టక ..... టక .....
ఛీ ... పొద్దున్నే చంపేస్తారు సెలవు రోజున కూడా .....
పాలు తెచ్చే పని లేదు ... శ్రీమతి , పుత్రరత్నం వూరెళ్ళారు కాబట్టి ..... ఆనందంగా రెస్ట్ తీసుకునే మూడ్ లో ఉండగా .....
టక ..... టక .....
తలుపు తీశాను ......
ఎదురుగా ఒక వెర్రి నవ్వు నవ్వుతూ ఒక యువకుడు ....
సార్ ..... మీరేమీ అనుకోక పోతే నాకు ఒక్క అయిదు నిముషాల టైం ఇవ్వండి .... మరలా వెర్రి నవ్వు ......
జాలి వేసింది .... లోపలికి రానిచ్చాను .
"మీకొక మంచి investment ప్లాన్ చెప్పొచ్చా సార్ ?"
"చెప్పు ..... " కసి గానే అన్నాను .
"సార్ .... మార్నింగ్ వాక్..... సముద్రాన్ని చూస్తూ చేస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది కదా ..... "
"పగలంతా నా ఉద్యోగం ..... నడిచే ఉద్యోగమే ..... వేరే వాకింగ్ అవసరం లేదు ...... "
"అలా కాదు సార్ .... ఎటు చూసినా పచ్చదనం ఉండే పరిసరాలు ..... ఇంకా .... "
"అవసరం లేదు ... మా రైల్వే ట్రాక్ ఇళ్ళ మధ్య ఉండదు ..... పచ్చదనం మధ్యే ఉంటుంది . "
"నాకు ఒక్క చాన్స్ ఇవ్వండి సార్ ... మీరు ఎండలో పగలంతా తిరిగి వచ్చి మా .... హిల్స్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోకి దిగి ..... "
"ఆగాగు .... సైట్ నుండి తిరిగొచ్చిన నా శరీరంతో స్విమ్మింగ్ పూల్ లోకి దిగాననుకో ..... ఆ నీళ్ళన్నీ కుళ్ళు కంపు కొడతాయ్ ..... అవన్నీ చెమటంటే తెలియని వాళ్ళకోసం ..... మా లాంటి వారి కోసం కాదమ్మా ...... "
"మీకింకో ఆప్షన్ ఉంది సార్ ...... మీరు ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి స్విమ్మింగ్ పూల్ లోకి దిగొచ్చు ..... "
"నీవు చెప్పిన ఆప్షన్స్ .... మాకుండవ్ ..... మాకింటికి వచ్చిన తరువాత మా పెద్దాఫీసర్ లు పగలంతా చేసిన వర్క్ మీద రివ్యూస్ ....చేస్తారు తెలుసా ?"
"అదేంటి సార్ ..... వాళ్లకు ఫేమిలీస్ ఉండవా పాపం .... ?"
" ..... వాళ్లకు ఫ్యామిలీస్ ఉండవా .. వాళ్ళకు టేస్ట్ లు తెలియవా .....వాళ్ళు చిట్టు ,ఉలవలు మాత్రమె తినేవాళ్ళా ....... వాళ్ళు ఆఫీస్ టేబుల్స్ ని మాత్రమే ప్రేమిస్తారా? ..... లాంటి వెధవ ప్రశ్నలు వేయకు .... నీవు చెప్పాల్సింది చెప్పు చాలు "
"మీ భాష చూస్తుంటే మీరు మీ ఉద్యోగంతో ఎంత విసిగి పోతున్నారో అర్ధం అవుతుంది సార్ " ఐనిస్టీన్ లెవెల్లో ఫీలింగ్స్ పెట్టి మరీ చెప్పాడు.
"అయితే .... "
" మీ ఇల్లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే మీ శ్రమను మరిచి పోయి మీరు చాలా త్వరగా రిలాక్స్ అయిపోతారు సార్ ...... దానికోసమైనా మీరు మా ..... హిల్స్ లో ఫ్లాట్ బుక్ చేసుకుంటే ..... "
"ఆగాగు ..... మీ హిల్స్ ఇక్కడకెంత దూరం ?"
