31, డిసెంబర్ 2012, సోమవారం

సంవత్సరాంతపు ఆలోచన...సరి కొత్త సబ్సిడీ పధకం...ఫ్రీ గా ఉపయోగించొచ్చు...









"అయితే వాళ్ళు ఉదయం 7 గంటలకల్లా మన ఇంట్లో ఉంటారంటావ్"

"........"

"అంతేలే గోదావరి ఎక్స్ ప్రెస్  ఎప్పుడూ లేట్ ఉండదు"

"........."

"గోదావరి ఎక్స్ ప్రెస్  ఒకటో నంబర్ ప్లాట్ ఫార్మ్ మీదకు ఇచ్చి చస్తున్నాడు...ఎనిమిదో నంబర్ మీదకు ఇస్తేనే మన గోపాలపట్నానికి కన్వీనియెంట్..ఏది ఏమైనా 7 గంటలకల్లా ఇంటికి చేరుకుంటారులే"

"......."

"హైదరాబాదుకి మధ్యానానికల్లా ఫ్లైట్ వచ్చేస్తుంది కదా....రాత్రంతా గోదావరిలో ఏసీ లో బాగానే రెస్ట్ ఉంటుంది..ఫరవాలేదు"

".........."

"మరి టిఫిన్ ఏర్పాట్లు మాటేమిటి...మనింట్లో ఒక్క పూటే ఉంటారని అంటున్నావు కదా.."

"......."

"మనమేది పెడితే అదే తింటారని నాకు మాత్రం తెలిసి చావదేమిటి...నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్నారు...ఏదో స్పెషల్ ఉంటే బెటర్ కదా..." 

"........."

"ఒక పని చేయి పెసరట్టుప్మా...చేయి"

"........."

"అలాగే అంటే కాదు...మొన్న వారం  పెసరట్ల లో ఉల్లిపాయముక్కల కంటే ఇసుకే బాగా కనిపించింది"

"......."

"ఆ దిక్కుమాలిన .....కిరాణా కొట్టుకు వెళ్ళొద్దంటే వినవు...హాయిగా మాంచి సూపర్  బజార్  కు వెళ్ళమంటే...నీకు నాలుగడుగులు వేయడమంటే గగనమై పోతుంది"

"......."

"నువ్వెన్ని చెప్పు నేను వినను....కోట్లు పెట్టి షాపులు పెట్టి క్వాలిటీ మైంటైన్ చేయక పోతే రెండో రోజే నెత్తి మీద గుడ్డ వేసుకోవాలి...కాబట్టి నీవు సూపర్ బజార్ లో పెసర పప్పు తీసుకో. అలగే ఉప్మా రవ్వ కూడా అక్కడే తీసుకో..."

"......"

"నీ స్వంత బుర్ర వాడకు. నేను చెప్పింది విను...ఇంకొక విషయం చెప్పు. పెసర పప్పు బెటరా...పెసర గుళ్ళు బెటరా...."

"........."

"పెసర గుళ్ళు ఐతే కాస్త ఎక్కువ సేపు నానాలి కానీ .....టేస్ట్  కు అవే బెటర్"

"............."

"సరదాగా కాస్సేపు మనతో గడపడానికి వస్తున్నారని నాకు పదే పదే గుర్తు చేయనక్కర లేదు.వచ్చేది మీ స్వంత తమ్ముడు కాక పోయినా అమెరికా నుండి అక్క వరసైన నిన్ను చూడడానికి ఆగుతునాడంటే ఆ మాత్రం మర్యాద చేయక పోతే ఏడ్చినట్లుంటుంది" 

"........."

"ఏమిటి....ఆ టైం కే మీ తమ్ముడి కుటుంబం కూడా ఇక్కడికే  వస్తారా?"

"......" 

"వాళ్ళు కూడా ఇక్కడే  టిఫిన్ తింటారా...సీతమ్మ ధార నుండి ఎంత సేపు వస్తారు..హాయిగా టిఫిన్ చేసి రావొచ్చు కదా..."

"......."

"అంత మందికి పెసరట్లు వేస్తూ కూర్చుంటే నీకు మధ్యాహ్నం వరకూ వంటగదిలోనే సరిపోతుంది"

"......."

"అదేమీ కుదరదు....పెసరట్లే టిఫిన్...కావాలంటే పెసరట్లు మీ తమ్ముడి కుటుంబానికి పెట్టిన తరువాత ...రుబ్బిన పిండి చాలలేదని సీతమ్మ ధార తమ్ముడి కుటుంబానికి ఉప్మా తో సరి పెట్టేయ్..."

"........."

"మీ తమ్ముడు... మరదలు ..వంటగదిలోనే పీట వేసుక్కూర్చుని కబుర్లు చెబుతారా...అంటే నేను వాళ్ళతో మాట్లాడేదేదీ ఉండదా...."

"......."

"చిన్నప్పుడు అలాగే ఉండే  వాడని ఇప్పుడు కూడా అలాగే ఉంటాడని ఎలా అనుకుంటావ్..అంత పెద్ద ఉద్యోగం చేస్తూ...మారడని గారంటీ ఏమన్నా ఉందా..మీ ఎస్ కోట  నీ చిన్నప్పటి లానే ఉందా.?"

"........"

"పెసరట్లలోకి ఎన్ని చెట్నీలు చేస్తావ్..."

"........"

"ఉప్మా ఉన్నంత మాత్రాన ఒక్క చట్నీతో సరిపెట్టేస్తే ఏమి బాగుంటుంది...కొబ్బరి చట్నీ తో బాటు అల్లం చట్నీ కూడా ఉండ  వలసిందే.అసలు మా గోదావరి జిల్లా వాళ్ళకు తెలిసినట్టు మీ ఉత్తరాంధ్రా వాళ్ళకు టేస్ట్ లు తెలిసి చావవు.."

"........."

"శ్రీ  శ్రీ ..గురజాడ ..ఇక్కడి వాళ్ళా..వెధవ కౌంటర్ లు వేయకు....ముందు పెసరట్ల గురించి అలోచించు"

".........."

"అన్నీ అంత తేలిగ్గా తీసుకో వద్దని నీకు అనేక సార్లు చెబుతున్నాను....కొబ్బరి చత్నీ మరీ పిండిలా  గ్రైండ్  చేసేస్తావ్...నంజుకుంటున్నప్పుడు కొబ్బరి తగులుతూ ఉండాలి...అందుకు ఒక పని చేయ్...మొత్తం కొబ్బరి అంతా చట్నీ చేయకుండా కొంత కోరిన కొబ్బరి చట్నీ లో కలుపు."

"......."

"పచ్చి వాసనేమీ రాదు. దేనికైనా కొంత వెరైటీ మైంటైన్ చేయాలి"

"........"

"జీవించే విధానంలో వెరైటీ ఉండాలా....మీ నాన్నకు చెప్పు...మంచి ఉద్యోగం చేతూ కూడా మడిగట్టుక్కూర్చుని ఉన్న మడి కూడా అమ్మేసాడు.సరేలే కానీ ఉల్లిపాయలేమి  చేస్తావ్?

"......."

"అబ్బా ఏదో ఐనిస్టీన్ లా మాట్లాడేసావ్. ముక్కలు కోసి వేస్తారన్న సంగతి అందరికీ తెలుసు. అలా కాకుండా అవే ముక్కలు కాస్త నూనెలో వేయించి పెసరట్ల మీద జల్లితే  మరింత టేస్ట్ గా ఉంటాయి."

"........"

"మరీ అంత ఆయిలీ ఫుడ్ తినరా....ఇండియా లో ఉన్న నాల్రోజులకు కొలెష్ట్రాల్ ఏమీ పెరిగి పోదులేవోయ్....ఒక్క నిముషం ఫోన్ పెట్టేయనా...యే పొయ్యి మీదైనా ..యేదైనా మాడబెట్టావా...?"

"......."

"మీ తమ్ముడు కాల్ చేస్తున్నాడా...సరే... "

"................"

"ఏడ్చినట్లుంది ...అనుకోకుండా లీవ్ కర్టైల్ చేసుకోవలసి వచ్చిందా...మీ చిన్నాన్న..పిన్ని రేపు ఇక్కడ నుండి ఫ్లైట్ కు బయలుదేరుతున్నారా.....నిన్నెందుకు రమ్మనడం..ఇప్పటికిప్పుడు ట్రైన్ కు రిజర్వేషన్ దొరుకుతుందా..."

"......."

"తత్కాల్....వొల్వో బస్ టికట్ తీసే అంత సీనేమీ లేదు...ఉండు వేపగుంట దాటాను....బస్ దిగిన తరువాత తిన్నగా ఇంటికే వస్తాను..అప్పుడు మాట్లాడదాం." 


కొత్తవలస నుండి గోపాల పట్నం వరకూ నా పక్కన కూర్చున్న పాసింజర్ సెల్ ఫోన్ వాడిన విధానం ఇది.దీంట్లో సెల్ లోనే మాట్లాడవలసినంత విషయం  ఏముందో పాఠకుల విజ్ణతకే వదిలేస్తున్నా....

ఇంకొక  విషయం నేను గమనించింది ఏమిటంటే మా ఇంట్లో అంట్లు తోమడానికి పెట్టుకున్న పని అమ్మాయి దగ్గర నుండి ...మా కాంక్రీట్ పనులలోకి వచ్చే మొత్తం పని వారందరికీ సెల్ ఫోన్ లు ఉన్నాయి. అంతే కాదు వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డ్  లు కూడా ఉన్నాయి. అంటే బియ్యం మొదలైనవన్నీ రేషన్ మీద తెచ్చుకొనే సదుపాయం ఉంది. వీళ్ళందరూ కూడా సెల్ ఫోన్ లలో మాట్లాడే విషయాలు చాలా వరకూ పై విధంగానే ఉంటాయి.
బియ్యం లాంటివి సబ్సిడీ మీద వస్తుంటే వీరందరూ  దానికి పెట్టే ఖర్చు కంటే ఎక్కువగానే సెల్ ఫోన్ రీచార్జ్ లకు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు నెలకు ఎంతోకంత రేషన్ మీద ఫ్రీ టాక్ టైం సదుపాయం కలగజేస్తే బాగుంటుందేమో....అసలు అన్ని  సబ్సిడీలు ప్రకటిస్తున్న రాజకీయ నాయకులకి ఇలాంటి దివ్యమైన ఆలోచన ఎందుకు రాలేదో అర్ధం కాదు.

