మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న గారు పెద్ద R.S.S. లీడర్ నాన్నా ..... మా వాడు వాళ్ళ స్నేహితుడి కుటుంబం గురించి చెబుతున్నాడు .
సీమాంధ్ర లో R.S.S. లో ఉన్న వాళ్ళంతా కాస్త అగ్ర కులాల వారే నని నా నమ్మకం . కేవలం ఇది నా నమ్మకం మాత్రమే కాబట్టి దయుంచి దీంట్లో తప్పొప్పులు వెదకొద్దని మనవి . కానీ మా వాడి మాటల ద్వారా తెలిసిందేమిటంటే వాళ్ళ స్నేహితుడిది వెనుకబడిన కులాల జాబితాల్లో ఉన్న కులం . ఈ విషయం కూడా తరువాత తెలిసింది . సరే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు . ఒక రోజు నేను మా వాడిని ఏదో ప్రాజెక్ట్ చేయవలసిన పని కోసం వాళ్ళ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ల వలసి వచ్చింది . సరిగ్గా అదే సమయానికి వాళ్ళింటి సమీపం లోని మసీదు లో నమాజ్ .... దాని తరువాత ఏదో ఉపన్యాసం ప్రారంభమయ్యాయి. దాని సౌండ్ ఎన్ని decibels ఉంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా కొద్ది నిముషాలు అక్కడే ఉంటే నా తలలో నరాలు బద్దలవ్వడం ఖాయమన్న ఫీలింగ్ వచ్చేసింది . నాకప్పుడు అనిపించింది ..... ఆ ఏరియా లో ఉన్న ఏ హిందువైనా కూడా (నిజానికి ముసల్మానులు కూడా అది భరించడం కష్టమే ) ఆ సౌండ్ ఆపడానికి ఏ పనైనా చేస్తాడు .
మొన్న దసరా కి మా రాజవోలు వెళ్లాను . ఆ ఊరంతటికీ ఒకడే టైలర్ . అతడు నా క్లాస్ మేట్ కూడా . ఈ నాటికీ అలా బట్టలు కుట్టుకుంటూ కుటుంబ భారం మోస్తున్నాడు . బట్టలు కుట్టించవలసి వచ్చి మా శ్రీమతి తనకు ఫోన్ చేసింది .
"అయ్యో ...పాపమ్ అమీర్ కు వంట్లో బాగుండ లేదంట .... లేవడం లేదంట "
ఫోన్ పెట్టేసి చెప్పింది . ఒక సారి ఊరు కూడా తిరిగినట్లుంటుందని చెప్పులు వేసుకుని అమీర్ ఇంటి వైపుగా బయలు దేరాను . అతడి ఇంటి చుట్టూ మూడు దేవీ నవరాత్రి పందిళ్ళు . మూడు మైకుల్లోనూ మూడు పాటలు . సౌండ్ గురించి చెప్పనక్కర లేదు . నన్ను చూడగానే పడుకుని ఉన్న అమీర్ లేచి కూర్చున్నాడు .
"ఎలా ఉంది .. ?"
"పెద్దగా నలతేమీ లేదు ప్రసాదూ .... కానీ బట్టల కుట్టడానికి మిషన్ ఎక్కలేనంత గోల .... నరాల్లోనుండి పైకి తన్నుతున్నహోరు .... కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరి తో గొడవ పెట్టుకోలేను . మిషన్ ఎక్కి 10 రోజులయ్యింది . మొన్నటి వరకూ వినాయక చవితి పందిళ్ళు .... నీవు చెప్పు ప్రసాదూ ... ఇదంతా భక్తి కోసమే నంటావా ..... "
వేరే విషయాలు మాట్లాడి ఇంటి వైపుకి తిరిగాను .
అక్కడుండ గానే ఆదివారం వచ్చింది .
"మరీ ఇంత గోలా ..... "
"ఏం చెయ్యమంటారు అన్నయ్య గారూ .... ఏదైనా గట్టిగా అంటే గొడవలని భయపడుతున్నాం ...... పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేక పోతున్నారు "
మా బావమరిది భార్య వాపోయింది .
ఆలోచిస్తే నవ్వొచ్చింది . నగరం లోనే రాత్రి 12 గంటల తరువాత పది మంది కూడా లేని పిల్ల కాయలు కొన్ని వేల మందికి నిద్ర లేకుండా ఊరేగింపులు చేసేస్తున్నారు .
సమాజంలో ఉన్న మూడు నాలుగు మతాల వారు తోటి వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే కంట్రోల్ చేయవలసింది ఎవరు ... ?
కావాలని చేస్తున్న ఈ ఉపేక్ష వెనుక పాలక వర్గాల కుట్ర నగ్నంగా కనపడ్డం లేదా ? ఇటువంటి ఉపేక్ష వలన కాదా .... మొత్తం సమాజం భారీ ఉపద్రవాల బారిన పడింది . టెర్రరిజానికి బీజాలు పడేది ఇక్కడనుండి కాదా .......