15, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఎత్తరుగుల మండువా లోగిళ్ళు

ఒక తరానికి ప్రతీకలుగా ప్రతి ప్రాంతం లోను కొన్ని కొన్ని గుర్తులు మిగిలి ఉంటాయి కానీ కొన్ని తరాలకు ప్రతీకలుగా ఈనాటికి మా గోదావరి జిల్లాలో మండువా లోగిళ్ళు నిలిచి వున్నాయి .అసలు విధమైన నిర్మాణం ఎప్పుడు మొదలైందో తెలుసుకోడానికి చరిత్ర లోకి వెళ్లి వలసి రావొచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం వీటికి అవసాన దశ ప్రాప్తిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచు . స్థూలంగా వీటి నిర్మాణాన్ని చూద్దాం . వీధి దిక్కులో ఉన్నా కానీ వీధి వైపు సింహద్వారం తప్పని సరి .దానికి ఎదురుగా మెట్లు ,వాటికి రెండు పక్కలా ..ఎత్తు అరుగులు తప్పనిసరి . దానిని దాటుకుని లోనికి వెళ్తే తగిలే దీర్ఘ చతురస్రాకారపు పెద్ద హాల్ నే మండువా అని పిలుస్తారు . దీని లోనుండి ఖచ్చితంగా కనీసం ప్రక్కలకు సరి సంఖ్య లోనే గదులు ఉంటాయి . సాధారణంగా రెండు లేక నాలుగు గదులు తప్పని సరిగా ఉంటాయి . ఇంకా పెద్ద ఇల్లయితే బెడ్ రూమ్స్ కు ఆనుకొని వరండా, దానికి అటు ఇటుగా స్టోర్ రూమ్స్ ఉడటం సాధారణం . విధంగా ఉన్న ఇంటినిచుట్టు వసారాలిల్లుఅని కూడా పిలిచే వారు . మండువా దాటి వెనుక వైపుకు దారి తీస్తే అక్కడొక వరండా దానికి ఆనుకొని వంటగది ఉంటాయి . సాధారణ నిర్మాణం అంతా ఇంచు మించు విధంగానే ఉంటుంది . ఆర్దిక సానుకూలత బట్టి గదుల కొలతలలోను . గుమ్మాలు , కిటికీ తాలూకు కలప ,పనితనం విషయాలలో తేడా కనబడేది . అదే విధంగా మిద్ది (సరంబీ అని ఈనాటికి అంటారు) తాలూకు పనులలో కూడా కొంత కొంత తేడాలు కనబడతాయి . పై కప్పు అంతా కూడా మట్టి పెంకులతోనే ఉంటుంది . పక్కన ఉన్న గదుల పైకప్పు మీద నుండి వచ్చే వర్షపు నీరు బయటకు పంపడం కోసం మధ్యలో ఒక దోనె( గట్టర్) ఉంటుంది . అది కోనికల్ గా కొనలో ఒక పైప్ ఉంటుంది . పైప్ గుండా వచ్చే నీరు మండువా లో ఫ్లోర్ లోనే కట్టబడిన ఒక గోతి లో కలెక్ట్ చేసి దానిని వేరే పైప్ ద్వారా బయటకు పంపేవారు . ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్ అయినప్పుడు గోతినే వాష్ బేసిన్ గా కూడా వాడేసే వారు . ఇప్పటిలా అప్పుడు వాస్తు తాలూకు విపరీత నమ్మకాలైతే ఉండేవి కావని వీటి నిర్మాణం చూస్తే అర్ధం అవుతుంది . చాలా మండువా లోగిళ్ళకు ఇప్పుడు చలామణి లో ఉన్న వాస్తు సూత్రాలు అప్లై చేస్తే అవన్నీ పడగొట్ట వలసి వస్తుంది . నిర్మాణంలో సౌలభ్యం గురించి కాకుండా ఇళ్ళ లోని స్త్రీల ప్రస్తానం ఎక్కడకు వచ్చిన్దనేదే యిక్కడ చూడవలసింది.