అంతిమంగా  ఎవరు లబ్ది పొందుతున్నారన్నది కాకుండా ఆ పూటకి ఎంత లాభం అన్నదే పరమావధిగా ప్రజల ఆలోచనా సరళి ఉన్నంత వరకూ ప్రభుత్వ  సబ్సిడీలతోనే కార్పొరేట్ సంస్థలు పెద్దవి అవ్వొచ్చు...పేదవాడు తన అజ్ణానంతో రోజు రోజుకూ మోసగించబడుతూ క్రిందకు దిగ జారుతూనే ఉంటాడు. ఒక కొస మెరుపు ఏమిటంటే రైల్వే లాంటి పెద్ద ప్రభుత్వ సంస్థలు తమ సీ. యూ. జీ. ఫోన్ కాంట్రాక్ట్  సాటి ప్రభుత్వ  రంగ సంస్థైన బీ.ఏస్.ఎన్.ఎల్. కు కాకుండా ఎయిర్  టెల్ కు ఇచ్చింది.

26, డిసెంబర్ 2012, బుధవారం

"నేను నా వూరిలో ఎందుకుండాలి?"




చాలా కాలం తరువాత అయినవిల్లి లంక వెళ్ళాను.వెళ్ళిన కారణం బాధాకరమైనదే అయినప్పటికీ చాలా కాలం తరువాత ఆ రోడ్ లో ప్రయాణించడం చాలా ఆహ్లాదాన్నిచ్చింది. ఏదైనా వాహనం ఆగగానే పరుగుపెట్టుకొచ్చే పూలమ్ముకునే పిల్లలు వాళ్ళ చేతుల్లో ఉండే రంగు రంగు పూల దండలు....పేదరికంలో ఉన్నా నాలుగు గోడల మధ్యా జీవితం మొత్తం గడిపేసే చాలా రకాల ఉద్యోగుల కంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది.వేమగిరి దాటగానే మొదలయ్యే నర్సరీలు హై వే మీద వెళ్ళే వాళ్ళకు కనువిందు చేస్తూ ఉంటాయి.అవి దాటగానే గోదావరి పలకరిస్తుంది.జొన్నాడ బ్రిడ్జ్ మీదుగా గోదావరి మాతకు "హలో" చెప్పుకుంటూ ముందుకు వెళ్ళగానే రావులపాలెం సెంటర్..కోనసీమ ముఖద్వారం.దానిని కూడా దాటుతున్నప్పుడు రోడ్ కు ఒక వైపు ఉండే కాలువ..వేరే వైపు ఉండే అరటి తోటలు అంతా అహ్లాదమే...కొత్త పేట రాకుండానే తగిలే జగ్గుపాలెం జంక్షన్ నుండి విడిపోయే ఇరుకు రోడ్ ముక్తేస్వరం వరకూ కాస్త ఇబ్బంది పెడుతుంది.ముక్తేస్వరం రాకముందే తగిలే అయినవిల్లి క్షేత్రం దేవాలయాలు....మొత్తానికి నాకు పెళ్ళైన మొదటి సంవత్సరం ఆషాఢానికి ఆ వూరు వెళ్ళిన దగ్గర నుండీ ఆ వూరు అంటే నాకు ఎప్పుడూ ప్రత్యేకాభిమానమే.అప్పటికే మా మామయ్యగారు ( మా శ్రీమతి కి చిన్నాన్న గారు అంటే పిన్ని గారి భర్త) యీ ప్రపంచాన్ని వీడి పది రోజులు కావస్తోంది కాబట్టి అందరి ముఖాల్లు కాస్త తెరిపిన పడ్డాయి.డెబ్భై నిండని ఆయన నిద్రలోనే యీ లోకాన్ని వీడడం మా అందరికీ ఎంతో బాధ కలిగించింది.తెల్లని పంచెలో ఉదయాన్నే  చుట్ట కాల్చుతుంటే ఒక సంస్కృతికి  ప్రతిబింబంగా కనబడేది.మా వూరు పట్టణానికి అత్యంత సమీపం లోనే ఉండడంతో మా వూరు..మా చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉండే మిగిలిన బంధువుల ప్రవర్తనకూ యీయన ప్రవర్తనకూ తేడా స్పష్టంగా ఉండేది.అందులోనూ మా శ్రీను  (మా శ్రీమతి పిన్ని గారి అబ్బాయి)మా శ్రీమతి కి అనుంగు శిష్యుడు కాబట్టి 2 రోజులు సెలవు పెట్టి మరీ ఆ వూరు వెళ్ళాను.



పెద్ద ఇల్లు. ఆ రోజుల్లో దగ్గర దగ్గర 15 అడుగుల ఫిల్లింగ్ చేయించి ఆ ఇల్లు కట్టారు.వరదలు ఆ వూరికి వచ్చి పోతుంటాయి కాబట్టి ఆ భయం లేకుండా ఉండడానికి అలా ఫిల్లింగ్ చేయించారు. చుట్టూ పెద్ద పెరడు. మా శ్రీను ఉద్యోగ రీత్యా తణుకు  లో ఉంటాడు.ఇల్లంతా అద్దెకు ఇవ్వాల్సి వస్తుందేమో.అదే మాట మా శ్రీను తో అన్నాను.
"ఇప్పుడు అదే పెద్ద చిక్కు వచ్చి పడింది బావా..."

"యే..అద్దెకు యివ్వడానికి మీ అమ్మ ఒప్పుకోడం  లేదా...."

"అదేమీ లేదు ..అద్దెకు ఉండే వాళ్ళే లేరు"

"ఇన్ని సదుపాయాలున్న ఇల్లు...కళ్ళకద్దుకుని ఉండొచ్చు కదా..."

"నీకొక్క సంగతి చెప్పనా బావా...మా వూరిలో పది సంవత్సరాల తరువాత మొన్న ఒక గృహప్రవేశ కార్యక్రమం జరిగింది."
"అంటే..."
" ఏమీ లేదు కరెక్ట్ గా చెప్పాలంటే ..మొత్తం మీద జనాభా పెరుగుతోంది...కానీ మా వూరు ..ఇదే కాదు ఈ పక్క ఉన్న లంకలన్నీ....నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి. "

"మరి వ్యవసాయం..."

"ఏదో టైం పాస్ కావాలంటే చేయాలి..."

ప్రహరీ గోడమీదుగా రోడ్ వైపుకు చూసాను. రాముల వారి కోవెల..పక్కనే పూజారి గారి ఇల్లు...కనుచూపు మేర కనబడుతున్న కొబ్బరి చెట్లు వాటి చాటున దాక్కున్నట్లుగా ఉన్న పెంకుటిల్లు....ఇక్కడ ఉండలేక జనం పట్టణాల వైపు పరుగు తీస్తున్నారు.బాధ వేసింది.

"కొబ్బరికాయకు రేటు లేదా..."

"ఉండొచ్చు..ఉండకపోవచ్చు..గారంటీ మాత్రం లేదు...నిజంగా చెప్పాలంటే పూర్తి గాలివాటం బ్రతుకులై పొయ్యాయి రైతులవి.."

"కానీ యీ స్వచ్చత...ఇవన్నీ టౌనుల్లో ఉండవు కదా శ్రీనూ..."

"నిజం బావా...నీవు చిన్నప్పటి నుండీ నన్ను చూస్తున్నావ్...నాకెప్పుడూ ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుంటూ బ్రతకాలనే ఉంటుంది.కానీ నా ఇష్టా ఇష్టాలకు నా పిల్ల భవిష్యత్తును పణంగా పెట్టలేనుగా." చాలా అవేదనతోనే అన్నట్లుగా అనిపించింది.

ఇంకా వేరెవరో అతిధులు వస్తే పలకరించడానికి శ్రీను వెళ్ళాడు.ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పెద్ద కొబ్బరి డొక్కల ప్రోగు ఉంది.ఇంత కొబ్బరి ఇక్క్ద నుండి ఉత్పత్తి అవుతున్నప్పుడు ఇక్కడ పీచు పరిశ్రమల్లంటివి డెవలప్ చేయలేదెందుకో...

ఇంకొకటి అలోచిస్తుంటే చాల భయంగా ..బెంగగా అనిపిస్తోంది. నెమ్మదిగా ఈ గ్రామాలు ఇక కనబడవా... 

భౌతిక పరిస్తితుల బట్టి వెళ్ళక తప్పదు.మన ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఆర్ధిక విధానాలబట్టే కదా భౌతిక పరిస్థితులు రూపు దిద్దుకొనేది.మనసులో అలోచనలు ముసురుకుంటున్నాయి.వంటవాడు వచ్చి తేవలసిన సామాన్ల లిస్ట్ ఇస్తున్నాడు.వింటుంటే అన్నీ పాత రకం కూరలే వినబడ్డాయి.ఆ తరువాత పంతులు గారు కార్యక్రమానికి కావలిసిన సామాన్లు చెప్పారు.ఇద్దరు కుర్రాళ్ళు బైక్ లు తీసుకుని రెడీ అయ్యారు.



శ్రీను మరలా వచ్చి కూర్చున్నాడు.

"వడ్డించడానికి కుర్రాళ్ళు నిలబడతారా...లేక దానికి కూడా బయటి వాళ్ళను పురమాయిస్తున్నావా?"

"లేదు ..ఇక్కడ కూడా సెల్ ఫోన్ లు వాడతారు కానీ మరీ అంత అర్ధం లేకుండా కాదు"

టీ లు వచ్చాయి.రాక రాక వచ్చాం..ఒక్క సారి ఎప్పుడో తిరిగిన గ్రామం కాబట్టి ఒక సారి పొలాల వైపు వెళ్ళడానికి తయారయ్యాను.

కేవలం మారిన అభిరుచులే ప్రజలను పట్టణాలవైపు పరుగెట్టుస్తున్నాయని అర్బన్ జనం అనుకొంటూ ఉంటారు.నిజాల లోతుల్లోకి ఎంతమంది వెళ్ళగలుగుతున్నారు?"

