2, ఫిబ్రవరి 2011, బుధవారం

మా వూళ్ళో కళలు -కళాకారులు

నా చిన్నప్పటి నుండీ మా వూళ్ళో వినాయక చవితి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. నాకు వూహ తెలిసినకొత్తలో మా మావయ్య శ్రీ మార్ని సత్యనారాయణ ,శ్రీ రిమ్మలపూడి గంగా రావు మొదలగు వాళ్ళు పల్లె పడుచు అనేనాటకం ఉత్సవాల్లో వేయడం నాకు గుర్తుంది. మా నాన్న గారు ఉద్యోగ రీత్యా మేము వేరే వూళ్ళో ఉండే వాళ్ళం కాబట్టిఅప్పట్లో మా ఊరిలో ఉన్న కళా కారుల గురించి ఆనాటి వాళ్ళ దగ్గర నుండీ వివరాలు సేకరించి ముందు ముందుమరింత వివరంగా రాస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కూడా పోతమ్మ హోటల్ లో సాయంత్రంఅయ్యేసరికి మా తాతయ్య తమ్ముడు శ్రీ మార్ని గనేస్వర రావు గారు ఒక పాత హార్మోనియం పెట్టెతో రాగాలాపన చేయడంఇంకా చాలా మంది గుర్తుల్లో ఉంటుంది చాటుగా ఐతే ఆయనకు ఇంకా చాలా కళలు ఉన్నాయని జనం అంటారు గానీప్రస్తుతం ఎనభై ఆరవ వసంతం నడుస్తున్న ఆయన కళల గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించడం అనవసరం. అంతేకాకుండా భజన బృందం ఒకటి ఉండేది. వాళ్ళు హై పిచ్ లో తాళం వేస్తున్నప్పుడు వినడానికి బాగుండేది. దానికి వాద్యసహకారం కూడా ఉండేది. టీవిలు జనాన్ని ఇళ్ళల్లో కట్టేస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే అవి తరువాత తరాలకుసంక్రమించే అవకాశం లేదు. నేను తాడికొండ ఆశ్రమ స్కూల్ లో చదివాను కాబట్టి నాకంటే విషయాల మీదఅవగాహన ఉన్న వారు వివరంగా రాస్తే బ్బగుంటుంది. ఇవి కాకుండా స్త్రీల కళల గురించి వేరే పోస్ట్ లో.....