"నిజం చెప్పాలంటే కేవలం 30 కిలోమీటర్స్ ఉంటుంది."
" ఈ లోపుగానే చాలా పల్లెటూర్లు తగలుతాయి కదా ..... "
" అక్కడెక్కడైనా ఏదైనా రైతు దగ్గర చిన్న ముక్క భూమి కొనుక్కుంటే నీ .... హిల్స్ లో ఉన్న రేటుకి మూడో వంతుకే రావొచ్చు కదా ..... "
"కానీ సార్ మా ... హిల్స్ లో ఉండే మిగిలిన సౌకర్యాలు ...... క్లబ్ హౌస్ ..... "
"నేను ... నా కుటుంబం ....క్లబ్ హౌస్ లో ఏమి చేయాలి ?"
"అంటే .... మీరు వారం ....వారమ్ సినిమా చూడొచ్చు ..... "
"ఇప్పుడు చానల్స్ లో వస్తున్న సినిమాలు చాలకనా ...... నువ్వు నన్ను ఇన్ని అడుగుతున్నావు కదా ..... నిన్నొక్కటి అడగొచ్చా "
సిగ్గు పడ్డాడు
"అడగండి సార్ "
"నీవు ఎలా రిలాక్స్ అవుతావు "
"సార్ ..... మాదీ ఒక బ్రతుకేనా ..... ఏ ఉద్యోగమూ రాక ఇలాంటి పనికి ఒప్పుకుంటాం సార్ ..... నెలలో ఒక్కటి అమ్మగలిగినా గొప్పే ... తిరగటానికి ఖర్చులిస్తారు .... సెల్ బిల్లులు కడతారు ...... విసుక్కోకుండా సమాధానం చేప్పేవాళ్ళే తక్కువ ... రోజంతా తిరిగి రాత్రికి ఇంటికి చేరుకుంటాం ...... నానుండి ఆశాజనక సమాధానం రాదన్న భయంతో అమ్మా నాన్నా ఏమీ అడగరు ..... నాలుగు మెతుకులు తిని కొద్ది సేపు టీవీ చూసి పడుకుంటాను. "
అతడి కళ్ళలో నీళ్ళు తిరిగాయేమోననిపించింది
"నీవేం చదివావ్ ... ?"
"నా లాంటి నిరుద్యోగులను మీరు వేరే అడగనవసరం లేదు సార్ ..... ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవని వాడెవ్వడని అడగండి ....... "
"నీకు ఈ విధమైన సేల్స్ మాన్ ట్రైనింగ్ మీ కంపెనీ ఇస్తుంది కదా .... "
"అవును సార్ .... "
"మరి నీకు కూడా ఇలాంటి చోట ఒక ఫ్లాట్ ఉంటే పూర్తి సౌఖ్యంగా ఉంటుందనిపిస్తుందా ?"
"మొదట్లో ఎప్పుడో ఒకప్పుడు అలాంటిది ఉండేది ...... నిజాలు కళ్ళ ముందు కనబడుతుంటే అంతలా అనిపించడం లేదు "
"ఏమిటవి ... ?"
"ఇంతకుముందు సేల్ చేసిన వెంచర్ ఎందుకో స్పీడ్ గా పూర్తయి మొత్తం ఆక్యుపై అయిపొయింది ......అన్నీ ఖరీదైన ఇళ్ళే ..... కానీ సార్ ఎవరో గాని వాళ్ళ అమ్మానాన్నలను తేలేదు సార్ ...... ఎవరో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళను తప్పితే మా అమ్మా ..... నాన్నల వంటి వాళ్ళను అసలు తీసుకు రాలేదు సార్ ..... నాకే అనిపించింది .... నిజంగా నాకిక్కడ ఫ్లాట్ ఉన్నా కూడా మా అమ్మా నాన్నలను ఇక్కడకు తీసుకు రాలేమోనని ....... "
ఒక్క ఐదు నిముషాలు అంటూ కిచెన్ లోకి నడిచాను .
