8, ఏప్రిల్ 2011, శుక్రవారం
మా వూరి సత్రం...నిన్న ,నేడు,.....రేపు.
అదేమీ కాశీ మజిలీ కధల లోని రాత్రి పూట బస , తిండి ఉచితంగా ఏర్పాటు చేసే సత్రమేమీ కాదు. ఆ రోజుల్లో ఎవరో ఒక పెద్దాయన వూరి మీదున్న అభిమానంతో ఒక చిన్న భవనం , దానికి బయట చిన్న అరుగులు దాని మీద తాటి ఆకు కప్పు ఏర్పాటు చేసాడు. భవనం చుట్టూ ప్రహరీ గోడ కూడా ఉన్నది. నా చిన్నప్పుడు ఈ కాంపౌండ్ లో పెద్ద నుయ్యి కూడా ఉండేది. దాన్ని ఎప్పుడో కప్పి పెట్టడం జరిగింది.
ఏది ఏమైనా దాని గత చరిత్ర ఘన మైనది అని చెప్పలేము. నాకు ఊహ తెలిసిన తరువాత అక్కడ చిన్నదైనప్పటికీ గుర్తుండిపోయే మీటింగ్ ఒకటి జరిగింది. మా వూరి లో ఆనాటి పెద్దలు శ్రమతో సాధించిన పశువుల ఆస్పత్రి ప్రారంభోత్సవం రోజున దానికి తన వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఆ నాటి మంత్రి వర్యులు అయిన శ్రీ బత్తిన సుబ్బారావు గారు ఇచ్చిన చక్కని ఉత్తేజ భరితమైన స్పీచ్ నాకు ఇప్పటికీ గుర్తుండి పోయింది. అది తప్పితే అది ఎప్పుడు కూడా మంచి పనులకి ఉపయోగ పడిన దాఖలాలు లేవు. ఆ గోడలకే కనుక నోరు ఉంటే చాలా భయంకరమైన నిజాలు బయటకు వచ్చి ఉండేవి. నా విద్యాభ్యాసం నాటి రోజులలోనే దానిని ఏదో విధంగా ఉపయోగం లోనికి తేవాలనే ఆశ, ఆశయం ఉండేవి. నా విద్యాభ్యాసం నాటి రోజులలోనే దానిని ఏదో విధంగా ఉపయోగం లోనికి తేవాలనే ఆశ, ఆశయం ఉండేవి.
మా సుపుత్రుడు పెట్టగా నేను బ్రేక్స్ తో నైనా ఈ మద్య ఒక సినిమా చూడడం జరిగింది. దాంట్లో హీరో కిక్ కోసం దొంగతనాలు చేసి ఆ డబ్బుతో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాడు. నిజ జీవితంలో ఇది కొంత వరకూ కరెక్టే . చాలా కాలం క్రితం నేను ఎందుకో ఒక పిల్లల హాస్పిటల్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరి కోసమో ఎదురు చూస్తూ నేను నెమ్మదిగా వెనుక వైపు ఉన్న లాంజ్ లోకి వెళ్లాను. అక్కడ ఒక చిన్న ఓపెన్ షెడ్ లాంటిది ఉన్నది. అక్కడ కూడా కొంత మంది పిల్లలను పెట్టుకుని వైద్యం కోసం చూస్తున్నారు. వాళ్ళ వైపు చూస్తూ ఉంటె నాకు అర్ధమైన విషయం ఏమిటంటే ఆర్ధిక వెసులు బాటు లేకుండా ఉంది ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళంతా అని. వారిలో ఒకావిడ తన చిన్న బిడ్డను ఒక బల్ల మీద పడుకో బెట్టి ఆ ముఖం లోకి చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ బయట రావలిసిన వారి కోసం అనుకుంటా అస్తమానూ బయటకు ఆత్రుతగా చూస్తోంది. ఆలస్యం ఐతే ఆ బిడ్డ దక్కదేమోనన్న దైన్యం ఆ ముఖంలో ఎలా ప్రస్ఫుటంగా కనబడుతుందంటే హృదయం ఉన్న వారు