పొలాన్నుండి ఇంటికి తిరిగి వచ్చ్హాను.

"ఎక్కడికి పోయావ్..నీకోసం ఇందాకడనుండీ సుజాత...పెద్ద కళ్ళ బుజ్జి ఎదురు చూస్తున్నారు." శ్రీమతి నా మాట కోసం ఎదురు చూడకుండా వాళ్ళను పిలవడం కోసం లోపలికి వెళ్ళింది. యీ పేర్లు విన్నట్లే గుర్తు.మనుషులు కూడా గుర్తుకు వస్తున్నారు.మొదట ఈ వూరు వచ్చినప్పుడు అంతా చాలా చనువుగా ....కలుపుగోలుగా ఉండే వారు.

"ఇడిగోనే మీ ప్రసాద్ బావ " శ్రీమతి మాట విని అటు వైపు చూసాను.శ్రీమతి కరెక్ట్ గానే కనిపించింది కానీ ఆ వెనుక ఉన్న సరీసృపాలు ఎవరు..? అంటే వీళ్ళే...అమ్మో ...ఇంతకూ కళ్ళజోడు పెట్టుకుని సన్నాగా ఉండే సుజాతెవరో...అదే మాట పైకి కూడా వచ్చేసింది.

"నేను చెప్పానా....ప్రసాద్ బావ నన్ను గుర్తుంచుకుంటాడని" ఒక సరీసృపం జవాబిచ్చింది.

హమ్మయ్య అనుకున్నాను

"బాగున్నావా సుజాతా..."పలకరించేసాను.

"ఒరేయ్....అన్నిటి నిండా నీళ్ళు నింపేయండి.ఉదయం మరలా కరెంట్ ఉండదు.
నిజమే కరెంట్ ఉండదు.



అక్కడ కూడా మా వాడి స్నేహితులు ఉన్నారు.

"రేపు స్కూల్ మానెయ్యరా...మరలా రేపు సాయంత్రం వైజాగ్ వెళ్ళిపోతాం కదరా.." మా వాడు బ్రతిమాలుతున్నాడు.

ఆ కుర్రాడికి కూడా మానెయ్యాలనే ఉన్నట్లుంది. వాళ్ళ నాన్న వైపు ఆశగా చూశాడు. అతడు నాకు తమ్ముని వరసే.

"ఒరేయ్...పెదనాన్న వాళ్ళు సిటీ లో ఉంటార్రా....అక్కడన్నీ మంచి స్కూళ్ళే ఉంటాయి.బాగా చదువు కోవచ్చు..కాబట్టి వాడు ఎన్నిరొజులు మానేసినా కవర్ చేసుకోగలడు"

నాకే బాధనిపించింది.జాలిగా పెట్టిన ఆ కుర్రాడి ముఖం లోకి చూడలేకపొయ్యాను.

చిద్రమవుతున్న పల్లె జీవితం. రైతులకు నిత్యం జీవన పోరాటం.రేసులో పాల్గొనాలనే ఆరాటం. కానీ అది వాళ్ళకు సాధ్యం కాదని వాళ్ళకు అర్ధం అవుతూనే ఉంది కానీ...ఏం చేయాలో తెలియని పరిస్థితి.

ఆ తండ్రి మాటల్లో అబద్దమేమీ లేదు.

పల్లెల్లో చదువు చెప్పరా...చదువుకు అర్ధమూ...పరమార్ధమూ మారిన పరిస్థితులు....

ఆ మధ్య   " నువ్వు నాకు నచ్చావ్" అనే సినిమా బాగా హిట్ అయ్యింది. డానిలో హీరో ఒక చోట "పగలంతా పని చేసుకుని హాయిగా సినిమాకు వెళ్ళొచ్చి ..."అంటూ కోరికలు తగ్గించుకొని పల్లెల్లో కూడా సంతృప్తిగా ఎలా బ్రతకొచ్చో చక్కగా వివరిస్తాడు.ఆ రోజుల్లో ఆ ఒక్క దైలాగ్ కోసం ఆ సినిమా సీడీ కొని ఇంట్లో ఉంచుకున్నాను.

ఇప్పుడు కూడా ఆ మాత్రం సామాన్య రైతుకు అందుబాటులో ఉంటే వాళ్ళు ఆనందంగా జీవించేస్తారు.కానీ ఎలా...
నగరాల్లో.....పట్టణాల్లో ఉన్నవాళ్ళకు మాత్రమే రేస్ లో పాల్గొనే చాన్స్ ఉండేలా మన ప్రభుత్వ విధానాలు ఎందుకు రూపొందాలి?  
అత్యంత ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ చదవబొయ్యే వాళ్ళు సైన్స్ లేబొరేటరీ  చూపకుండానే ఉత్తీర్ణులను చేసే కార్పొరేట్ కాలేజ్ లకు పర్మిషన్ ఎలా వచ్చింది? 
రెండేళ్ళ జీవితాన్ని ఇంచుమించు సూర్యుడి ముఖం చూడనీయకుండా ...బాల్యం-యౌవనాల సంధి కాలాంలో విద్యార్ధులను పూర్తిగా సమాజానికి దూరంగా ఉంచి వాళ్ళలో అసంపూర్ణ వ్యక్తిత్వాలను ఎవరు పెంచుతున్నారు? యీ విధంగా చదువుతున్న వాళ్ళకు మాత్రమే అత్యున్నత ప్రొఫెషనల్ కాలేజ్ లలో సీట్స్ వచ్చె విధంగా మన విద్యా వ్యవస్థ ఎందుకు ఉండాలి?
కాలేజ్ లన్నీ యూనిఫార్మ్ గా ఉంటే గ్రామాలు...పట్టణాలు తేడా లేకుండా అసలైన టేలెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఉన్నత విద్యకు అవకాశాలు వచ్చేవి కదా...
ఇప్పుడు అందరికీ తెలిసిన ఒకే ఒక్క కామన్ విషయేమిటంటే ఏదోల నీవు ఏదో కార్పొరేట్ స్కూల్/కాలేజ్ లలో చదివితేనే టాప్ కాలేజ్ లలో సీట్ వస్తుందని.నీకు తెలియకుండానే నీవు రేస్ లోకి నెట్టబడుతున్నావు.
గిట్టుబాటు కాని వ్యవసాయాలూ చేస్తూ....కనీసం కరెంట్ ఉండని గ్రామాల్లో బ్రతికే బదులు చచ్చినట్లు రైతులంతా దొరికిన కౌలుకు తమ పొలాలని  వదిలి అలవాటు లేని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ శవాల్లా  బ్రతికే పరిస్థితులు ఏ ఒక్క రాజకీయ పార్టీ అన్నా గమనించిందా....
ఈ రేట్ రేస్ కు వ్యతిరేకంగా ఒక్క రాజకీయ పార్టీ అన్నా మాట్లాడే ధైర్యం చేస్తుందా?
మొత్తానికి జరగుతున్న విషయాన్ని కరెక్ట్ గా చెప్పాలంటే రైతుల చేత "పొమ్మనలేక పొగబెట్టినట్లు"గా గ్రామాలు ఖాళీ చేయిస్తున్నారు. వ్యవసాయం ఎవరు చేస్తారో పాలక వర్గాలకు కరెక్ట్ అంచనా ఉంది.గిరిజనుల చేత అడువులు....రైతుల చేత గ్రామాలు ఖాళీ చేయించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
రాత్రి చాలా సేపు యీ విధమైన అలోచనా స్రవంతి నడుస్తూనే ఉంది. రేవుకి వెళ్దువుగాని లే ఇక అని శ్రీమతి మాటలకు మెలుకువ వచ్చింది.
పిల్లలెవరూ స్కూల్ మాన లేదు.బంధువులంతా పోగయ్యారనే ఆనందం వాళ్ళకు మిగల లేదు.భోజనాలయ్యాయి.కూరలు మాత్రం పాత సాంప్రదాయ కూరలే.చాలా బాగున్నాయ్.  తిరిగి బయలు దేరాం.కానీ మా శ్రీను మాటలు మాత్రం నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయ్.

"నేను ఈ వూరిలో ఎందుకుండాలి?"

7, డిసెంబర్ 2012, శుక్రవారం

చలిచీమలు ఐకమత్యం పోగొట్టుకున్న నాడు.......


నా చిన్నప్పుడు మా వూరిలో ఒకాయన అప్పుల బాధలు భరించలేక I.P..(Insolvement procedure) పెట్టాడు.ఆయన అప్పులు ఎందుకు చేసాడో నాకైతే తెలియదు కానీ నేనెరిగుండగా ఆయన ఎక్కువగా వీధిలోకి రావడం నేను చూడలేదు.ఎప్పుడూ ఏదో పోగుట్టుకున్నట్లుగా వీధి అరుగు మీదే కూర్చుని ఉండేవాడు. బహుశా నేననుకోవడం ఆయనలో అపరాధ భావన మనసులో ఉన్నందువలనే పదిమందిలోనికి రాలేక పొయాడని......... అందరూ ఇది  నమ్ముతారనే అనుకుంటాను.




