8, నవంబర్ 2011, మంగళవారం

అందరిలో హజారే ఉండాలి

ఇందుగలదందు లేదని సందేహము వలదు......ఎక్కడ వెదికినా ఏదో ఒకటి మీ కంటికి కనబడుతూనే ఉంటుంది.పైనున్న చిత్రాన్ని ఒక్క సారి పరీక్షగా చూడండి. వాహనాలు పార్క్ చేసిన స్థలంలో ఏది ఉంటే బాగుంటుంది? అది ఈ మధ్య కాలం వరకూ రాష్ట్ర రవాణా శాఖ వారి ఆధీనం లోనే ఉండేదని ఈ మధ్యనే నా మిత్రుడొకడు చెప్పాడు.కాదు అసలు ఆ స్థలం రాష్ట్ర రోడ్ ట్రాన్స్ పోర్ట్  కార్పోరేషన్ వారిదే అని కూడా అన్నాడు. నిజానిజాలు ఇంకా నాకు తెలియవలసి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ స్థలం లో ఒక పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నది. ఒక్క సారి మరలా ఆ కూడలి ప్రాముఖ్యాన్ని చూడండి.అక్కడ ఒక మంచి బస్ స్టాప్ కావాలా....లేక కమర్షియల్ కాంప్లెక్స్ కావాలా......తమరే చెప్పాలి. ఏ పేద వారికి ఉపయోగం కలుగుతుందని ఆ స్థలాన్ని అలా ధారా దత్తం చేసారో నాకైతే తెలియదు. నాకు అంత జ్ఞానం లేదు. ఆ కాంప్లెక్స్ లో చక్కగా KFC వారి ఫుడ్ కోర్ట్ ,4D theater లాంటి అత్యాధునిక సదుపాయాలూ ఉన్నాయి. కానీ వాటి వలన ఉండే ఉపయోగం కంటే హై వే కు ,ఒక గొప్ప విశ్వ విద్యాలయానికి ఆనుకుని ఉన్న ఆ స్థలం పేద వారికి, విద్యార్ధులకి ఇంకా ఎక్కువే ఉపయోగ పడుతుందని నా లాంటి పామరుడు అనుకో వచ్చు కానీ ప్రభుత్వ పెద్దల అభిప్రాయం అంత కంటే భేషుగ్గా ఉందేమో...

3 కామెంట్‌లు:

  1. భలే వారండీ, పేద విద్యార్థులకి చదువు చెప్పడానికి డబ్బు కావలి కదండీ ఆ పైసలు రావాలంటే, ఈ కాంప్లెక్సులు ద్వారానే కదండీ. ? కేపిటలిజం కావలిసినదే. మన దేశం లో ప్రశ్న ఎక్కడ అంటే ఆ కేపిటలిజం పనికి రానిదిగా పోవడానికి ముఖ్య కారణం the so called corruption. మేము దేశాన్ని ఉద్దరిద్దామని సివిల్స్ పాసైనపుడు ఎకానమీ చదివే రోజులలలో మన దేశం లో గురువు గారు మాల్కం ఆదిశేషయ్య గారి ప్రకారం ఒక ఎకానమీ కి మూడు రెట్లు బ్లాక్ ఎకానమీ ఉండేది. . ఇప్పడు ఎన్ని రెట్లో మన సింగు గారే లెక్క గట్టి చెప్పాలి. వేరే ఎవరికీ చేతనవదు లెక్క కట్టడానికి కూడా.

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. పేద వారి కోసం స్థలాలు సేకరించి యేవే వో చేయగలిగే స్థితి లో నేటి ప్రభుత్వాలు లేవన్నది జగద్విదితం. వ్యాపారం చేయాలనుకునే వారు నాలుగు రూపాయలు యెక్కువ ఖర్చు పెట్టైనా అనువైన స్థలం సంపాయించుకోగలరు. పేద విద్యార్ధులకు సహాయం చేయడానికే ప్రభుత్వ స్థలాలు లీజ్ కు ఇవ్వడమో ...అమ్మి వేయడమో చేయనవసరం లేదని నా మనవి. ఇంకొక్క విషయం యేమిటంటే వ్యాపారాలలో కూడా రెండు రకాలూ ఉంటాయి. ఉదాహరణకు ఇడ్లీ సాంబార్ దొరికే హోటల్ కు కె.యెఫ్.సీ. కి ఉండే తేడా విజ్ఞులకి వేరే వివరించనవసరం లేదు. రెండిటి లోనూ లాభాలుంటాయి కానీ యే వ్యాపారాన్ని మనం ప్రొత్సహించాలి అన్న దాంట్లొనే అసలు కిటుకు దాగి ఉంటుంది. కె.యెఫ్.సీ కి యే వర్గాల వారు వస్తారో.....దాన్లో ఉండే R.O.R(Return of Revenue) యెంతో కూడా అందరికీ తెలిసిన విషయమే.

    రిప్లయితొలగించండి