...నేను యెప్పుడైనా ఇవెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేయాల్సి వస్తే కొన్ని కొన్ని ఇన్నొవేటివ్ పద్దతులతో జనాలను యెలా ఆశ్చర్య చకితులను చేయాలా అని అలోచిస్తుండేవాడిని. అప్పట్లో నాకున్న బ్రిలియేంట్ అయిడియాలలో ఒకటి యేమిటంటే యేదైనా పెళ్ళిలో అకాశం నుండి వధూవరులను దేవతలు దీవిస్తున్నట్లుగా పైనుండి పూలవాన కురిపించే యేర్పాటు చేస్తే అమోఘంగా ఉంటుందేమోనని....ఆసలు ఇలాంటి గొప్ప..గొప్ప అయిడియాలు నాకే యెందుకు వస్తాయోనని మురిసి పోవడం కూడా జరుగుతుండేది. కానీ అంతటి భారీ వివాహ మహోత్సవాన్ని నిర్వహించే అదృష్టం నాకు ఇంకా కలగ లేదు కాబట్టి నా కలల్లోని యీ మహోన్నత ఘట్టాన్ని ప్రజలు వీక్షించే రోజు ఇంకెప్పుడా అని అప్పుడప్పుడు కొద్దిగా చింతించడం కూడా యెక్కువైన యీ తరుణంలో ఇంత త్వరగా నా యీ కోరిక తీరినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. యీ మద్యనే కొత్తగా మా జిల్లా నుండి మంత్రివర్యులైన ఒక రాజకీయ నాయకునికి ఘనాతి ఘనమైన ఆహ్వానం పలకటానికి హెలికాప్టర్ నుండి పూల వాన కురిపించారని తెలిసి ఆ మహత్తర దృశ్యాన్ని కనులారా చూచి తరించలేక పోయినందుకు కొద్దిగా బాధ పడ్డాను కూడాను . నా ఇన్నొవేటివ్ అయిడియాను నాకంటే ముందుగానే ప్రపంచానికి చూపించినందుకు ఒకింత అసూయ కలిగినా నాలాంటి బ్రిలియంట్ లకు ఇది మంచి సీజన్ లా కనబడుతుంది. అకాశాన్నుండి పువ్వులు కురిపించేకంటే మంచి ఇన్నొవేటివ్ ఐడియా మనసులోకి తొంగి చూస్తోంది. ఒకసారి షార్ లో ఉన్న నా ఫ్రెండ్ కి ఫోన్ చేయ్యాలి. అయ్యయ్యో నా ఐడియా ఇలా బయట పడిపోతుందేమిటి ? నేనసలే రాజకీయ పామరుణ్ణి. పెద్దగా సామాజిక శాస్త్రాలు చదువుకున్న వాడిని కూడా కాదు. అందుకే ఆ మంత్రివర్యులకు యెందుకింత ఘనమైన ఆహ్వానాన్ని పలికెరో కనుక్కుందామని ఆ ఆహ్వాన కార్యక్రమానికి వెళ్ళి వచ్చిన కొంత మంది ఆఫీస్ సహచరులని కూడా అడిగాను కానీ నాకు సరియైన సమాధానం మాత్రం దొరక లేదు. నేను ముందే విన్న వించు కొన్నట్లుగా నాకు కొన్ని విషయాల పరిజ్ఞానం మరీ సున్నా. ఆయన యెదైనా రైతు సమస్యల మీద కానీ మరేదైనా సమస్యల మీద కానీ ఉద్యమాలలో పాల్గొన లేదని మాత్రం వాళ్ళు చెప్పుకుంటుండగా విన్నాను. యెన్నెన్నో ఉద్యమాలలో పాల్గొని కేవలం ప్రజా స్రేయస్సు కోసమే మంత్రి పదవి చేపట్టిన ధన్య జీవులెవ్వరికీ దక్కని ఆహ్వాన మర్యాదలు వీళ్ళకు యెందుకు దక్కుతున్నాయన్న నా సందేహాన్ని నా స్నేహ వర్గంలో కొంత విజ్ఞుడని పేరున్న వాడిని అడిగాను.
" ఓరి పిచ్చి మొహమా...వీళ్ళూ ప్రజా నాయకులే ..వారూ ప్రజా నాయకులే... కానీ యే ప్రజల నాయకులన్న విషయంలోనే అసలు విషయ ముంది."
నాకు యే మాత్రం బోధపడ లేదు.
" మరి జనం వోట్లు వేసి గెలిపించారు కదరా..." నా సందేహాన్ని వ్యక్త పరిచాను.
" వోట్లు వేయక చస్తారా... యెవరో ఒకరికి వేయడమొక్కటే వాళ్ళకు తెలిసింది...సమాజం లో యే సిద్దాంతానికీ విలువ లేదు. అసలు సిద్దాంత మంటే యేమిటో జనాలకు తెలియదు. పై వర్గాలకు కావసినది కూడా ఇదే..కులానికి సామాజిక వర్గం అని ముద్దు పేరు పెట్టారు. సిద్దాంత రాజకీయాలు పూర్తిగా అంతరించి పొయ్యాక ఇక రాజకీయాల్లో కులాల సమీకరణాలే మిగులుతాయి. కాబట్టి ప్రతి నియోజక వర్గానికి ఒక్కొక్క ఒక్కొక్క సమీకరణం ఉంటుంది. మీడియా వారు కూడా కాండిడేట్స్ యే యే సామాజిక వర్గానికి చెందినవారో....ఆ వర్గం యొక్క వోట్స్ ఆ నియోజక వర్గంలో యెన్ని ఉన్నాయో చక్కగా అనాలిసిస్ లు రాస్తారు. ఒరేయ్ నీకివన్నీ అర్ధం కావు కానీ నన్ను వదిలి పెట్టు" అని వాడు వెళ్ళిపో బొయ్యాడు.
నేనంతగా ఓడిపొయ్యే రకం కాదు.
" మరైతే నేను రోదసీనుండి పువ్వులు జల్లే కార్యక్రమాన్ని నేను ఒక వేళ అక్టోబర్ 2 న మన సెంటర్ లో ఉన్న గాంధీ విగ్రహంతో ప్రారంబిస్తాను.." నాలో దాచుకొన్న ఇన్నొవేటివ్ ఐడియా ను బయటకు కక్కానన్న బాధ మొదలవకుండానే వాడు నా మొహంలోకి విచిత్రంగా చూశాడు.
" ఒరేయ్...ఆయన యే బిజినెస్ మేన్ కు గాని....కాంట్రాక్టర్లకు గానీ యే హెల్ప్ కూడా చేయలేదు... చేయలేడు .మరి ఫండ్స్ యెక్కడ నుండి తెస్తావ్రా......ఇంకొక విషయం కూడా చెబుతున్నాను ఆయన సామాజిక వర్గం కూడా పెద్ద సంఖ్య లో లేరు......అంతే కాదు మరే జాతీయ నాయకుడికీ నీవేమీ చేయలేవు. "
వాడింత చెప్పిన తరువాత కూడా నేను నా లోని కళ..వ్యాపారాన్ని...( నాలో ఉన్నదేమిటో నాకే తెలియదనుకొండి......) ఇంకా యెందుకు వేస్ట్ చేసుకుంటాను....మరలా ఎలక్షన్స్ ఎలానూ వస్తాయ్....అప్పుడైనా నాలోని కళా పురుషుడు బయటకు వచ్చి తీరుతాడు. యీ లోపులో మీ బుర్రలకు కూడా పదును పెట్టండి.....యేదైనా సీజన్ లో నాలుగు రూపాయలు వెనుక వేసుకోవాలి.....