ఇంకొక విషయానికి వస్తే మా వాడి స్కూల్ గేట్ కు ఎదురుగా రోడ్ డివైడెర్ లో ఖాళీ ఉండని కారణం వలన గేట్ పక్కన ఉండే రోడ్ లో ఒక దిశలో  మాత్రమే ప్రయాణం చేయగలుగుతాం. కానీ గేట్ కు కొద్ది పాటి వెనుకగా డివైడెర్ లో రోడ్ క్రాసింగ్ కోసం ఖాళీ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మా వాడిని స్కూల్ లో దిగబెట్ట వలసి వచ్చినప్పుడు గేట్ నుండి ఆ కాస్త ముక్క ఒక పక్కగా బండిని నడిపించుకొని వచ్చి డివైడెర్ లో ఖాళీ వదిలిన భాగం  నుండి రోడ్ క్రాస్ చేయడం నా అలవాటు.ఆ మద్యన అలా చేస్తున్నప్పుడే రాంగ్ రూట్ లో వస్తున్న ఒకడు నన్ను గుద్దినంత పని చేసాడు.పైగా అడ్డంగా వాదించడం కూడా మొదలు పెట్టాడు.వచ్చిందే రాంగ్ రూట్ ( నాది కొంత వరకూ అదే కావచ్చు కాబట్టే కానీ జనం నడిచే భాగం  లో నుండే నేను నా టూ వీలర్ ను నడిపించుకొని తీసుకు వెళ్తున్నాను అది కూడా ఆ రోడ్ లో ఏ మాత్రం రద్దీ ఉండదు కాబట్టి ఆ మాత్రం దూరమైనా నడిపించే ధైర్యం చేస్తున్నాను లేదంటే సక్రమమైన రూట్ లోనే వెళ్ళి ఉండే వాడినని నిజాయితీగా చెబుతున్నాను. ) కానీ నన్ను గుద్దబోయినతడు మాత్రం 80 కిలో మీటర్ల వేగంతో వస్తున్నాడు.అతగాడు మా ఇద్దరిదీ  ఒకే విధమైన నేరమని వాదించాడు.నేను అలోచించిందేమిటంటే నేను చేస్తున్న పని వలన ఎవరికీ హాని జరిగే అవకాశమే  లేదు కాబట్టి ఆ మాత్రం బండిని నడిపించాను పైగా డ్రైవ్ చేయకుండా నడిపించాను కాబట్టి అది కేవలం వస్తువును మోస్తున్న కాలి నడికతో సమానమని ...కానీ అతగాడు ఒప్పుకోకుండా "మీది రైటైతే నాదీ రైటే ...మీది రాంగ్ ఐతే నాదీ రాంగే" అంటూ వాదించడం మొదలు పెట్టాడు. నాకు వొళ్ళు మండి అతగాడి బండి తాళం చెవులు తీసుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్ళడానికి సిద్దమయ్యాను.అప్పటికే మా చుట్టూ కొంతమంది చేరి ఉన్నారు పైగా వాళ్ళెవరికీ అతగాడి భజన చేయడం వలన ఉపయోగం ఏమీ లేదు కాబట్టి అతగాడిని కాస్త గట్టిగా మందలించి గొడవను సర్దుబాటు చేసారు.అతగాడు అంత దారుణంగా...కాస్త కూడా అపరాధ భావన లేకుండా అలా వాదించడం నన్ను కొంత నిశ్చేష్టుడిని  చేసిన మాట మాత్రం వాస్తవం. కానీ ఇదేమీ ఆశ్చర్య  పోవలసిన అవసరం లేని విషయమేనని కొద్ది రోజుల తరువాత మా రమణ చేసిన హితోపదేశం వలన అర్ధం అయ్యింది.

రమణంటే మా దగ్గర తాపీ మేస్త్రీగా పని చేయడానికి ప్రయత్నించి వాడికున్న చేతి వాటం వలన మా కాంట్రాక్టర్స్ చేత పనిలోనుండి వెళ్ళగొట్టబడిన వాడు.పనైతే మానేశాడు కానీ వాడి వూరు పక్కనే ఉండడం వలన అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటాడు.నాకంటే వయసులో బాగా చిన్న వాడు కాబట్టి నాకు వాడిని  "ఒరే" అని సంభోదించడం అలవాటు అంతే గాని నాలో కులాధిక్య భావజాలాన్ని  మాత్రం వెదకొద్దని విన్నవించుకొని మన కధలోకి వస్తున్నాను. ఇది నవంబర్ నెల కాబట్టి ఆఫీస్ బయట చెట్టు కింద కూర్చుని ఉన్న నా దగ్గరికి నవ్వుకుంటూ వచ్చాడు.మనిషి హుషారుగా ఉన్నాడు. తలకు నూనె రాసి దువ్వాడు..ఇస్త్రీ బట్టలు.

" ఏదైనా పని లో కానీ చేరావేంట్రా ..బండి హుషారు మీదుంది" పలకరించాను.
"లేద్సార్....ఇక పని చేయవలసిన అవసరమే ఉండదు"
"అదేరా....గాలితో ఆకలి తీర్చుకొనే మంత్రాన్నేమైనా కనిపెట్టావా?"
"అదేమీ లేదు సార్...నేను ఎలక్షన్లో నిలబడదామనుకుంటున్నాను.."
వులిక్కి పడ్డాను.వాడు దొంగతనాలు చేస్తాడని అందరికీ తెలుసు..తాగుతాడు...అసలు నమ్మకస్తుడు కాదు.మరి వీడికింత ధైర్యం అలా వచ్చేసింది.అనుకోకుండా అదే మాట పైకి కూడా అనేశాను.
"సారూ లోకం మొత్తం మారిపోతోంది......నేను దొంగనైనా ఫరవాలేదు...నా  టెక్నిక్ లు నాకుంటాయ్"
"దొంగవని తెలిసీ కూడా నీకెలా వోట్లు వేస్తార్రా...అసలు నువ్వు ప్రచారానికి ఏ ముఖం పెట్టుకుని వెళ్తావో నాకైతే అర్ధం కావడం లేదు"
" మరి మీకంతే తెలుసు.నేను యీ మద్య పనికి ఆహార పధకంలో ఉన్నప్పుడు బోల్డంత ఖాళీ ఉండేది.పేపర్ తెగ చదివాను. బయట జనాన్ని చూసాను.కాబట్టే నేనేం చేస్తే బాగుంటుందో అర్దమైపోయింది."
"ఏమర్దమయ్యిదిరా....దొంగలకు కూడా జనం వొటేస్తారనా....."
"అదే సార్...మీరు కరెక్ట్ గానే కని పెట్టారు."
గతుక్కుమన్నాను. నేనేదో వేళాకోళంగా అంటే వీడు అదే నిజమంటాడేమిటి.."
"ఇప్పుడు జనం ఎలా ఉన్నారో మీకు తెలియట్లేదు.మా వూళ్ళో మా కులపోళ్ళకి ఒక చెరువుంది.అదేంటో  తెలియదు కాని దాన్లో చేపలు మాంచి రుచిగా ఉంటాయని అంతా అనేవారు.మా తాత అప్పట్లొ మా కులానికి పెద్ద మనిషి. అప్పుడింకా యీ కాంక్రీటు స్లీపర్లు లేవు కాబట్టి ఎప్పుడూ లైన్ పనులు అవుతూ ఉండేవి.ఈ చెరువులో చేపలకు వేలం పాట ఉండేది.ఆ డబ్బులెట్టి వెదురు గంపలూ గడ్డపార్లూ ..పారలూ..లాంటివి కొని మా తాత ఇక్కడోళ్ళని అంతా పేద్ద ముఠాగా చేసాడు.ఎక్కడ పెద్ద పనులున్నా ముందు మా వూర్లో వాళ్ళనే పిలిచేవారు.పనీ చేయించేవాడు...రేటూ తీసుకునే వాడు."

