పేజీల తరబడి మహాత్ముడి గురించి నాకంటే చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు . ఏమీ చదవకుండానే పిచ్చి వాగుడు వాగే వాళ్ళూ ఉన్నారు . కానీ మహాత్ముడి లో ఉన్న ఒక గుణం లోపించి ఈ రోజు మొత్తం సమాజం తనకు తానే తన పీక ఎలా కోసుకుంటుందో ఒక్క సారి చూద్దాం . ఒక్క సారి ఈ క్రింది డ్రాయింగ్ చూడండి .
ఇది విశాఖపట్నం లోని ఒక ముఖ్యమైన ప్రాంతం . జాగ్రత్తగా పరికిస్తే రెడ్ కలర్ తో హైలైట్ చేసిన రోడ్ కనబడుతుంది . ఆ రోడ్ ఏ .. ఏ ... ముఖ్యమైన రోడ్ల మద్య కనెక్టివిటీ ఏర్పరుస్తుందో ... చూస్తే దాని ప్రాధాన్యం అర్ధమవుతుంది .
ఈ రోడ్ వేయడానికి గల నేపధ్యం ఒక సారి చూద్దాం . NAD జంక్షన్ నుండి అక్కయ్యపాలెం సెంటర్ వరకూ దిగువ వైపు మర్రి పాలెం , కంచరపాలెం , అబిద్ నగర్ లాంటి కాలనీ లు ఉంటే ఎగువన మురళీ నగర్ , మాధవదార , కైలాసపురం , నరసింహ నగర్ లాంటి కాలనీ లు ఉన్నాయ్ . ఎగువన ఉన్న కాలనీ వాసులంతా జగదాంబ ......డాబా గార్డెన్స్ లాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే మాప్ లో చూపిన అక్కయ్యపాలెం రోడ్ మీదుగానే వెళ్ళాలి . ఒక్క సారి అక్కయ్య పాలెం రోడ్ వంక చూస్తే రోడ్ అంతా ఒకే వెడల్పులో ఉండదు . రెండు చోట్ల సన్నగా ఉంటుంది . సన్నగా ఉన్న చోట్ల రెండు మతాల వారి ప్రార్ధనా మందిరాలు కనబడతున్నాయి చూడండి . ఆ ప్రార్ధనా మందిరాలు పక్కన ఉన్న షాపు లను చూస్తే ఈ మందిరాలు ముందుకు వచ్చి నట్లుగా అర్ధమవుతుంది . నాకు నిజానిజాలు తెలియవు . కాకపొతే ఆ షాపు లు ఉన్న లైన్ ప్రకారం చూస్తే మాత్రం అవి ముందుకు వచ్చినట్లే అనిపిస్తుంది . నాకర్ధం కాని విషయం ఏమిటంటే దేవుడు ప్రజల పక్షం ఉంటాడా ...... ప్రజలకు శత్రువుగా ఉంటాడా ...... ఎవరైనా నాయకుడు పూనుకొని ప్రతి రోజూ వేల మంది ప్రయాణం చేసే ఈ రోడ్ ను వెడల్పు చేస్తారని ఎప్పటి నుండో చూస్తున్నాను .
పైన చెప్పిన విషయం ఎప్పటికవుతుందో తెలియదు కానీ హై వే కు సమాంతరం గా ఒక రోడ్ అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో కంచరపాలెం బ్రిడ్జ్ నుండి శంకర్ మఠ్ రోడ్ కు కలుపుతూ ఒక పెద్ద రోడ్ ను ప్లాన్ చేసారు . కానీ సర్వే చేస్తున్నప్పుడే అవాంతరాలు ....... ఆటంకాలు పరిగణన లోకి తీసుకున్న పిదపే ఏ పనైనా ప్రారంభిస్తారు . కానీ విచిత్రంగా నేను "?" మార్క్ చేసిన చిన్న ముక్క దగ్గర కొన్ని గుడిసెలు మాత్రం గత ఐదారు సంవత్సరాలుగా అలాగే ఉన్నాయి. ఒక వేళ ఆ గుడిసెలలో ఉన్న వారే ఆ స్థలాలకు హక్కు దార్లైతే ముందుగా వారి ఆమోద పత్రం ఖచ్చితంగా తీసుకోకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా ప్రారంబించారు ? ఒక పెద్ద రోడ్ కు పక్కగా ఉండే ఫ్లాట్ కొనుక్కుంటే ముందు ముందు లాభ సాటి గా ఉంటుందని లోన్ లు తీసుకుని కొనుక్కున్న మధ్య తరగతి ఉద్యోగ వ్యాపార వర్గాల వారు మొత్తానికి వెర్రి వెధవల్లా మిగిలారు.
వోటు బాంక్ రాజకీయాలలో...... మత మౌడ్యం ..... అవకాశవాద రాజకీయాల మద్య సమిధలుగా మారుతున్న వాస్తవాన్ని ప్రజలు ఎప్పటికి గుర్తిస్తారో అర్ధం కాకుండా ఉంది .ఇక్కట్లు పడేదీ వారే .... ఈ మందిరాలను పక్కకు జరపకుండా అడ్డుపడేదీ వారే ....
ఈ సందర్భం లోనే మహాత్ముడు నాకు గుర్తుకు వస్తున్నాడు . టికట్ ఉన్నప్పటికీ తనను బయటకు గెంటేసిన దౌర్జన్యాన్ని సహించలేక నే కదా ఒక సామాన్యుడి నుండి మహాత్ముడిగా మారాడు . మన చుట్టూ జరుగుతున్న ఈ చిన్న చిన్న అన్యాలయాను పట్టించుకోని మనం "నిర్భయ్" కు సపోర్ట్ గా ఊరేగింపులు చేస్తాం . అవును మరి ఈజీ గా .... ఏ మాత్రం రిస్క్ లేకుండా హీరో కావాలిగా ...... కనీసం మన అవసరాల కోసమైనా మనం కొద్దిగా స్పందించగలిగితే ముందు ముందు కొంతమందైనా మహాత్ములు తయారయ్యే అవకాశం ఉంటుంది .
మత మౌడ్యం ..... అవకాశవాద రాజకీయాల మద్య మహాత్ములని తయారు చేద్దాం ........