రెండు టీ కప్పులతో వచ్చి అతగాడికొకటిచ్చాను.
"నిజానికి కొంత దగ్గరగా వచ్చావ్...... టీ తాగు "
"మాకు మా వూరిలో నాలుగెకరాల పొలం ఉండేది సార్ ...... ఫ్రీ గా ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కదా అని జాయిన్ అయిపోయాను ..... లాప్టాప్ లాంటి ఖర్చులకి రెండెకరాలు అమ్మేసారు .... ఇక్కడికే వచ్చేసి ఒక కాలనీ లో కూరగాయల దుకాణం నడుపుతున్నారు. నాకు బాధగా ఉంటోంది సార్ మా వూరిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఎవరో ఒకళ్ళు మాట్లాడడానికి ఉండే వారు . ఇక్కడ వాళ్లకు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటోంది "
"చూసావా నీవే చెబుతున్నావ్ ..... పెద్దగా డబ్బు లేక పోయినా వాళ్ళు వాళ్ళ స్థానం లో ఉన్నప్పుడు రిలాక్స్ గా ఉండే వారని .... "
"భలే వారు సార్ ..... మా వాళ్ళైతే అక్కడే పుట్టి పెరిగారు కాబట్టి .... "
"నీకొక సంగతి తెలుసా ...... మాది కూడా ఒక పల్లెటూరే ....... అక్కడ మా నాన్న ...... అమ్మ ..... ఉన్నారు. మా పిల్లలు మొన్న మొన్నటి వరకూ వాళ్ళ తాతయ్య పక్కన చేరి మంచి కధలు చెప్పమని అడిగే వారు. వీళ్ళు కాలేజ్ లకు రాక పోతే ఇంకా అడుగుతూనే ఉండే వారేమో ...... ఆ కధల ఎఫెక్ట్ తదుపరి జీవితంలో ఎంత ఉంటుందో నాకు తెలుసు. వంద "ఈ టెక్నో" స్కూళ్ళు కలిసి చెప్పింది వాటి కాలి గోటికి సరి పోవు.
"కరెక్టే గాని ... ఉల్లాసాన్నిచ్చే పరిసరాలు ..... "
"నీకదే చెప్పబోతున్నాను ..... ఉల్లాసాన్నిచ్చే పరిసరాలను ఎంజాయ్ చెయ్యాలంటే ముందు నీ మనసు అందుకు అనువుగా ఉండాలి. "
"నాకు సరిగా అర్ధం కాలేదు సార్ "
" చూడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఉదయాన్నే తూర్పు గోదావరి లో వేమగిరి నుండి రావులపాలెం వరకూ బస్ లో వెళుతూ అటూ ఇటూ చూసుకుంటూ వెళ్ళు ఆ పూల తోటలు ఎంతందంగా ఉంటాయో ....... అదే కుళ్ళి పోయిన మనసు తో శ్రీనగర్ లోని మొఘల్ గార్డెన్స్ లో కూర్చున్నా ఉల్లాసం ఉండదు ..... ఆ తేడా తెలుసుకో .... "
"మనసు ప్రశాంతంగా ఉంచుకోడానికి మీరేమి చేస్తారు ... ?"
"నీకెదురుగా ఏముంది ?"
"కప్ బోర్డ్ "
"దాంట్లో ఏమున్నాయి ?'