"మరిప్పుడేమయ్యింది?"
" మా నాన్న హయాం వచ్చే సరికే కాస్త సినిమా పిచ్చి ముదిరి పోయింది...ఎవడికో ఏదో అయిడియా వచ్చింది....ఈ చెరువు పాట డబ్బు పెట్టి జాతర చెయ్యాలన్నాడు.మా నాన్న వొప్పుకోలేదు. పైగా అప్పటికే మా నాన్న మరి కొంత మంది..... కొత్త మతం తీసుకున్నారు.అవతలివాళ్ళకు వంక దొరికింది. మొత్తానికి కొంత డబ్బు జాతరకీయడానికి ఒప్పుకున్నారు"
"అదేంట్రా ...అసలు మీ నాన్నే మొత్తం చెరువు తాలూకు డబ్బు నొక్కేస్తుంటే  మీ కులంలోనే కొంతమంది ఎదురు తిరిగారనీ... వాళ్ళ పీడ వదిలించుకోడం మీ నాన్నే జాతర పేరు మీద మందు అలవాటు చేసి వాళ్ళ కోసం కొంత ఖర్చు పెట్టి మిగిలిందంతా మీ నాన్నే నొక్కేసే వాడని మీ వాళ్ళే చెప్పారు. పైగా ఆ డబ్బుతో చెరువు నిండా ఉండే కలువ పూలు గుర్తుండే లా నీ కోసం మాంచి ఇల్లు కూడా కట్టడం మొదలు పెట్టాడట  కదా.....మీ  వాళ్ళ లోనే ఎవరో చదువుకున్న వాడి చేత కలువల నిలయలాంటి పేరు కూడా పెట్టాడట"
"తమరేమీ నమ్మకండి సార్....మా వూరోళ్ళంతా వెధవలు..."
"భలే చెబున్నావురా  బాబూ....నువ్వేదో పెద్ద విప్లవకారుడిలా....ఏదో మీ వూరి భూస్వాములంతా నీకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లుగా....అసలు  రైల్ ఏక్సిడెంట్ లో మీ నాన్న చనిపోక పోతే ఇంకా నీవు మీ నాన్న కలసి  దారుణంగా మేసేసి ఉండేవాళ్ళని కూడా చెబుతున్నారు."
"మనలో మన మాట సార్...మీరు చెప్పేవన్నీ నిజమే  కావొచ్చు కానీ ఈ సారి పంచాయితీ ఎలక్షన్లో నేను గెలవడం ఖాయం."
"అంత ఖచ్చితంగా ఎలా చెప్పేస్తున్నావురా బాబూ..."
"దానికి చాలా లెక్కలుంటాయి సార్....నా కులం లో ఎక్కువ మంది నా మతం వాళ్ళు కాదు అలాగే నా మతం వాళ్ళు ఎక్కువ మంది కూడా నా కులం వాళ్ళు కాదు..కానీ వాళ్ళకుండే ప్రయోజనాల కోసం ఇద్దరూ నాకే వోటేస్తారు.మీకింకొక సంగతి చెప్పనా....వార్డు మెంబర్ ల కింద నా తరుపున పోటీ చెయ్యడానికి అప్పుడే ఎంత మంది తయారై పోతున్నారో..."
నాలో సహనం చచ్చి పోయింది.
" ఒరెయ్..నీవొక దొంగ వెధవ్వి..ఆ సంగతి వూరంతా తెలుసు కదరా....నీ పోటీదార్లు వూరంతా ప్రచారం చేయలేరా...?"
"అదే  సార్ మీకర్ధం కానిది..నాకు నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే  హక్కుంది....నోరుంది.ఆరోపణలు చేసే హక్కుంది. ఎన్ని అబద్దాలైనా సిగ్గులేకుండా చెప్పేయగలను.పది సార్లు పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరిగినవాడిని.మరెన్ని సార్లైనా వెళ్ళడానికి సిద్దపడే ఉంటాను.అంతే కాదు నాకు తోడుగా  మా కుటుంబ సభ్యులు కూడా సిగ్గులేకుండా ఎన్ని అబద్దాలైనా ఆడగలరు.ఇదంతా జనం నమ్మేస్తారని కాకపోయినా ఎదుటి వాళ్ళు చెప్పే నిజాలను పలచన చేయడానికి బాగా పనికి వస్తాయి.జనానికి పట్టని ఇంకొక విషయం కూడా చెబుతాను. నా పోటీదార్లు కూడా నేను,మా నాన్న చేసిన వెధవ పనులను చెప్పుకుంటూ పోతూనే దానికి విరుగుడుగా ఏమి చేయొచ్చో చెప్పరు."
"అంటే ఇది నీ పోటీదార్ల బలహీనతే అంటావ్"
"పోటీదార్లంటే వాళ్ళూ అంత పెద్ద చరిత్ర ఉన్న వాళ్ళు కాదనుకోండి.అందుకే జనానికి వాళ్ళన్న పెద్దగా నమ్మకం లేదు.కనీసం నాకొక దొంగల రాజ్యం ఉన్నది.నాకంటే చిన్న దొంగతనాలు చేసే వాళ్ళంతా నన్ను నాయకుడిగా చూడాలనుకుంటున్నారు.ఒక దొంగో దోపిడీదారో రాజ్యాధినేత అయితే దొంగలంతా హాపీ యే కదా సార్..."
నా బుర్ర గిర్రున తిరగడం మొదలు పెట్టింది.
"పోనీ నీ దొంగతనాలేవేవో నీవేడవకుండా నీకీ రాజకీయాధికారం ఎందుకురా ....ఏదోలా నడిపించుకుంటున్నవు కదా..."
"సారూ అధికారంలో ఉన్న వాళ్ళూ నాకంటే మంచి వాళ్ళలా ఏమీ అనిపించ లేదు.బెయిల్ లాంటివి కావలసి వచ్చినప్పుడల్లా వాళ్ళనీ వీళ్ళనీ బ్రతిమాలాడ వలసి వస్తోంది. ఎందుకీ శ్రమంతా అని మా నాన్నెనకాల తిరిగినోడే నన్ను ఎగదోశాడు.ఆడు మాత్రం అటూ ఇటూ కాకుండా ఉన్నాడు. ఒక్క విషయం గురువుగారూ....నేను గెలిచే వాతావరణం కనబడితే ఇప్పుడు పెత్తనం చేస్తున్న వాళ్ళలో చాలా మంది యే మాత్రం సిగ్గుపడకుండా నా వైపుకు రావడం ఖాయం.ఎందుకంటే వీళ్ళేమీ పెద్ద పెద్ద సిద్దాంతాలున్న వాళ్ళేమీ కాదు.ఎందుకంటే నేను మా నాన్నెనకాల తిరిగే టప్పుడు మా వూరికి అక్కడెక్కడో ఉండే జమీందార్ లాంటి వాడు వచ్చాడు.ఆడికి లేని ఫేక్టరీ ఇంకెక్కడా లేదంట.కానీ మనిషి మాత్రం ఒకటో రకం లుచ్చా అని జనం చాలా మంది అనేవారు.అప్పటికి అధికారంలో ఉండే మా మాజీ ప్రెసిడెంట్ ఆయన్ను భుజాల పెట్టుకొని మోసేశాడు.ఆ తరువాత వచ్చిన ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఏకంగా ఆయన్ను తల మీద పెట్టుకుని మొక్కేస్తన్నాడు.మరి నన్నందుకీళ్ళు మొయ్యరనిపించింది...అందుకే నేనే ప్రెసిడెంట్ అయిపోవాలనుకున్నాను"
"ఆ జమీందార్ లుచ్చా అని నీకెవరు చెప్పార్రా.."
"మీరు మా వూరెప్పుడూ రాలేదు కదూ...మా పేటకవతల ఒక కూలిపోడానికి సిద్దంగా ఉన్న పెంకుటిల్లు ఒకటుంటాది. దాని మీద ఒక ఎర్రటి జెండా ఎగురుతూ ఉంటాది. అందులో దగ్గుకుంటూ ఒక ముసలాయన ఉంటాడు. ఒకప్పుడు అంటే మా నాన్న కుర్రాడిగా ఉన్నప్పటి  వరకూ ఆయన చుట్టూ  చాలా మంది ఉండేవారంట.ఏటయ్యిందో నాకు తెలీదు కానీ మా నాన్న చెబుతూ ఉండేవాడు ఆయనతో ఉండే వాళ్ళంతా పది ముక్కలై పొయ్యారంట.ఓ పక్క మా వూరి పెద్ద రైతులంతా దొరికింది దొరికినట్టు మింగేత్తా  వుంటే యీళ్ళేమో నాదంటే  నాది రైటంతూ తన్నుకు చచ్చారంట.యీళ్ళెందుకు తన్నుకుంటున్నారో  మా తాతకి..నాన్నకి ఏమీ అర్ధమై చావలేదంట.ఆ మాటకొస్తే ఈళ్ళెనకాల తిరిగే చాలా మంది పరిస్థితి ఇంతే నంట.తన్నుకు చస్తున్న వీళ్ళతో ఎందుకని అప్పటి వరకూ వీళ్ళనక ఉన్న జనమంతా వూళ్ళో  ఉన్న పెద్ద రైతులెనక సర్దుకున్నారు.ఇప్పుడు ఆ ముసలాయన ఒక్కడే మిగిలాడు.కానీ నా లాంటాడు పని లేక పోతే ఆయన మాటలు వింటాడు కానీ లేదంటే ఎవడూ పట్టించుకోడు"
"కనీసం నీవు దొంగవన్న సంగతన్నా ఒప్పుకుంటాడా ఆయన"
"ఏమో సారూ ..ఆయన దగ్గరున్న సిద్దాంతాలలో  దీని గురించి లేదంట..అందుకని ఎక్కువ పట్టించుకోడు...పట్టించుకున్నా ఆయన మాట వినీవోడు ఎవడూ లేడు."
"కుర్రాళ్ళెవరైనా ఆయనతో మాట్లాడతారా.."
రమణ ఎందుకోగాని ఫకాల్న నవ్వేశాడు.
"ఆళ్ళెవరితోనూ మాట్లాడరు సారూ...చెవులో ఎప్పుడూ అ ఫోన్లు పెట్టుకుని ప్రపంచంతో సంబందం లేకుండా ఉంటారు. మా మేనల్లుడు చదువుకొనదానికి మా ఇంట్లోనే ఉంటాడు. కనీసాం ఆడు నిద్ర పోయినప్పుడైనా చెవులోనుండి వాటిని తీస్తే ఠాక్కుమని లేచి కూర్చుంటాడు.కాబట్టి ఆళ్ళను అసలు లెక్క లోకి తీసుకోకూడదు."
" అంటే మొత్తం దొంగలంతా కలసి రాజ్యాధికారం చేస్తుంటే మిగిలిన జనం అంతా అన్నీ మూసుకొని చూస్తూ .......సబ్సిడీలు కింద మీరు పడేసే ఎంగిలి తింటూ బ్రతకాలన్న మాట "
" మరి మీలాంటోళ్ళంతా నాకెందుకులే అని తెలిసిన నిజాలను కూడా పది మందికీ తెలియ చెప్పకుండా....హాయిగా ఉద్యోగాలు..చేసుకుంటూ...జీతాలు తీసుకుంటూ....ఇంటికెళ్ళి హాయిగా టీ వీ లో సీరియల్స్ చూసుకుంటూ..... పిల్లలకి ఎంట్రేన్స్  టెస్ట్స్ లో రాంకులు వస్తున్నాయో లేదో మాత్రమే చూసుకుంటూ అందరూ కలసి ఆనందంగా బ్రతికే మార్గాల గురించి చూడకుండా ఎవడికి వాడు బాగు పడి పోయే మార్గాలు మాత్రం చూసు కుంటుంటే ఖచ్చితంగా నాకు తాళాలు ఇచ్చినట్లే......మీరెలాగూ మారరు....మమ్మలని అధికారం లోకి రానీకుండా ఆపలేరు. మీ బలహీనతే మా బలం...."రమణ నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపొయ్యాడు.
చాలా సేపు నా మెదడు లో ఏదో హోరు........తట్టుకోలేని నేను ఆ చెట్టుకిందే ..కుర్చీలో మగత నిద్ర పొయ్యాను. స్వాతంత్ర్యం రాక ముందు నుండీ మొన్న మొన్నటి వరకూ ఉన్న మహానుభావులంతా విచారకరమైన ముఖాలతో ముసురుకున్న చీకట్లలో  నుండి ఏదో వైపుగా కాంతి రేఖ కనిపించదా అని ఆశగా చూస్తున్న దృశ్యం కలలగా వచ్చింది.
ఇది ఎవరి వల్ల అవుతోందని ఎదురు చూడ్డం అనవసరమనిపిస్తోంది. ఎందుకో కాలేజ్ రోజులు గుర్తుకొచ్చాయి. కేవలం ముగ్గురు సహచరులుతో మొదలుపెట్టిన స్టూడెంట్స్ ఫెడరేషన్  బ్రాంచ్....... మొత్తం కాలేజ్ అంతా దాని ప్రభావం లోకి తీసుకుని రాగలగడం ....దాని తరువాత కాలేజ్ లోనూ...మా గ్రామం లోనూ... తీసుకొచ్చిన మార్పులు అన్నీ గుర్తుకొచ్చాయి. ఏదో ఒకటి చేయాలి  .లేచి నిలబడ్డాను. మళ్ళీ కుర్రాణ్ణయ్యాననిపిస్తోంది........  



