"ఏరోయ్.....ఎప్పుడు వచ్చావ్..వూర్లోకి...."
బజార్లో తిరుగుతున్న నన్ను మా బంధువు ఒకాయన పలకరించాడు.
"రెండు రోజులయ్యింది మావయ్యా...అక్క ఎలా ఉంది?
"అంతా బాగానే ఉన్నార్రా....నేను కూడా మీ నాన్నను కలసి చాలా రోజులయ్యింది..ఎలా ఉన్నాడు?"
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.ఏమీ మాట్లాడకుండా నిలుచున్నాను.
"మీ పెద్ద మావయ్యకు అంతగా బాగుండట్లేదు...యీ మద్యేమైనా వెళ్ళాడా?"
మళ్ళీ ఆయనే అడిగాడు.నా నుండి మాత్రం మరలా మౌనమే సమాధానంగా మిగిలింది.
అప్పుడాయనకు అనుమానమొచ్చింది.
"యేరా...మీ ఇంటికి వెళ్ళదం లేదా..?"
లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాను.
"మొత్తానికి చదుకొన్నోళ్ళూ లేనివాళ్ళూ ఒకేలా ఉన్నార్రా..బాబూ.."
"నా పొరబాటు ఏమీ లేదు మామయ్యా...మా అమ్మ..."
"సరేలేరా....రెండు రోజులు పొయ్యాక అమ్మాయి..నువ్వూ..మన వూరు రండి....లీవ్ ఉంది కదా..మన వాళ్ళందరనీ ఒక సారి చూసి నట్లుంటుంది"
ఉందన్నట్లు తల వూపాను.రెండు రోజుల తరువాత శ్రీమతి తో కలసి బయలుదేరాను.
సాయంత్రం అయ్యింది.
"పద..అలా పొగాకు బారెన్ల దాకా వెళ్దాం"
ఆయనతో బయటకు నడిచాను.
"ఇప్పుడు చెప్పు...నీ ప్రాబ్లెం"
చెప్పడానికి ఉద్యుక్తుడనయ్యాను.కానీ నాకాయన చాన్స్ ఇవ్వ లేదు.
"నీ అలోచన అంతా న్యాయం కావచ్చు కానీ నీ చిన్నప్పటి అంటే నెలల పిల్లాడిగా ఉన్నప్పటి సంగతి చెబుతాను.మీ పెద నాన్న చేసిన గొడవ వలన మీ తాతయ్య పోగానే పొలాన్ని పంపకాలు చేసేసారు.అందరికీ తలా కాస్త పొలం..కొంత అప్పూ వచ్చాయి. మిగిలిన వాళ్ళకు అంతగా ఇబ్బందేమీ లేదు కానీ..డిగ్రీ ఆఖర్లో ఉన్న మీ నాన్నకు అదనపు ఖర్చుగా నీవు.డబ్బుకు కటటలాడి పొయ్యేవాడు.ఎవరినీ వంద రూపాయల అప్పు అడగలేని గ్రామీణ అభిమానం.అలాంటప్పుడు ఒక రోజు నీకు తీవ్రంగా జ్వరం వచ్చింది.వేళ్ళాడి పోతున్నావ్. ఇంట్లో పైసా లేదు.మీ నాన్నకు యేమీ చేయాలో పాలుపోనప్పుడు నేను మీ ఇంటికి రావడం జరిగింది.మీ నాన్న కళ్ళలో నీళ్ళు ..దైన్యం.వెంటనే నిన్ను తీసుకొని కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన నా స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్ళి పరిస్థితి అంతా వివరించాను.నిజం చెప్పాలంటే అప్పటికి నేను కూడా స్టూడెంట్ నే కాబట్టి నా దగ్గర కూడా డబ్బులేమీ లేవు.నా స్నేహితుడు మాత్రం " అయ్యో డబ్బ్లున్నప్పుడే తీసుకొచ్చి ఇవ్వండి" అని మందులు కూడా ఇచ్చాడు.కాబట్టి పెద్ద వయసులో అందులోనూ ఒక కొత్త కుటుంబంతో నీ అనుబంధం పెరుగుతున్నప్పుడు వీళ్ళకు కాస్తంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావచ్చు...ఎంతైనా ఒక్కడివే కదా...."
ఆ తరువాత ఏమైందన్నది ఇక్కడ అప్రస్తుతం.
ఆ తరువాత మా తలిదండ్రులు యేదైనా విషయం లో కాస్త అన్యాయంగా మాట్లాడినా...ప్రవర్తించినా దానిని న్యాయాన్యాయాల దృక్కోణంతో చూడడం మానుకున్నాను.
