూ పూర్తి చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న కాంటీన్ కు వెళ్ళి యేవేవో ఆర్డర్ చేస్తున్నారు. ఇంచుమించు అందరి చేతుల్లోనూ...సాండ్విచ్చెస్ ..కోలా బాటిల్స్... పక్కనే ఫ్రిజ్ లో పడి ఉన్న అమూల్ బటర్ మిల్క్ బాటిల్ ను పాకెట్స్ ను వెనక్కి పడేసి ఆ కాంటీన్ కుర్రాడు కోలా బాటిల్స్ ను ఫ్రిజ్ లో సర్దుతున్నాడు......మేము నెమ్మదిగా బయట పడ్డాం.