 

19, నవంబర్ 2012, సోమవారం

పత్రికాలు-వార్తలు-వాస్తవాలు

మొత్తానికి కొంత శ్రమ అయినప్పటికీ అనుకొన్నట్లుగా ఆశ్రమం దసరా రోజునే ప్రారంభం అయ్యింది.ఇంకా పూర్తిగా పచ్చదనం సంతరించుకోనప్పటికీ ఒక చిన్న కొండ పక్కన ఇంచుమించు 5 ఎకరాలకు పైబడిన ప్రాంగణంలో నిర్మించిన ఆశ్రమం కాబట్టి సహజంగానే చాలామందిని ఆకర్షించింది.ఒకరోజు ముందు చాలా హడావుడిగా ప్రారంభోత్సవ హడావుడిలో  ఉన్న మా మావయ్య ను యాడ్ ఇవ్వమని ఇద్దరు పత్రికల వాళ్ళు వచ్చి అడిగారు.ఒక మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాన్ని వాళ్ళే వచ్చి హైలైట్ చెయ్యాల్సింది పోయి  యాడ్ అడిగినందుకు మా మావయ్యకు చిర్రెత్తుకొచ్చి వాళ్ళ మీద కొద్దిగా సీరియస్ అయ్యాడు.వాళ్ళు కొంచెం కోపంగానే వెళ్ళి పొయ్యారు.

ఒక ముఖ్యమైన వివాహానికి కూడా  ఆ సమయంలోనే వెళ్ళవలసి ఉన్నందున  ప్రారంభోత్సవ  కార్యక్రమానికి ఎవరెవరిని మా మావయ్య పిలిచాడో కూడా అడగలేదు. పెళ్ళి నుండి తిరిగి వచ్చేటప్పటికి ప్రారంభోత్సవానికి  ఒక గంట ముందు మాత్రమే ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెట్ట గలిగాను.మా మావయ్య తిట్ల వర్షంలో తడిసే కంటే ఇంటికి వెళ్ళి చల్లటి నీళ్ళతో స్నానం చేయడం ఉత్తమంగా ఉంటుందని స్నానం చేసి వచ్చానో లేదో సభ ప్రారంభమై పోయింది. ముందు రాజకీయ నాయకులు వచ్చి కొన్ని ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళిపొయ్యారు. వేదిక మీదకు అతిధులను పిలవడం ప్రారంబించారు. సహజంగానే ప్రకృతి వైద్యాన్ని ఉద్యమ స్థాయికి తీసుకు వెళ్ళిన డాక్టర్ మంతెన సత్యనారాయణ గారిని పిలిచిన తరువాత ఆ పేరు విన్నాను. "శ్రీ  లవణం గారు" .....గాంధేయవాదానికి మారు పేరు. 84 సంవత్సరాల వౄద్దుడు కాని వృద్దుడు.ఆలోచనలలో పదును తగ్గని ఆ మహా మనిషిని వృద్దుడని ఎలా అనగలుగుగుతాము. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు కాదు. ఆయన ఏ పదవులూ ఆశించడు.సంపాదన అక్కర లేదు. కుటుంబం అంటూ లేదు. ఎవరైనా ఏదైనా  సభకు పిలిచి నప్పుడు టికెట్   కొని పంపిస్తారు. ఒక చిన్న సంచిలో ఒక జత బట్టలు కుక్కుకుని వచ్చేస్తారు.నిజమైన గాంధేయవాది కాబట్టి ఉన్న వాస్తవాన్ని నిర్భయంగా చెప్పగలిగారు.యీ రోజున ఒక్క భారతదేశమే  కాదు.....మొత్తం ప్రపంచంలోని అన్ని సమాజాలలోని దుస్థితికి మూల కారణం అమెరికా విస్తరణ కాంక్ష తప్ప మరేమీ కాదని ఆయన వివరించిన తీరు నిరుపమానం.శరీరంలోని ఒక రుగ్మతకు వాడిన ఆలోపతి మందు మరికొన్ని రుగ్మతలను ఎలా సృష్టిస్తుందో అదేవిధంగా ఏదో ఒక సహాయరూపంలో  అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థల్లోకి అమెరికా చొచ్చుకుని వచ్చి వాటిని ఎలా భ్రష్టు పట్టిస్తుందో చక్కగా కూర్చుని మరీ  వివరించారు.ఒక విధంగా అసలైన పోరాటం ఎక్కడ ప్రారంభించాలో.....చక్కగా సూచించారు.గాంధేయవాదం శరీర రుగ్మతలకు ...సామాజిక రుగ్మతలకు...దేశాల  రుగ్మతలకు కూడా ఎలా పరిష్కారం చూపిస్తుందో విపులంగా చెప్పడం కాదు...హాజరైన వారందరికీ కొత్త కోణంలో అలోచించడం నేర్పారు.అందరినీ ఆ ఉపన్యాసం ఆకట్టు కొన్నదనడంలో సందేహం ఏమాత్రం అనవసరం.ఆ వేదికను ఆయనతో పాటు పంచుకొన్న నాకు ఇదొక జీవితంలో  మరుపు రాని అనుభవం కూడా. మా అందరికీ అంత మంచి అనుభూతులు మిగిల్చిన ఆ ఉపన్యాసం అక్కడ హాజరైన పత్రికల వారిని ఏ మాత్రం ఆకర్షించలేక పోయింది. 

 ఆ మరునాడు అంటే దసరా తరువాతి రోజు కాబట్టి న్యూస్ పేపర్ రాలేదు.ఆ తరువాత రోజు పేపర్లో లోకల్ ఎడిషన్  లో లోపల పేజీలలో ఎక్కడో దీనిని గురించి చిన్న వార్త చోటు చేసుకుంది.అది కూడా లవణం గారి ఉపన్యాస విశేషాలు  లేకుండానే. మా అదృష్టం కొద్దీ రాజకీయ నాయకుల ద్వారా  కాస్త ప్రారంభోత్సవ కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి కాబట్టి ఆ మాత్రం చోటు దొరికిందేమో.అవకాశవాద  రాజకీయాలకు పాల్పడుతున్న నాయకుల స్టేట్మెంట్స్ తో పేపర్ నిండాలి గాని ఇలాంటి పోజిటివ్ వార్తలు చదివి జనం బాగుపడి పోతారన్న భయం పేపర్ల వారికి కాస్త ఎక్కువ గానే ఉన్నట్లుంది.

