30, డిసెంబర్ 2013, సోమవారం

ఒక నగర వాసి జీవితంలో ఒక రోజు



సమయం
చేసిన పని
తన దృష్టిలో చేసిన పని తాలూకు ఫలితం
పుణ్యం వచ్చేవి
పాపం తెచ్చేవి
ఉ.06.30
రైతు బజార్ కు కూరగాయల కోసం బయలు దేరాడు. ఆ రోజు  గురు వారం అన్న సంగతి గుర్తుకు వచ్చి సాయి బాబా గుడి వైపుకి తిరిగాడు. అప్పటికే జనం వచ్చేశారు. పార్క్ చేసే స్థలం లేదు . ఫరావాలేదనుకుంటూ నాలుగు వాహనాలకడ్డంగా తన బండి పార్క్ చేసేశాడు. గుడి లో పెద్ద క్యూ ఉంది. ఎవరూ పట్టించుకోరనుకుంటూ లైన్ పట్టించుకోకుండా ముందుకు సాగి పొయ్యాడు. ఇద్దరు ముగ్గురు కేకలు వేసారు కానీ వినబడనట్లు వెళ్లి సాయిబాబా విగ్రహం ముందు సాష్టాంగ పడి పొయ్యాడు . బయటకు వచ్చేసరికి తన బండి అడ్డు రావడం వలన బయటకు తీయలేక నలుగురు వాహనదారులు ఎదురు చూస్తున్నారు.


ఏదో పుణ్యం ఇంతకు ముందు చేసాను కాబట్టే ఇంత సులభంగా దర్శనం దొరికింది.
ఎవరి ప్రాప్తం వారిది.....అందరి సంగతీ పట్టించుకుంటే మన పనులెలా ......?
ఉ.08.00

తెచ్చిన విభూతి తయారై కూర్చున్న పిల్లలిద్దరి ముఖాన రుద్దాడు . “ఏమిటి నాన్నా .....టైం చూడు ..ఇవాళ టెస్ట్ కూడా ఉంది “ అన్న కొడుకు తో  “ఫరవాలేదురా నేను తీసుకు వెళ్తానుగా” అంటూ రాంగ్ రూట్ లో ఇద్దరిని గుద్దినంత పని చేసి ఎలాగైనా కుమారుడిని టైం లో కాలేజ్ లో పడేసాడు.



ఈ సంవత్సరం ఒక్క సారీ మిస్ కాకుండా ప్రతి గురువారం సాయిబాబా గుడి కి వస్తానని మొక్కుకున్నాక ....మిగిలినివన్నీ స్వామే చూసుకుంటాడు.
రోడ్డన్నాక ఎవడికీ టచ్ కాకుండా డ్రైవ్ చేయకుండా ఉంటాడా...
?ఎప్పుడూ కరెక్ట్ రూట్ లోనే వెళ్తాడా ......
ఉ.08.30

రైల్వే స్టేషన్ కు బయలు  దేరాడు. రోడ్ కడ్డంగా వేసిన వినాయక చవితి పందిరి లో కెళ్ళి విగ్రహానికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు .
తృప్తిగా ఫీలయ్యాడు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినప్పటికీ ...

ఉ.08.50

లోకల్ ట్రైన్ ప్లాట్ఫార్మ్ మీదకు వచ్చింది. పెద్ద రష్ లేదు కానీ దిగేవారిని తోసుకుంటూ లోపలికి దూరిపోయాడు. పక్క వాడి దగ్గర పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు . సహజం గానే ప్రయాణీకుల వాగ్యుద్ధం  ప్రారంభమయ్యింది. “అసలు ఈ పొలిటీషియన్స్ లో నిజాయితీ ఎక్కడుందండీ.....అందరినీ ఉరి తీసేయాలండీ ....
నక్సలైట్ లు మాత్రం కాంట్రాక్టర్ ల దగ్గర నుండి చందాలు దండుకోవడమే కదండీ .....” దిగవలసిన స్టేషన్ వచ్చే వరకూ వాగుతూనే ఉన్నాడు .