వర్షాధారిత వ్యవసాయం , వరదలలో కొట్టుకు పోయే పంటలున్నంత వరకు ఆంతా శ్రమ జీవులే. బహుశా కాటన్ ఆనకట్ నిర్మాణం జరిగిన తరువాత స్త్రీలకు జిల్లాలలో మిగులు సమయం చిక్కి ఉండవచు మగవాళ్ళు నెమ్మదిగా వీళ్ళని పొలం పనుల నుండి తప్పించేయడంతో వీళ్ళది కుటంబంలో సహాయక పాత్రకే పరిమితమై పోయింది .ఆఫీసుల్లో పని చేసే వాళ్లకు ఒకప్పుడైతే అర్ధం చేసుకోడం కష్టమయ్యేదేమో గాని ఇప్పుడు అందరికీ ఒక విషయం చక్కగా అర్ధం అవుతుంది. ఎవరికైనా భాద్యతలు తగ్గించారంటే వాళ్ళ కుర్చీ క్రిందకు నీళ్ళు వస్తున్నాయనే అర్ధం. అదే విధంగా స్త్రీల హక్కులు నెమ్మదిగా ఉపసంహరించ బడటమే కాకుండా వీరికి లేని పోని కొత్త అలవాట్లు కూడా మండువా లోగిల్ల లోనే వచ్చి ఉండవచ్చని నా అభిప్రాయం . శ్రామిక శక్తి గా ఉన్నంత కాలం స్త్రీలు అబలగా ఉండరు . నెమ్మదిగా వీరి కుటంబ శ్రమను ప్రొడక్టివ్ శ్రమగా గుర్తించడం మానేశారు . స్త్రీలు కూడా ఇదే పంధాకు అలవాటు పడి పొయ్యారు . మగ వాళ్ళు పొలం వెళ్ళగానే నలుగురూ మండువా లోగిల్ల లోనికి చేరి పోసుకోలు కబుర్లకి ప్రాధాన్యమున్న పనులు మొదలు పెట్టడం అత్యంత పరిపాటి గా మారింది ఇది నెమ్మదిగా ఎక్కడికి దారి తీసిందంటే స్త్రీలు చేసే ప్రతి పని తమకు నచ్చడం కంటే పక్కవాళ్ళకు నచ్చడమే ప్రధానంగా మారింది. స్వతంత్ర వ్యక్తిత్వాలు చాలా త్వరగా కనుమరుగై పొయ్యాయి. బలమైన వ్యకిత్వం లేని వాడికి పక్క వాడో , పై వాడో చెప్పిందే వేదం. అంతే నీకు మొగుడినా చెప్పాలి ..లేదా పక్కనున్న వాళ్లైనా చెప్పాలి. ఇదంతా మొగవాళ్ళకి అత్యంత అనుకూలమైన వ్యవస్థ. ఇది అలా ..అలా ఆడంబరాలకు దారి తీసింది. అందం అనే భావనను ఆడంబరం మింగేసింది. అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే తన భర్తకు అందంగా కనిపించాలనే తపన పోయి స్థానం లోకి పదిమందిలో ఆడంబరంగా కనిపించాలనే తాపత్రయం మొదలైంది. శృంగార భావనలు మనసు లో నుండి కానీ ....చాలా వరకు శరీరాల్లో నుండి కానీ ఇంకిపోతున్నాయనే సత్యాన్ని గుర్తించడం మానేశారు. నేను ఇంతకు ముందు వేరొక పోస్ట్ ( వీరూ గురించి ) లో రాసి నట్లుగా తమకు చీరలు, నగలు ఇంట్లో నింపిన మగవాడే మొగాడు గా మారాడు. ఒక విధంగా స్త్రీలకూ దేవుడిగా మారాడు. ఒక విధంగా ఇదంతా సమాజాన్ని పూర్తి పురుషాధిక్యత లోనికి నెట్టేసింది . తరాలు మారిన కొద్దీ దిగజారుడు పెరిగింది. మంచి,చెడు ఒకదాని కొకటి పెనవేసుకు పొయ్యాయి. మనకు మంచి జరుగుతున్నా ఒక పని వలన సమాజానికి చెడు జరుగుతుంటే అది " చెడు" కిందే లెక్క , మనకు ఒక వేళ కొంత నష్టం కలిగినా కూడా సమాజానికి దాని వలన మంచి జరుగుతుంటే అది 'మంచి" కిందే లెక్క విధమైన భావనలు మచ్చు కెక్కడా కనబడని స్థితి కి గ్రామ సీమలు దిగజారి పొయ్యాయి. మధ్య నే మా ఊరిలో ఒక పెద్దాయన పొయ్యాడు. వారి ఒక్క గానొక్క కుమార్తె చాలా ఘనంగా వారి కర్మ కాండలు చేసింది. ఊరంతా వెళ్లి సుష్ట్టుగా భోజనం చేసి ఆయన పేరిట ఇచ్చిన జ్ఞాపికలు అందుకొని వచ్చారు. వెనుకే " ఆయన మందులకి డబ్బు యీయక పొతే నెప్పికి తట్టుకోలేక ఆత్మహత్యచేసుకున్నాడని ......బ్రతికుండగా ఆయన చేత మహా తల్లి మరుగు దొడ్లు కూడా శుభ్రం చేయించేదని" చెప్పుకున్నారు. కానీ ఒక్కళ్ళు కూడా భోజనానికి వెళ్ళడం మాన లేదు. జ్ఞాపికలు తెచ్చుకోడం ఆపలేదు.