"ఏవేవో పుస్తకాలు .... "
"లోపల కప్ బోర్డ్ లలో కూడా ఇవే ఉంటాయ్. సెల్లార్ లో నా పార్కింగ్ ప్లేస్ లో టూ వీలర్ ఉంటుంది. దానిమీదే మేము తిరిగేది. పగలంతా ఉద్యోగంలో కష్టపడడం ..... ఇంటికొచ్చి ఏవైనా software మీద పని చేయడం ..... పుస్తకాలు చదవడం ....... మంచి మ్యూజిక్ వినడం ..... బంగారం మాట ఎత్తగానే శ్రీమతి మీద గయ్యి మనడం . నిద్ర రాగానే ఆ laptop పక్కకు నెట్టి సోఫాలో దిండు కిందకు లాక్కుని పడుకోడం ...... మా పిల్లలూ అంతే ..... ఇలా అడ్డదిడ్డంగా సామానంతా వదిలేసి పడకేసినందుకు తిట్టుకుంటూ .... మా శ్రీమతీ అలానే . ఖాళీ ...లీవ్ కలిసొస్తే మంచి ప్రదేశాలకు వెళ్ళడం ......అంతే "
"మరి ఫ్రెండ్స్ ..... బంధువులూ ..... "
"ఉన్నారు .... హంగూ ఆర్భాటాలు చేయకుండా ..... వీలయినంత వరకూ నలుగురికీ సహాయం చేయాలనుకునే మనస్తత్వం ఉన్న వారందరితోనూ .... మంచి సంబందాలు మైంటైన్ చేస్తాం .... "
"మరి కుళ్ళుతోన్న మనస్సులకు మంచి ఉదాహరణలు కూడా మీరే చెప్పాలి సార్ "
"ఇంకోసారి టీ అడగవు కదా ..... ?"
" లేదు ... సార్ .... "
"జాగ్రత్తగా విను .... నీవు గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే అంటే మీ వూరికి దూరంగానే ఉన్నావు . అనుకోకుండా ఏదో కలిసొచ్చి మీ నాన్న గారు మీ నియోజకవర్గం M.L.A. అయిపోయ్యారనుకుందాం. వెంటనే నీవక్కడ వాలి పోతావన్న మాట. అంతే కాకుండా నియోజకవర్గ కాంట్రాక్టులు మొదలైన అన్ని విషయాల్లోనూ వీలు పెట్టేసి లక్షలు మూటగట్టేస్తావ్. అనుకోకుండా మీ నాన్న పెద్ద జబ్బు చేసి మూల పడిపోతాడనుకుందాం. పార్టీ నీకు టిక్కట్టు ఇవ్వలేదనుకుందాం. నీకు టెన్షన్ స్టార్ట్ అవ్వుద్ది .... నీవే ఇండిపెండెంట్ గా పోటీ చేసేద్దామనుకుంటావ్. ఈ లోపులో నీవు చేసిన దొంగ పనులు మీద కేసులు మొదలై పోతాయ్. పేపర్లోళ్ళు ... కోర్టులు .... నీకు నిద్ర లేకుండా చేస్తూనే ఉంటారు. అయ్యలారా ....... మా నాన్న... జబ్బుతో మూల పడి పోయినా ... జాలి చూపలేదయ్యా ... పార్టీ వాళ్ళు .... అంటూ నీవు జనాల్లో పడతావ్ .... ఎందుకంటే నీకు ఏదో పదవి లేక పోతే జీవితాంతం వూసలు లెక్క పెడుతూనే ఉండాలి. టెన్షన్ తో లో లోపల చస్తూనే దొంగ నవ్వుతో బయట తిరగాలి .... రోజూ టీవీ లో కూడా చూస్తున్నావు కదా ...... ఇది కుళ్ళుతోన్న మనసుకి ఉదాహరణ .
అలాంటి ఎదవ బ్రతుకు కావాలా ..... ?ఏదో కష్టపడి GATE exam కోసం కష్టపడి ఒక మంచి రాంక్ సంపాదించుకుని ఉద్యోగమో .....M. Tech సీటో సంపాదించుకుని ... నాలా సింపుల్ గా బ్రతికితే బాగుంటుందో ... నీవే ఆలోచించుకో ....."
"మనిషి అనిపించుకునేందుకు వీలు లేని నీచ ... నికృష్ట ...... దౌర్భాగ్యుడెవడైనా అయితే తప్ప ..... మీ దారిలోనే బ్రతకడమే సుఖం కదా సార్ .... "
" శభాష్ ..... ఇంకొక రౌండ్ టీ తాగుదాం ...... "