ఇంచుమించు ఏ పేపరైనా తిరగెయ్యండి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకొన్నవీ...హత్యలూ..ఆత్మ హత్యలూ...ప్రేమికుల అఘాయిత్యాలూ...యాసిడ్ దాడులూ...మొత్తానికి పేపర్ చదివే వాడికి లోకమంతా కుట్రలు..కుతంత్రాలు...మోసంతో  మాత్రమే ఉందనే అలోచన ఖచ్చితంగా కలుగుతుంది. ప్రజలకు రాను రాను వ్యవస్థ మీద నమ్మకం పొతోంది.వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు వ్యక్తికి సమాజం  మీద నమ్మకం పోయి మానసికంగా యేకాకి అవుతాడు.అంటే తన చుట్టూ ఉన్న వారి నుండి దూరం జరిగి పోతాడు.అసలే సెల్ ఫోన్ సంస్కృతి పెరిగినప్పటి నుండీ మనిషి తన పరిసరాలకు దూరంగా జరిగి పోతుంటే దానికి తోడు ఈ అపనమ్మకపు వాతావరణం.సమకాలీన సమాజంలో ప్రజల కోసం, సమాజం కోసం అలోచించే వాళ్ళు,నిజాయితీ పరులు,నిస్వార్ధ పరులు ఇంకా చాలా మంది ఉన్నారనే ఋజువులు  చూపించే ఇటువంటి సంఘటనలను హైలైట్ చేయడం పత్రికల వారి కర్తవ్యం కాదా...ఏమో నాకు తెలియదు.పత్రికల వారికి కర్తవ్య బోధ చేసేటంత అనుభవం గాని జ్ణానం గానీ నాకు లేవనే నా నమ్మకం.కానీ ఒక ఇంజనీర్ గా కొన్ని విషయాలు తెలుసు కాబట్టి వాటిని చాలా వరకూ సమాజానికీ శరీరానికీ అన్వయించవచ్చని మాత్రం అనుభవ పూర్వకంగా తెలుసు. థెర్మో డైనమిక్స్ బాగా అర్ధం చేసుకున్న వాళ్ళకు జీర్ణ ప్రక్రియ గురించి అవగాహన ఉంటుంది. ఒక నిర్మాణాన్ని డిజైన్  చేసినప్పుడు దాని మీద పని చేసే భారాన్ని ,బలాన్ని లెక్కలు కడతారు.అనేక కాంబినేషన్స్ ఉంటాయి కానీ నిర్దేసించవలసిన లోడ్ క్రింద ఒక్క దాన్నే పరిగణిస్తారు.కానీ ఇప్పుడు సమజానికి అటువంటిదేమీ లేకుండా ఉండడానికి ఒక కారణం మాత్రం ఖచ్చితంగా పత్రికలే.ఒక చెడు గురించి చెప్పేటప్పుడు దాని విరుగుడుగా జరుగుతున్న....లేదా జరిగిన మంచిని గురించి చెప్పవలసిన బాధ్యతైతే ఖచ్చితంగా పత్రికలకుంది. ప్రజా ప్రతినిధులు చేస్తున్న స్కాం ల గురించి రాసేటప్పుడు అవేవో యాదృచ్చికంగా జరిగేవి గా చిత్రించి చేతులు దులుపుకుంటున్నారు.ఇదంతా ఒక వ్యవస్థలో లోపంగా ఎవరన్నా చూపిస్తున్నారా....
కటువుగా కనబడినప్పటికీ కొన్ని నిజాలను స్పష్టంగా ప్రజలముందు ఉంచడంలో పత్రికలు ఫెయిల్ అయ్యాయి కాబట్టే అమాయక ప్రజలు ఎంగిలి మెతుకులకు ఆశపడి వాళ్ళకున్న ఓటు హక్కును దుర్వినియోగ పరుస్తున్నారన్నది వాస్తవం కాదా?సంపద అనేది గాలి లోనుండి పుట్టదనీ....అది శ్రమ వల్లే పుడుతుందనీ....మనకుండే అదాయాల్లో అధికభాగం రాయితీలు,సబ్సిడీలకు ఖర్చు చేసేస్తే కొద్ది కాలం లోనే అభివృద్ది అనేది కుంటుబడుతుందనీ ...మన ఆర్ధిక వ్యవస్థ మీద ఇది నెగెటివ్  గా పని చేస్తుందనీ ఎన్ని పత్రికలు హెచ్చరించాయో నాకు తెలియదు నిజంగా చాలా తక్కువ పత్రికలే ఆ పని చేసి ఉంటాయని అనుకుంటున్నాను. ఒక దివంగత నాయకుడి హయాంలో జరిగిన స్కాం ల గురించి పేజీల పేజీలు రాయడం కంటే అతడు అవలంబించిన  విధానాల లోని డొల్లతనాన్ని ఈనాటికీ వివరంగా విశ్లేషించడం  లేదు. తామర తుంపరగా వెలిసిన ఇంజనీరింగ్ కాలేజ్ లు నిజంగానే తెలివైన విద్యార్ధులకు ఉద్యోగావకాశాన్ని  సృష్టించాయా...? పారిశ్రామికాభివృద్దికి....పెరిగిన ఉద్యోగవకాశాలకు....పెరిగిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్న నిష్పత్తి ఏమిటో తెలుసుకుంటే అభివృద్ది కార్యక్రమాలకు ఉపయోగపడాల్సిన ప్రజాధనం ఎవరికి ఉపయోగపడిందో సులభంగా అర్ధం అవుతుంది.ఈ గణాంకాలన్నీ ప్రచురించి ప్రజల్లో చర్చకు ఎందుకు పెట్టరు?.కనీసం పాద యాత్రలు చేసి వాగ్దానాలు గుప్పిస్తున్న నాయకులకు కొంత శ్రమ తగ్గించిన వారయ్యే వారు కదా.కరెక్ట్ గా చెప్పాలంటే అన్ని అవయవాలు సరిగా ఉన్న వ్యక్తికి బిక్షాటన నేర్పడం మంచిది కాదని అందరికీ తెలుసు.కానీ ఈ రోజు జరుగుతున్నది అదే ఐనా ఎవరూ చెప్పరు...ఎవరూ వ్యతిరేకించరు....యే రాజకీయ పార్టీ కూడా ఇది మంచి విధానం కాదని చెప్పదు. కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈయవలసిన సబ్సిడీలన్నీ పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు ఇస్తుంటే నిజంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఇవ్వడానికి  ఏమీ ఉండదేమో. నిజంగా ఇప్పుడు 2 రూపాయలకు కిలో బియ్యం ఈయవలసినంత పరిస్థితుల్లో  ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్ని ప్రాంతాలున్నాయో ఒక్క సారి గణాంకాలు తీస్తే బాగుంటుంది.నిజంగా అంత బీదరికంలో రాష్ట్రం ఉంటే  వైన్ షాప్ ల వేలం ఆ రేంజ్ లో ఉంటాయా...ఇవన్నీ వాస్తవాలైనప్పుడు ఎందుకు పేపర్లలో వీటి మీద విస్లేషణ ఉండదు.మొన్న ట్రైన్ లో వెళుతుంటే మా దగ్గరే కూర్చున్న ఒకాయన తనకు తెలిసిన ఒక మిత్రుడికి సంబందించిన  యదార్ధాన్ని వివరించాడు.అనేకానేక అయోగ్య తెల్ల కార్డ్ ల లాగే అతగాడికీ కార్డ్ ఉన్నది.అతడు వైద్యం కోసం వెళ్తే అవీ ఇవీ టెస్టులు చేసి మొత్తం  మీద 70000 రూపాయల బిల్లుల మీద అందుబాటులో ఉన్న అరోగ్య పధకం క్రింద సంతకాలు తీసుకున్నారు.ఆయన ఆ కార్డ్ వాడక పోతే అదే టెస్ట్ లకు 20000 మాత్రమే అవుతాయన్న సంగతి ఆయనకు తెలుసు..ఆయన ఆ మాత్రం తాహతు ఉన్న వాడే కానీ 50000 ప్రజా ధనం వృధా కావడానికి ఆయన ఏమాత్రం బాధ పడలేదు.మహా ఐతె ఆయన ఇంటికి వెళ్తూ దారిలో ఉన్న గుడిలో ఒక కొబ్బరి కాయ కొట్టి కాస్త దక్షిన వేసి ఇంటికి వెళ్ళి పోతాడు.

నగరం మధ్యలో రద్దీ పెరిగిన చోట కొన్ని మందిరాలను పక్కకు జరప వలసి రావచ్చు. అది జరుగుతున్నది ప్రజోపకారార్ధమే కాబట్టి దాని గురించి ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదు. కానీ ప్రతి ప్రాంతం లోనూ కొంతమంది మూర్ఖులో...పని లేని వాళ్ళో సహజంగా ఉంటారు కాబట్టి అక్కడొక శిబిరం తయారౌతుంది.దీనినే వార్త క్రింద రాసేటప్పుడు నిజాయితీగా ఉన్న ఏ పేపర్ వాళ్ళైనా  మందిరం రోడ్ మధ్యలో ఉండడం వలన ఎక్కువ ఉపయోగమో....లేక పక్కకు జరపడం వలన ఎక్కువ ఉపయోగమో కాస్త విశ్లేషణతో  రాస్తారు.కానీ అలా రాయరుగా....

నేనే రాసిన ఇంతకు ముందు పోస్ట్ ఒక్కసారి చూడండి.ఎక్కువగా కానప్పటికీ కొంతైనా వాస్తవిక దృక్పధం కనబర్చిన "పిల్ల జమీందార్" అనే సినిమాకు ఒక్క అవార్డ్ రాలేదు.నంది అవార్డులు ఏవేవో సినిమాలకు దక్కాయి. కానీ ఈ విషయం గురించి ఏ పత్రికలూ నామ మాత్రంగా కూడా రాసినట్టు అనిపించలేదు.( ఒకవేళ ఎవరైనా రాసినట్లైతే నా అజ్ణానాన్ని మన్నించమని వేడుకుంటున్నాను.) ఇది ఏదో యాదృచ్చిక ఉపేక్ష కాదు.విలువల కన్నా కూడా వ్యాపార సూత్రాలే మిన్న అని సమాజంలో బలమైన భావనలు నెలకొల్పవలసిన  అవసరం  పాలక వర్గాలకు చాలా అవసరం.రాజకీయనాయకులు...ఒక్కరే పాలక వర్గాలు కాదు...ప్రజలను వాస్తవాలు మరిచేలా....అసలు వాస్తవాలన్నవి ఇవేనని నమ్మించేందుకు కృషి చేసే సినిమా ప్రపంచం లోని ప్రముఖ వర్గాలు..మీడియాలు.....ఇదంతా పాలక వర్గాల లోనికే వస్తుందని ప్రజలు తెలుసుకోడానికి ఎక్కువగా సమయం పట్టదు.నిమ్మగడ్డ వారికి...ప్రముఖ నటులకు...మీడియా బంధం.అదే నిమ్మగడ్డ వారికి వేరే నాయకుడికి విడదీయలేని వ్యాపార బంధం(కొద్ది రోజుల లోనే.... సీ.బీ.ఐ. వెలికి తీస్తుని ఆశిద్దాం). జాగ్రత్తగా అలోచిస్తే ఇదంతా ఒక బలమైన దుర్భేద్యమైన  పొర అని సుళువుగా అర్ధం అవుతుంది.వీళ్ళలో వీళ్ళు తమ స్వంత ప్రయోజనాలుగా విడిపోయి పెట్టే ముఠాలే రాజకీయ పార్టీలుగా చలామణి అవుతున్న వాస్తవాన్ని నిర్భయంగా ఏ పేపర్ వారైనా చెప్పగలుగుతున్నారా....

ప్రజలు వార్తలు చదవాలి....కాబట్టి వార్తలు హాట్ హాట్ గా ఉండాలి అంత వరకే ..అంతే గాని చైతన్యవంతులు కాకూడదు.విధానాలు...సిద్దాంతాల గురించి అలోచించ కూడదు..చర్చించకూడదు.వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడాలి ఎందుకంటే చాలా త్వరగా మరిచి పోయి వేరే హాట్ న్యూస్ కోసం ఎదురు చూసేలా చేయొచ్చు. నేను పేపర్లో చూసిన మొదటి స్కాం ఐన ఇందిరా ప్రతిభా ప్రతిష్టాన్ నుండి...బొగ్గు కుంభ కోణం వరకూ ఒక్క సారి లిస్ట్ రాసి దాంట్లో పాత్ర ఉందని స్వయంగా పత్రికల వారే వెళ్ళడించిన రాజకీయ నాయకులలో ఎంత మందికి శిక్షలు  పడ్డాయో వెళ్ళడించమనండి.వార్త అనేది ఒక సరుకు. అది హాట్ హాట్ గా ఉన్నప్పుడే దానికి మారకపు విలువ ఉంటుంది.ఈ సంగతి పత్రికాధిపతులందరికీ తెలుసు.పత్రికలు బాగా నడవాలంటే హాట్ హాట్ వార్తలు మాత్రమే ఉండాలి.దాని వలన వారి ఇతర వ్యాపార సంబందాలకు విఘాతం కూడా కలగదు.పాపం ఆ వార్తలు చదువుతూ రైళ్ళ లోనూ....పల్లెటూళ్ళలో అరుగుల మీద ...మొదలైన చోట కూర్చుని గంటల తరబడి వాదించుకొనే మన లాంటి వెర్రి వెంగళప్పలం...మనకు మనమే చెప్పుతో......
ఈ క్రింది మెయిల్  నాకు కొంత కాలం క్రితం వచ్చింది...మన మీడియా వారి నిజాయితీకి దర్పణం పట్టేది......




Indian media ...a blot on the Society
A MUST READ........

Dear Editors of HT, TOI, IndianExpress and TheHindu,NDTV, CNN-IBN, I got the mail below from a friend of mine and following the unwritten code of conduct, I am forwarding it to my friends but all efforts of people who have been forwarding this mail would go waste if this mail doesn't reach YOU.......

