మా మూర్తి నాతో వాదించడంలో గొప్ప ఆనందాన్ని పొందుతాడు. అవేవో గొప్ప గొప్ప విషయాలనుకొంటే పొరబాటే. చాలా చిన్న చిన్న విషయాలనే కావాలని పొడిగిస్తుంటాడు.
"బంగారు లేడి ఉండదు కదా..." ఒక రోజు సడన్ గా అడిగాడు.
" వెండిది...రాగిది...కూడా ఎక్కడా ఉండదు"
"ఏ యుగాల్లో కూడా ఉంది ఉండదు కదా..."
"అందులో ఏ విధమైన సందేహమూ ఉంచుకోకు"
" ఆ విషయం ఒక మహారాజు కూతురు సీతా దేవికి తెలియదా...?"
" సరేలే ..అందుకేగా రామాయణం జరిగింది"
" అది కాదు సహజత్వానికి ...దూరంగా ఉన్నప్పుడు దాంట్లో ఏదో తిరకాసుందన్న విషయాన్ని ముందుగా ఎందుకు గ్రహించలేదంటావ్"
"లక్స్మణుడు చెప్పాడుగా....ఇదోదో మోసమని...ఐనా నీకు అదంతా ఎందుకు దానివలన రావణ సంహారం జరిగి లోక కల్యాణం జరిగింది కదా. పైగా మానవ జన్మ లో లక్ష్మీ దేవి పుట్టింది కాబట్టి సహజంగా మానవ స్త్రీలకుండే లక్షణాలు ఉండాలి కదా"
"సరేలే పురాణ స్త్రీల సంగతి వదిలేద్దాం...మన ఇళ్ళ లో స్త్రీల విషయానికి వద్దాం...నీ చొక్కా వాషింగ్ మెషీన్ లో వేసే ముందు మీ శ్రీమతి నీ జేబూలు చెక్ చేస్తుందా...."
"సహజంగానే....ఇలాంటివాటిలో ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది....తను స్ట్రిక్ట్ ఫైనాన్స్ మేనేజర్...కాష్ బాలన్స్ మొదలైనవన్నీ ఖచ్చితంగా అడుగుతుంది......"
"తక్కువ వస్తే సరే..అడుగుతారు..ఒక వేళ నీ పాకెట్ లో ఎక్కువ కాష్ ఉంటే ...."
"అమ్మో అప్పుడు మరీ జాగ్రత్తగా అడుగుతుంది....ఎందుకంటే ఆ కాష్ నేనెవరి దగ్గరో తీసుకున్నట్లే కదా...ఒక వేళ నేను ఎక్కువ అరువు తీసుకుని కొంత ఖర్చు పెట్టేసి..మిగిలింది ఉంచానేమో....బాకీలు లాంటివి ఉంచడం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు.అంతే కాదు ఎవరి దగ్గర తీసుకున్నాను..ఎందుకు తీసుకున్నాను లాంటివన్నీ అడిగి జాగ్రత్తగా జ్ణాపకం పెట్టుకుంటుంది...కరెక్ట్ గా చెప్పాలంటే ఆవిడ బ్రెయిన్ లో ఒక మినీ టేలీ పేకేజ్ ఉంటుంది"
"ఇంచుమించు మా శ్రీమతి కూడా అలానే ఉంటుంది....అంటే భార్యలంతా ఇలానే ఉంటారంటావా...."
"అలా ఉంటేనే కదా....సంసారాలు కాస్త సుఖంగా ఉండేది...మనకు ఇంత ఆదాయముంది....ఇంత ఖర్చుంది అని వాళ్ళకు ముందు గానే చెప్పేస్తే మిగిలిందంతా వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు...ఐనా ఇదంతా ఎందుకు అడుగుతున్నావ్...పనేమీ లేదా ...ఎస్టిమేట్స్ అన్నీ చేసేసావా..."గయ్యిమన్నాను
"అలా కాదు బాస్..... మొన్నొక వార్త పేపర్ లో చూసినప్పటి నుండీ గుండె చెరువై పొతోంది...పాపం ఒకావిడ ...తన అమాయుకుడైన భర్తను అన్యాయంగా జైల్లో పెట్టి హింసుస్తున్న..."