ఎవరన్నా సరే ద్రవించి పోక మానరు. నేను అటునుండి వస్తున్న నర్స్ ను వివరాలు అడిగాను. ఆవిడ భర్త ఏదో చిన్న గుడిలో అర్చకత్వం చేస్తూ ఉంటాడు. బిడ్డకు బాగుండక పొతే ఎవరో అయ్య రికమండేషన్ తో హాస్పిటల్ లో ఉచిత వైద్యం కోసం అడ్మిట్ చేసాడు. మందుల కోసం ఉదయాన్ననగా వెళ్ళాడు. ఇక్కడ పరిస్థితి చేయి జారి పోతోంది. మందులకు యెంత అవుతుందని అడిగాను . ఆవిడ చెప్పింది. నిజంగానే పెద్ద మొత్తం ఏమీ కాదు. వెంటనే జేబులో నుండి తీసి ఇచ్చాను. ఆ ఇద్దరి కాళ్ళ లోని భావాలు నాకు ఒక లాంటి కిక్ ఇచ్చ్చాయేమో అనిపిస్తుంటుంది. నేను ఆ తరువాత చాలా సార్లు పదిమందికీ పనికి వచ్చే పని చేసి నప్పుడు వచ్చే కిక్ గురించి చెబుతూ ఉంటాను. ఇదంతా ఎందుకు చేబున్నానో క్రింద ఉన్న ఒక్క పేరా చదివి దాంట్లో నేను ఉటంకించిన వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇందులో నేను రాసిన విషయం చేరేలా పాతకులు చేస్తారని నా చిన్న ఆశ.
పైన చెప్పిన సదరు సత్రం ఎవరో మహానుభావుడు ఆనాటి అవసరాల కోసం నిర్మాణం చేసి ఉండవచ్చు. కానీ గ్రామం నడిబొడ్డున మెయిన్ రోడ్ పక్కన ఇది ప్రస్తుతం నిరుపయోగంగా పది ఉన్నది. ఈ స్థలం మీద పూర్తి హక్కులు కీర్తి శేషులు శ్రీ మార్ని పాపన్న గారి కుటంబీకులవని నాకు ఈ మద్యనే తెలిసింది. వారి కుమారులు శ్రీ మార్ని నారాయణ మూర్తి గారు చాలా కాలం క్రితమే కాలం చేయగా శ్రీ మార్ని గనేస్వర రావు గారు ఈ మద్యనే కాలం చేసారు. వారిరువురి సంతానం పూనుకొని వారి పెద్దల పేరు మీద ఒక చిరస్మరణీయ మైన నిర్మాణం అంటే ఒక చిన్న కమ్యూనిటీ హాల్ అంటే అది యోగ లాంటి అన్ని మంచి పనులకీ ఉపయోగ పడే విధంగా చేస్తే బాగుటుందని నా విన్నపం. నేను రైల్వే ప్రాజెక్ట్ చేస్తున్న ప్రాంతంలో ఉన్న గ్రామస్తుల కోసం వారి కోరిక పై నేను డిజైన్ చేసిన ఒక చిన్న కమ్యునిటీ భవనం యొక్క నమూనాను పక్కన ఇవ్వడం జరిగింది. విజ్ఞులందరూ నిరుపయోగంగా ఉన్న పై సత్రాన్ని ,ఈ కమ్యునిటీ భవనాన్ని పోల్చి చూసుకోవచ్చు. చాలా మందితో మంచి సంబంధాలు మైంటైన్ చేసే శ్రీమతి మాధవి ఈ మెయిల్ మిగిలిన కుటుంబీకులకు చేరవేయగలదని ఆశిస్తున్నాను.
ఇంకొక విషయం ఏమిటంటే రాజమండ్రి పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ గ్రామంలో రోడ్ పక్కన ఈ నిర్మాణమే జరిగితే ఇది సమీప గ్రామ ప్రజల మీద కూడా చక్కని ప్రభ్హావం చూపే అవకాశం ఉంటుంది అలాగే పదిమంది కోసం పదిమందితో కలసి పని చేయడంలో ఉన్న కిక్ చాలా మందికి ఈ విధంగా తెలియ చేయాలని నా ఆశ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)