ఎన్నెన్ని కుంభకోణాలు .....2G....బొగ్గు...లేదంటే దేశం ఎక్కడో ఉండేది ......ఆ మాత్రం గట్టిగా చెప్పాలి ....

సా 5.00
....ట్రైన్ టైం అయి పోతోంది....ఈ రీ స్త్రక్చరింగ్ ఎప్పుడు అవుతుందో...హాపీ గా గవర్నమెంట్ జీప్ దొరికిపోతుంది .....పిల్లల ఆటో ఖర్చు కూడా సేవ్ అవుతుంది.
గవర్నమెంట్ జీప్ వాడని ఆఫీసర్ భూమ్మీద ఉంటాడా ...?
పాపం ఎంత మాత్రమూ కాదు
సా 7.00
“నాన్నా.....పరీక్షల టైం లో ఈ మైకుల గోల చాలా ఎక్కువగా ఉంది....నేను ..గౌతమ్ ...ఇంకా నలుగురం కలసి ఆ పందిరి లో వాళ్లకు సౌండ్ తగ్గించమని చెప్పొస్తాం...” అన్న కొడుకి మాటలకు ఉలిక్కి పడ్డాడు. “ఒరేయ్ ...ఈ ఏరియా అంతా వాళ్ళ వాళ్ళే .....నీవు బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుని చదువుకో.......”


మంచి ఇంజనీర్ అవ్వ వలసిన వాడిని అనవసర గొడవలలోకి ఎలా పంపిస్తాం.


రా 8.00
ఆటో ఆగింది . అమ్మాయి దిగింది . “అదేమిటమ్మా....
లేటయ్యి పోయింది .”నిర్భయ సంస్మరణార్ధం కాండిల్స్ టో ఊరేగింపు జరిపాం ....నాన్నా....పైగా పూర్తిగా ప్రెస్ కవరేజ్ ఉంది .పేస్ బుక్ లో ఉన్న  మా కాలేజ్ పేజ్ లో అన్ని ఫోటోస్ అప్ లోడ్ చేస్తారంట .
పిల్లలకు ఆ మాత్రం సోషల్ అవేర్నెస్ ఉండక పొతే ఎలా....

3 కామెంట్‌లు:

  1. చాల బాగా చెప్పారు అందరు నీతి గా ఉండాలి మనం తప్ప, మనం చేస్తే అది ఏదో ఆత్య అవసరంగా చేసాం అనుకుంటాం, మిగత వాళ్ళు మాత్రం అవినీతి పరులు అనుకుంటూ బతికేస్తం ఇది ఏదో ఒకరి గురుంచి కాదు దీంట్లో నేను కూడా ఒకడిని.

    రిప్లయితొలగించండి
  2. I have struggled throughout my life not to be one among those, whom you have narrated above. Either my family or the society do not treat me a humanbeing (except a few similar people like you). Anyway, me too happen to be at fault at times, if not those wrongs some other.. May God endow me the patience to bear with such people and my self. :-)

    అయ్యా !
    బాగుంది. ఇందులో controversial ఏమీ లేదు.
    నా జీవిత కాలం నేను అలాంటి (మీరు రాసిన లాంటి) వ్యక్తుల్లో ఒకడిని అవ్వకుండా ఉండేదానికి చలా యాతన పడ్డాను. ఇటు కుటుంబం కానీ అటు సమాజం కానీ నన్ను మనిషిగా చూడదు, ఎవరో మీలాంటి వాళ్లు తప్ప. అయినా, ఈ తప్పలు కాకపోయినా ఇంకో విధమైనవైనా, నేనూ తప్పులు చేస్తూ ఉంటాను. అందుకే భగవంతుడ్ని కోరుకుంటున్నాను 'ఈ జనాల ఇంకా నా యొక్క దుర్మార్గాన్ని భరించే ఓపిక ఇవ్వు తండ్రీ/తల్లీ' అని. :-)

    రిప్లయితొలగించండి