"మెలో...డ్రామా తగ్గించి అసలు విషయానికి రా"
"పాపం ... ఒక పోలీస్ ఉన్నతాధికారి దగ్గరికి వెళ్ళి....ఆయనకు పిల్లా జెల్లా లేరా అని కూడా అడిగింది"
"ఆహా...." లాప్ టాప్ లొ తయారు చేస్తున్న డ్రాయింగ్ మీదే నా దృష్టంతా ఉంది.
"ఆవిడ భర్తను అంతా కలిసి కేసుల్లో ఇరికించారట...సంవత్సర కాలం నుండీ పిల్లలు నాన్నను చూడనే లేదంట...."
" పాపం.." మూర్తి తో నాకు మామ్మూలే కాబట్టి నేను పెద్దగా స్పందించ లేదు.
"మరీ నీకు సామాజిక స్పృహ లేకుండా పోతోంది ప్రసాదూ...బెల్లం కొట్టే రాయిలా అలా కదలకుండా ఉంటావేంటి..."
"చూడు బాబూ....నాకు చాలా పని ఉంది నన్ను వదిలి పెట్టు....ఒక వేళ ఆవిడ మాటలకు పోలీస్ అధికార్లు కరగక పోతే...జ్యుడీషియరీ ఉంది...పెద్ద పెద్ద జడ్జీలు ఉన్నారు...."
"పూర్తిగా వినిపించికోవేం...ఆవిడ కోర్ట్ లొనే అడిగింది."
" సారీ.....చాలా ముఖ్యమైన వార్తని ఎవరైనా అంటేనే గాని యీ మద్య నేను పేపర్ చూడ్డం లేదు.....ఇంతకూ ఆ పోలీస్ అధికారి బోనులో ఉండగానే ఆవిడ అలా అడిగిందా...ఏమని అడిగింది ఇంతకూ..."
" ఆ పోలీస్ అధికారి బోనులో లేడు ఐనా పాపం ఈవిడ ఒక సారి మనస్సాక్షిని పరిశీలుంచుకోమని ఆ అధికారిని కోరింది. అలా చేస్తే ఆవిడ భర్త యే తప్పు చేయాలేదని ఆ పోలీస్ అధికారికి అనిపిస్తుందంట..."
"చీ...ఆవిడను చూసి మన శ్రీమతులు చాలా నేర్చుకోవాలి కదా...భర్తంటే ఎంత నమ్మకం....ఇంతకూ ఆమెభర్త మీద ఎవరికి అంత కక్ష ఉంది పాపం ?"
మూర్తి ఒక పెద్ద లిస్ట్ చెప్పాడు.
"నీవు ఎప్పుడో వచ్చిన కలిసుందాం రా అనే సినిమా చూసావా.....దానిలో తన వారి నుండి తప్పిపోయిన ఒక కుర్రాడిని ఒక పోలీస్ కానిస్టేబుల్ పలకరించేసరికి ఆ కుర్రాడు ...మా తాతయ్య,నానమ్మ,అమ్మ......అంతా తప్పిపోయారంకుల్ అంటాడు.అలాంటి కాకమ్మ కబుర్లు నా దగ్గర ఇంకెప్పుడూ చెప్పకు.....ఇప్పుడే అనుకున్నాం...100 రూపాయలు యెక్కువ వచ్చినా ...తగ్గినా మన భార్యలు గయ్యిమంటరని....పాపం ....రెండు మూడు సంవత్సరాలలొనే ఉన్నదానికి వందల రెట్లలో ఆస్తులు పెరుగుతుంటే....ఇదంతా ఎలా వస్తుందని అడగని సాధ్వీమణి ఆమె ఐతే అయ్యొండొచ్చు ....కానీ మిగిలిన వారంతా మరీ చెవిలో పూవులు పెట్టుకుని లేరు కదా.....
1978 లో ఎమెర్జన్సీ లో జరిగిన ఘోరాలు ఎన్నో పేపర్లో వచ్చినా కూదా ...శ్రీమతి గాంధీ ప్రజలముందుకు వచ్చి....మగ నాయకులంతా నన్నొక్క ఆడదాన్ని చేసి అణగ దొక్కాలని చూస్తున్నారరని కన్నీరు కార్చగానే మన వాళ్ళంతా ఆ పార్టీకి వోట్లు గుద్దేసారు. ఆ ట్రిక్ మరలా ఒక సారి ట్రై చేస్తున్నారేమో..."