మురుగు కాలువ కంపుతో చచ్చేవాడికి కెమికల్ ఫ్యాక్టరీ కంపు తోడైనట్లు ఇప్పుడు దుర్ఘందానికి టీవి కంపు కలిసి దుర్ఘందాన్ని నలు వైపులా వెదజల్ల జేస్తోంది. దీనికి ఇక అంతం లేదా....అని మాత్రం బాధ పడనవసరం లేదు. ఒక కొత్త కల్చర్ పుట్టి ...... చక్కగా మరలా స్త్రీలు శ్రామిక శక్తి గా ఎదిగి మండువా లోగిల్ల నుండి బయటకు వచ్చి చక్కగా భర్తతో పొలం వెళ్లి పొలంలో కూడా చిన్న చిన్న పనులు కనీసం కూరగాయలు పండించడం లాంటి ఆదాయ వనరులు పెంచే పనులు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని పది మంది కోసం వినియోగించ వలసిన అవసరం కలిగినప్పుడు..దీని నుండి స్త్రీలు ,సమాజం విముక్తి చెందుతారు . రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిద్దాం.


2 కామెంట్‌లు:

  1. కరెక్ట్ గా చెప్పావు నాన్నా.. :)

    రిప్లయితొలగించండి
  2. "మనకు మంచి జరుగుతున్నా ఒక పని వలన సమాజానికి చెడు జరుగుతుంటే అది " చెడు" కిందే లెక్క , మనకు ఒక వేళ కొంత నష్టం కలిగినా కూడా సమాజానికి దాని వలన మంచి జరుగుతుంటే అది 'మంచి" కిందే లెక్క"

    నాకు ఈ స్లోగన్ బాగా నచ్చింది. నువ్వన్నట్లు స్త్రీలు ఒక శ్రామిక శక్తీ స్త్రీల దృష్టిని వేరే వాటిల మీదకి మల్లిస్తీ మల్లె మండువా లూగిల్లు ఆప్య్యయతలతూ కలకలా లడతాయి. అక్కడ మనకి వుదయోగాలు చేసే అవకాసాలు అంతగా లీఉ కాబట్టి.. చిన్న వృత్తుల లాంటివి చేపడితే ఆదాయానికి ఆదాయం..వాళ్లకి బోలెడు టైం పాస్.. ఇంక ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకూవడానికి సమాయమీ ఉండదు. మల్లె మన మండువా లోగిళ్ళు కల కల లాదతాయని ఆశిద్దాం....

    రిప్లయితొలగించండి