20, నవంబర్ 2013, బుధవారం

క్రీడా రాజకీయాలు ..... రాజకీయ క్రీడలు

                      చాలా కాలానికి ఒక ఆలోచన రేకెత్తించే వార్త. మామూలుగా ఐతే అది పెద్ద వార్తగా అనిపించదు . కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే మాత్రం అది వార్తే . ఒక్క సారి ఈ రోజు ఈనాడు లోని 14 వ పేజీ లో ఎడమ వైపున ఉన్న "సచిన్ అలా .... "అన్న వార్త ఒక్క సారి చూడండి . నిజంగా ఐతే అది వార్త కాదు .... ఒక ఆటగాడి పరిచయం .
                    అనిల్ గౌరవ్ అనే మరుగున పడిపోయిన ఆటగాడి వ్యదార్ధ గాధ మనసున్న మనుషులకెవరికైనా మనసు చివుక్కుమనేలా చేస్తుంది . అతగాడు అన్న ఒక్క మాట అర్ధం చేసుకోగలిగితే భారత దేశ ప్రస్తుత సమాజ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు . "ముఖ్యంగా అతనికి మంచి కుటుంబ నేపధ్యం ఉంది " అన్న అతడి మాటలో ఉన్న ఆర్తి ఈ వార్త చదివిన ఎంతమందిని కదిలించిందో నాకు సరిగ్గా తెలియదు కానీ నాకైతే అతడు సమాజాన్ని విప్పి చూపించాడనిపించింది. మనకుండే సామాజిక నేపద్యాలు ...... మన రాజకీయాభిప్రాయాలు ..... మన ఆచరణలు ...... వీటి బట్టి రాజ్యం యొక్క ప్రతి స్పందన ఉంటుందన్న విషయం చాలా మందికి అర్ధం కాదు . ఒక జేబుదొంగ గానీ ..... సైకిల్ దొంగ గానీ కనీసం ఒక ఎస్సై తో కూడా ఎక్కువ సేపు మాట్లాడే అదృష్టం పొంద లేడు.
                      
                   ఒక వ్యక్తి  విప్లవ కవిత్వం రాయడం తప్ప వేరే నేరం చేయక పోవచ్చు ..... కానీ నీకు  జైలు లో న్యూస్ పేపర్ కూడా దొరకక పోవచ్చు . అతడి   భావజాలం అందరికీ ఆమోద యోగ్యం కాక పోవచ్చు ..... కానీ అతడికీ .... వేల కోట్ల కుంభకోణాల ఆరోపణల మీద విచారణ కోసం జైల్లో పెట్టబడిన రాజకీయ నాయకుడికి జైల్లో లభించే సౌకర్యాలు .... హక్కులు పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధం చేసుకోవచ్చు . అంతే కాదు విచారణ పూర్తి చేసుకుని నిరపరాధి క్రింద బయటకు రాకముందే అన్ని రాజకీయ పక్షాల నాయకులు మహామహులైన కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా అటువంటి నేపధ్యం ఉన్న నాయకులను కలవడం కోసం తమ విలువైన సమయాన్ని చక్కగా ఖర్చు పెట్ట గలుగుతారు. కానీ తాము పూర్తిగా ఏకం కావడం మూలంగా భారత రాజకీయాలలో వచ్చే మార్పుల గురించి ఏ విధమైనా చర్చా జరపడానికి సుముఖలవ్వరు . ఇంత అధ్వాన్న పరిస్థితులలో కూడా సోషలిస్ట్ శక్తుల ఏకీకరణకు ఏ మాత్రం కృషి చేయని కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల వైఖరే భారత ప్రజల పట్ల జరుగుతున్న అతి పెద్ద రాజకీయ కుట్ర అని నా అభిప్రాయం . ప్రస్తుతం ఉన్న యువకులకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్దాంతం అంటూ ఒకటుంది అని తెలిసే లోగా ఈ పార్టీలు కనుమరుగు కాకూడదని కోరుకుంటున్నాను .

                          కనీసం భారత రత్న ఇచ్చే విషయంలో ఒక మంచి చర్చ జరుగుతోంది . నిజంగా సచిన్ మన క్రీడా రంగపు ఆణిముత్యం కావచ్చు ..... కానీ ముందున్న ఆణి ముత్యాలను వదిలేద్దామా ...... అంతే కాకుండా క్రీడా రంగపు రాజకీయాలన్నిటి మీదా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగితే బాగుంటుంది . కేవలం క్రికెట్ ఒక్కటే మన జాతీయ క్రీడగా ఎందుకు మారుతోంది .... లాంటి విషయాలను అనిల్ గౌరవ్ మాటల నేపద్యంతో ఆలోచించాలి

3 కామెంట్‌లు:

  1. Communists have failed and failed this country.....and still they are not in a position to smell the danger of lumpen industrialists ,lumpen politicians etc., Still they say simply that TATA is dangerous than a careless Autowala who never hesitates to travel in a wrong root on a highway with packed passengers for saving meager 10 to 20 ml of diesel.

    రిప్లయితొలగించండి
  2. అయ్యా!
    మీరు రాసిన విషయాలు నాకు ఏమ్హీ అర్థం కాలేదు.
    నా బోటి సామాన్యులకు అర్థమయ్యేలాగా రాస్తే బాగుంటుందండీ !
    కేవలం గొప్ప గొప్పవాళ్లకీ పోలీసులకూ మత్రమే అర్థమౌతాయనుకుంటాను పైన రాసినవి.
    సామాజిక 'నేపథ్యం' అంటే సమాజానికి జబ్బు చేస్తే పెట్టే 'పథ్యమా' ? :-)
    విప్లవకవిత్వం అంటున్నారు, భావజాలం అంటున్నారు, కుంభకోణాలంటున్నారు, కమ్యూనిష్టులంటున్నారు ... బాబోయ్ ! నాకేమీ అర్థం కావటం లేదు. భయం కూడా వేస్తోంది బాబోయ్!

    సచిన్ మన ఆణిముత్యం అంటున్నారు. బాగానే వుంది. ఇంకొంచెం వెనక్కి వెళ్తే గవాస్కర్ లు పటౌడీల మాటేమిటి. తుప్పలు నరికి తోవ వేసిన వాళ్లని వదిలేశాయి మన పేపర్లు, TV లు. వాళ్లకు ఉండిన సౌకార్యాలేమిటి? నాకు అంతగా తెలియదు గానీ ఈ రోజుల్లో డబ్బూ రాజకీయం లేకుండా అవార్డులున్నాయంటారా ? ఏమో ! ఇంకా కొంత కాలం ఆగాలనుకుంటాను సచిన్ అవార్డూ రాజకీయాలూ వ్యాపారమూ బయటికి రావాలంటే. వేచివుందాం.

    పాపం ఆ అనిల్ గౌరవ్ ఎవరో గానీ మింగలేకా కక్కలేకా వుండి వుంటాడు పాపం !

    కమ్యూనిష్టులు వేరేనూ సోషలిస్టులు వేరేనా ?

    ఏమైనా నాకు ఇలాంటి విషయాలు అర్థం కావాలాంటే ఇంకా చాలా కాలం పడుతుందను కుంటాను.
    మీ బ్లాగు బాగుంది. ఫాలో అవుతానండీ. ధన్య వాదాలు.
    :-)

    రిప్లయితొలగించండి