6, ఆగస్టు 2014, బుధవారం

THE OTHER SHADE OF NO.1 PROGRAM....


ఈ విధంగా మరలా మా వాడు నా మీద విరుచుకు పడతాడనుకోలేదు ....

ఏదో పేపర్లోనో ....డాట్ కామ్ లోనో పై ఫోటో చూసినప్పటి నుండీ నా మనసులో వేరే వేరే వేల కొద్దీ సందేహాలు ......

ఇంతకూ ఈ ఫోటో మన నం. వన్ ప్రోగ్రాం  "మీలో ఎవరు కోటీశ్వరుడు " యొక్క మొదటి భాగం ముగింపు వేడుకల సందర్భంగా అంటే 40 వ episode సందర్భంగా జరిగిన వేడుకల సందర్భంగా తీసిందని రాసారు. 

ఈ లోపులో కాలేజ్ నుండి వచ్చిన వెంటనే ఈ ఫోటో చూపించి వీళ్ళెవరో చెప్పు చూద్దాం అన్నాను. 

"ఇద్దరు హీరోలను పట్టుకొని నీకు తెలుసా అని అడుగాతావేంటి? " విసుక్కున్నాడు .

"అదేరా ....వెధవా ....ప్రశ్న వినకుండా సమాధానం చెప్పేయడమంటే.....మూడో వ్యక్తి ఎవరో కూడా చెప్పాలి ...."

సరిగ్గా ఆ టైం లోనే బస్ వాడు గట్టిగా హార్న్ కొట్టుకుంటూ వెళ్ళడం వలన వాడు చెప్పిన సమాధానం నన్ను ఉలిక్కి పడేలా చేసింది ....

"అదేంట్రా క్విడ్ ప్రో......అన్నావు? " కంగారుగా అన్నాను ....

"క్విజ్ ప్రోగ్రాం పెట్టకన్నాను ......క్విడ్  ప్రో .....కాదు "

హమ్మయ్య అనుకున్నాను ....

"అంటే నీవు క్విడ్ ప్రో అని అనలేదు కదా .....?"

మరలా కన్ఫర్మ్ చేసుకున్నాను.

"అంటే ఏమిటో కూడా తెలియదు .....అయినా నాన్నా.... క్విజ్ ప్రోగ్రాం  కి గెస్ట్ ల క్రింద మన తెలుగు వాళ్ళే ....గొప్ప ...గొప్ప ఇంజనీర్లు ....సైంటిస్టులు .....డాక్టర్స్ .....ఇంకా అనేక సబ్జెక్టు లలో అనేకానేక దేశాల్లో పేరుతెచ్చుకున్న వాళ్ళు .....కనీసం రిటైర్ అయ్యి మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ....ఉండగా సినీ స్టార్లనే ఎందుకు తెస్తారో తెలియడం లేదు ...."

మరలా సందేహంగా వాడి ముఖంలోకి చూసాను ....

"అదేంట్రా మెగా స్టార్ కి నీవు పెద్ద ఫాన్ వి కూడానూ....."

"అయితే ..అది నటన వరకే ....అలా అని అన్ని చోట్లా వాళ్ళనే  హీరోలను చేసేస్తారా ....గెస్ట్ లను పిలవాల్సింది ఆ ప్రోగ్రాం బట్టి కదా .....ఆ చానల్ వాటాదార్లు ....ఆ క్విజ్ మాస్టారు ...హీరోలు కాబట్టి  వాళ్ళ కళ్ళకు  వేరెవరూ  గొప్పవారిగా కనబడరా ....?"

"సరేలేవోయ్ రేపు exam అన్నావు కదా వెళ్లి చదువుకో ....."

వాడిని  పంపించేశాకా కాస్త మనసు కుదుటపడింది. లేదంటే ఆ మూడో ఆయన పెట్టుబడి పెట్టిన కంపెనీలు ....వాటి తాలూకు గొడవలూ ....అన్నీ ఏ search engine లోనో పట్టేసేడంటే ....వీడి నోరు అసలే ......అమ్మో ......

కాక పొతే నాకూ అనిపిస్తోంది .....ఎంతో మంది విద్యాధికులు ....విద్యార్ధులూ ....ఒక విధంగా భావి భారత దేశ నిర్దేశకులు  ఎంతో క్లోజ్ గా ఫాలో అవుతున్న ఈ ప్రోగ్రాం కు సంబదించిన వేడుకలకు   అతిధులుగా రాగల అర్హతలున్న వాళ్ళు వీళ్ళేనా.....? ఇప్పుడు వీరిని హైలైట్ చేసే అవసరాలు ఏమిటో .....

ఏమైనా చానల్ వారిది .....ప్రోగ్రాం వారిది .....తెలుసుకోవలసింది మాత్రమే మనం ......


ది.07-08-14,10.30 PM

ఇప్పుడే నాగార్జున గారు జూలియస్ సీజర్  శవాన్ని పెట్టుకుని మాట్లాడిన మార్క్ అంటోనీ స్థాయి లో చాలా ఉద్వేగంతో మాట్లాడారు ....బాగుంది ...

2 కామెంట్‌లు:

  1. మీరు కూడా మరి కొంత విశ్లేషణకు పూనుకుంటే ఇంకా కొన్ని విషయాలు బయట పడతాయి ....ఒక episode లో వస్తున్న SMS ల వలన ఆదాయం గురించి మొన్ననే ఎవరో రాసారు.

    రిప్లయితొలగించండి