"బాసూ....నీ ఉక్రోషాన్ని తగ్గించుకో..లేదంటే ఎవరో ఒకళ్ళు నీ కాళ్ళు విరగ్గొట్టడం ఖాయం"
" మంచిదే బాస్....ఒక ఉద్యమంతో అరెస్ట్ అయి..జైల్లో పెట్టబడి నప్పుడు వాళ్ళ సిద్దాంతాల కోసం మేము కూడా వాళ్ళ వెనుకే ఉండేవాళ్ళం. కానీ యీ పార్టీ సిద్దంతం ఏమిటి...అధికార సంపాదన...జైల్లో పెట్టబడడానికి కారణం ఏమిటి...ఒకటా రెండా....నీకొక సంగతి నేను చెప్పనక్కర లేదనుకో....మనం ఒక కాంట్రాక్టర్ కు కావాలని ఎక్కువ గాని ..తక్కువ గాని బిల్ చస్తే వెంటనే చార్జ్ షీట్ ఇస్తారు. ఉద్యోగానికి ఎసరు కూడా వస్తుంది. మరి ఒక పార్లమెంట్ మెంబర్ ను అకారణంగా జైల్ లో ఉంచి తమకు ముప్పు తెచ్చుకొనే జడ్జీలు...అధికార్లు ఉంటారా...ఒక పక్క నిజంగా అలా లొంగి పోయిన అధికార్లు వూసలు లెక్క పెడుతున్నారు. మంత్రులు పదవులు కోల్పోతున్నారు.యీ విషయాలన్నీ పేపర్లలో వస్తూనే ఉన్నాయి.అవన్నీ అబద్దమే అన్నట్లుగా ఇలా కోర్ట్ సన్ని వేసాలు క్రియేట్ చేయడం.....
నేను కాలేజ్ చేరిన కొత్తలోనే కొన్ని సార్లు ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు మా నాన్న గారు తాతయ్య బాగా తిట్టారు.ఎందుకంటే అప్పటికే నిజాయితీగా స్వాతంత్రొద్యమంలో పాల్గొని అన్నీ పోగొట్టుకొని దీనంగా బ్రతుకుతున్న వారి జీవితాలను చూసి.అన్ని విషయాల్లో నిజాయితీగా ఉండమని మాత్రం చెప్పేవారు.కానీ యీ రోజు నేను నా పిల్లలకు నిజాయితీగా బ్రతకమని చెప్పాలంటే భయం వేస్తోంది.నేర పూరిత అభియోగాల మీద జైల్లో పెట్టబడి..సంవత్సర కాలం నుండీ బెయిల్ కూడా నిరాకరించబడిన వాడి వెనుక ఇంత మంది సమీకృతులవడం ఆశ్చర్యంగా ఉంది మూర్తీ....భయం వేస్తోంది..నా పిల్లలకు ..మోసం చేయడం తప్పు....ఒకళ్ళకు అన్యాయం చేయడం తప్పు....కష్టపడు ..వచ్చిన దానితో తృప్తిగా ఉండు లాంటివి నేర్పి తప్పు చేస్తున్నానేమోనన్న ఫీలింగ్ వచ్చేస్తోంది....మొన్నటి వరకూ సిద్దంతాలు లేని పార్టీలు పాలించేతున్నాయనే బాధ పడే వాడిని ఇప్పుడు నేరస్తుల ముఠాలు పాలిస్తాయేమోనని భయం వేసిపోతోంది" నా శరీరం కంపించడం చూసి మూర్తి దగ్గరకు వచ్చి భుజమ్మీద చేయి వేసి చెప్పాడు
"ఇప్పుడు నీవొక్కడివే కావొచ్చు..చూస్తూ ఉండు నీతో నడవడానికి చాలామంది తయారవుతారు...రొచ్చు ఎల్లకాలం సుఖాన్నివ్వదు. అవసరం కోసమే కొంతకాలం దానిని భరిస్తారు...కొంతకాలం ఓపిక పట్టు...మన విశాఖ సముద్ర కెరటంలా మంచి నీరు వచ్చి యీ రొచ్చును ఆనవాలు కూడా లేకుండా తుడిచిపెట్టేస్తుంది. "