ఆఫీస్ లో పై వాడు అన్యాయంగా మాట్లాడతాడు ..ఎదిరించగలుగుతున్నామా....పిల్లలకు పరీక్షలవుతుంటాయి..పక్కనున్న గుళ్ళోనో..మసీదులోనో..చర్చ్ లోనో లౌడ్ స్పీకర్ లు మ్రోగుతుంటాయి ఐనా మాట్లాడలేము. తలిదండ్రుల విషయంలో మాత్రం మనం ఆ సమ్యమనాన్ని ఎందుకు పాటించం...లోకువ కాబట్టి..
ఇటువంటిదే ఇంకొక సంఘటన గురించి చెబుతాను . మా అత్తవారిల్లు మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఇలా అనడం కంటే మా ఎదురింట్లో ఉన్న అమ్మాయినే నేను చేసుకున్నాననడం బాగుంటుంది.మా మావ గారు వరసకు నా మేనమామే. వాళ్ళది చాలా కాలం ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం.దానికి అధినేతగా మా శ్రీమతి నానమ్మే ఉండేది. ఆవిడకు మనుమలంటే వల్లమాలిన అభిమానం.వాళ్ళ మీద ఈగ వాలనిచ్చేది కాదు.అంత వరకూ ఐతే ఫరవాలేదు కానీ కాలేజ్ లో చదువుతున్న నాతో తన మనమరాళ్ళను అస్సలు మాట్లాడనిచ్చేది కాదు.మొదట్లో నేను పట్టించుకోకపోయినా తరువాత తరువాత నాలో హీరో కావాలనుకునే నా సంకల్పానికి యీవిడ చాలా ప్రతిబంధకంగా మారడం నేనస్సలు సహించలేకపోయాను.ఇంటికెదురుగా ఉన్న ఇద్దరు మరదళ్ళు తన వెనక బడక పోవడాన్ని అంధ్ర లో ఉన్న ఏ బావ కూడా క్షమించడు కాబట్టి నేను కూడా క్షమించ లేదు.యీ ప్రతిబంధకాన్ని ఎలా వదిలించుకోవాలో అలోచించిన నాకు మా పెద్ద బావ మరిది ఆపద్భందవుడిలా కనిపించాడు.అప్పట్లో వాళ్ళకు రెండు ఇళ్ళు ఉండేవి.ఒకటి మా ఇంటికి ఎదురుగా ఉండే ఇల్లు..మరొకటి పక్క వీధిలో ఉండేది...పైగా అది చాలా పెద్దది.మా ఇంటికెదురుగా ఇద్దరు మామయ్యలు ఉంటే పక్క వీధిలో ఉండే ఇంట్లో ఇంకొక మామయ్య ఉండేవాడు.కాబట్టి ఒక శుభోదయాన వాడికి జ్ఞాన బోధ చేసాను.
" మీరందరూ..చదువుకుంటున్నారు...అక్కడ ఇల్లు ఖాళీ యే కాబట్టి మీ మామ్మను అక్కడ ఉండమనొచ్చు కదా..మీకు కొంత గోల తగ్గుతుంది .."
కొంచెం ఎక్కువగా మాట్లాడే ఆవిడ అలవాటుని నేను ఆ విధంగా కాష్ చేసుకున్నాను.నేను అన్నదే తడవుగా మా బావ మరిది వాళ్ళ నానమ్మ మీద విరుచుకు పడి పోయి ఆవిడ ఆ ఇంటికి మారిపొయ్యేలా చేసాడు.
పాపం ఆవిడ దారిన వెళ్తున్న ప్రతి వాళ్ళతోనూ వీడిని చిన్నప్పటి నుండీ ఎంత గారాబంతో పెంచిందో ఆఖరుకి ఆవిడను ఎలా పంపించాడో చెప్పి తెగ బాధపడిపోతూ ఉండేది.ఒక విధంగా అప్పట్లో అర్ధం కాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటుంటే మాత్రం కొంచెం బాధ గానే ఉంటుంది.కాక పోతే తరువాత నేను ఆవిడ మనమరాలినే వివాహం చేసుకున్న తరువాత ఇవన్నీ ఆవిడ మర్చి పోయింది. మా అమ్మాయి చంటి పిల్ల గా ఉన్నప్పుడే ఎత్తుకుని ముద్దులాడుతూ
" ఇది బాబు కంటే నాలుగాకులు ఎక్కువే చదువుద్ది " అని అంటూ మురిసిపోయేది.
సెల్ ఫోన్ ల సంస్కృతి పెరిగిన తరువాత విజయా వారి సినిమాలు రిలీజ్ కు నోచుకోనట్లే యీ పాత్రలేవీ మునుముందు కనిపించవన్న బాధ ఆనాడు తెలియ లేదు తెలిసిన ఇప్పుడు పైనుంచి కురుస్తున్న కుళ్ళుని ఎలా అపాలో తెలియడం లేదు.