Something to think about..!!

Shame on Indian Media??? Really what a shame...


By the time u guys read this news, the body of Major Manish Pitambare, who was shot dead at Anantnag, would have been cremated with full military honors.


On Tuesday, this news swept across all the news channels 'Sanjay Dutt relieved by court'. 'Sirf Munna not a bhai' '13 saal ka vanvaas khatam' 'although found guilty for possession of armory, Sanjay can breath sigh of relief as all the TADA charges against him are withdrawn' Then many personalities like Salman Khan said 'He is a good person. We knew he will come out clean'. Mr Big B said "Dutt's family and our family have relations for years he's a good kid. He is like elder brother to Abhishek". His sister Priya Dutt said "we can sleep well tonight. It's a great relief"

In other news, Parliament was mad at Indian team for performing bad; Greg Chappell said something; Shah Rukh Khan replaces Amitabh in KBC and other such stuff. But most of the emphasis was given on Sanjay Dutt's "phoenix like" comeback from the ashes of terrorist Charges.


Surfing through the channels, one news on BBC startled me. It read "Hisbul Mujahidin's most wanted terrorist 'Sohel Faisal' killed in A nantnag , India .. Indian Major leading the operation lost his life in the process. Four others are injured.


It was past
midnight , I started visiting the stupid Indian channels, but Sanjay Dutt was still ruling. They were telling how Sanjay pleaded to the court saying 'I'm the sole bread earner for my family', 'I have a daughter who is studying in US' and so on. Then they showed how Sanjay was not wearing his lucky blue shirt while he was hearing the verdict and also how he went to every temple and prayed for the last few months. A suspect in Mumbai bomb blasts, convicted under armory act...was being transformed into a hero.

Sure Sanjay Dutt has a daughter; Sure he did not do any terrorist activity. Possessing an AK47 is considered too elementary in terrorist community and also one who possesses an AK47 has a right to possess a pistol so that again is not such a big crime; Sure Sanjay Dutt went to all the temples;
Sure he did a lot of Gandhigiri but then.......... ..


Major Manish H Pitambare got the information from his sources about the terrorists' whereabouts. Wasting no time he attacked the camp, killed Hisbul Mujahidin's supremo and in the process lost his life to the bullets fired from an AK47. He is survived by a wife and daughter (just like Sanjay Dutt) who's only 18 months old.


Major Manish never said 'I have a daughter' before he took the decision to attack the terrorists in the darkest of nights. He never thought about having a family and he being the bread earner.


No news channel covered this since they were too busy hyping a former drug addict, a suspect who's linked to bomb blasts which killed hundreds. Their aim was to show how he defied the TADA charges and they were so successful that his conviction in possession of armory had no meaning. They also concluded that his parents in heaven must be happy and proud of him.


Parents of Major Manish are still living and they have to live rest of their lives without their beloved son. His daughter won't ever see her daddy again.


So guys, please forward this message around so that the media knows which news to give importance, as it is a shame for us since this Army Major's death news was given by a foreign TV channel!!!


If you believe in it, don't feel shy in forwarding it..
Probably if Rakhi Sawant would have talked about Major, the medias will notice.....shame on Indians!
--


5, నవంబర్ 2012, సోమవారం

నవయుగ వైతాళికునితో....కొంత సేపు

చాలా సీరియస్ గా లేప్ టాప్  మీద వర్క్ చేసుకుంటున్నాను. డోర్ మీద ఎవరో తట్టిన శబ్దం వినబడింది.విసుగుతో వెళ్ళి తలుపు తెరిచాను.ఎవరో పెద్దాయన...తలకి తలపాగా ఉంది.. కింద పంచె కట్టే గాని పైన మాత్రం కోటు వేసుకుని ఉన్నాడు.ఎగా దిగా చూసాను. పనికి ఆటంకం కలిగించినందుకు కోపంగా కూడా ఉంది.
"బాబూ.....ప్రసాదంటే ..."
"ఆ నేనే...చెప్పండి.." విసుక్కుంటూనే అన్నాను.
"కొంచెం లోపలకి రావచ్చా బాబూ..."
యీయనెవరో తెలియదు పైగా లోపలకి రావచ్చా అని అడుగుతున్నాడు.
విసుపుగా చూస్తూ గుమ్మానికి అడ్డం తొలిగాను.ఈయన ఎవరో బోధపడ్డం లేదు.మా శ్రీమతి  తరపు దూరపు బంధువేమో..
లోపలికి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు.
"దాహంగా ఉంది ..కొంచెం మంచి తీర్ధం ఇప్పించు బాబూ.."
ఆ పెద్దాయన అలా అడిగే సరికి కాస్త మానవత్వం పైకి వచ్చింది. కొంచెం సిగ్గు పడ్డాను కూడా..
"నన్నెప్పుడూ చూడలేదా బాబూ..."
మంచినీళ్ళు తాగిన తరువాత ఆయన తాపీగా అడిగాడు.
"లేదండీ ...తను కూడా ఇప్పుడే బయటకు వెళ్ళింది..."
ఖచ్చితంగా ఈయన మా శ్రీమతి  వైపు బంధువే అనే నిశ్చయంతో అన్నాను.
"అయ్యో ఆమెకు నేనెవరో   తెలియదు బాబూ..."
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ఈయన ఎవరో నేనెలా గుర్తుకు తెచ్చు కోవాలి....
ఎందుకైనా మంచిదన్నట్లు ఆయన ముఖంలోకి చూసాను.   ....బొద్దు మీసాలు.....విజ్ఞానంతో..జిజ్ఞాస  తో కూడుకున్న ముఖం....
అలా చూస్తూ ఉండిపొయ్యాను.నిజమేనా....ఈయన ఎలా....
మనసు ఆనందంతో పరవశమవుతోంది...కళ్ళలో నుండి నీళ్ళు వాటికవే వచ్చేస్తున్నాయ్...
అప్పుడు ఆయన పెదాల మీద ముసి ముసి నవ్వులు చూసాను.
"నీ వూహ కరెక్టే... నేను  అప్పా రావునే...."
నవయుగ వైతాళికుడు....తెలుగు సాహిత్య సీమను నలుదెసలా వ్యాపింప చేసిన వాడు....  ప్రపంచం లోని ఉత్తమ 10 నాటకాల ఒకటైన " కన్యా శుల్కాన్ని" రచించిన మహనీయుడు ..నా కళ్ళెదురుగా కనబడేసరికి మనసంతా ఉక్కిరి బిక్కిరి అయిపొతోంది .ఆతిధ్యం ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియడం లేదు.ఇరుగు పొరుగు వాళ్ళతో కలసి  బట్టల దుకాణానికి చెక్కేసిన శ్రీమతి  మీద చచ్చేటంత కోపం వచ్చింది.
" కాఫీ గాని టీ గాని.." ఏమని సంబోదించాలో కూడా తెలియడం లేదు.
"అవేమీ వద్దు బాబూ....కాస్తంత మజ్జిగ ఉంటే చాలు..."
నాలుగు పచ్చి మిర్చి కోసి ,అల్లాన్ని సన్నగా తరిగి..కరివేపాకు కూదా ముక్కలుగా చేసి మొత్తాన్ని బాగా గిలకొట్టి ఆయనకు అందించాను. 
"చాలా సంతోషం నాయనా...."
తాగిన గ్లాసు అందుకొన్నాను
"ఇప్పుడు నేను వచ్చిన పని గురించి మాట్లాడదామా "
నేను దేనినైతే కదుపుదామనుకున్నానో దానిని ఆయనే కదిపే సరికి సంతోషం వేసింది.
"ఇంతకూ ఈ పెట్టెతో ఏం చేస్తున్నావోయ్..."నా లాప్ టాప్   ను చూపిస్తూ అడిగారాయన.
గతుక్కుమన్నాను...నేను రాస్తున్న యీ పోస్ట్ యీయన చదివేస్తారేమిటో ఏమిటో....
"ఫరవాలేదు ..కాస్త చూడనీయ్ నాయనా.."చనువుగా నా లాప్ టాప్  ను చేతుల్లోకి తీసుకున్నారు
కొంత సేపు అలా చదువుతూ కూర్చున్నారు...ఆ మీసాల వెనుక అప్పుడప్పుడు మెరిసిన నవ్వు చూస్తుంటే నేను నోబుల్ ప్రైజ్ అందుకోడానికి వెళ్తున్న భావన కలిగింది.
"బాగానే రాస్తున్నావ్..." నవ్వుతూ నా లాప్ టాప్  నా చేతులో పెట్టారు.
అసలు యీయన  ఇలా సడన్ గా కనబడి ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు.రాచమల్లు రామ చంద్రారెడ్డి  గారి "సారస్వత వివేచన " చదివిన దగ్గరనుండి సవా లక్ష డౌట్లు మనసు  లో ఉండేవి...అవన్నీ ఒక్కటీ బయటకు రావడం లేదు.ఏది ఏమైనా  ఏదో ఒకటి అడగాలనుకున్నాను.
"మీరు పనిచేసింది ఒక మహారాజు గారి దగ్గర...కానీ సమాజాన్ని మార్చాలన్న ..అది కూడా సమూలంగా  అన్న మీ భావనలకు మహారాజు గారు ఎలా ప్రోత్సాహం ఇచ్చేవారో అర్దం కావడం లేదు గురువు గారూ...సాధారణంగా రాజులు   మార్పుకి వ్యతిరేకంగా ఉంటారు కదా....."
ఆయన మీసాల వెనుక మరలా చిరు నవ్వు....
"నీ అభిప్రాయం తప్పు నాయనా...మార్పు అనేది అనివార్యమని తెలివైన పాలకులందరికీ తెలుసు...కానీ బలవంతంగా ఐనా ఆ మార్పులని తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకునే వాడు మూర్ఖుడిగా మిగిలి పోతారు..వస్తున్న మార్పులకి ఆహ్వానం పలికేవాడు వాటికి అనుగుణంగా ఉంటారు.మీకున్న ఒకే ఒక్క సౌలభ్యం ఏమిటంటే మీకు కావలిసిన పాలకులని మీరే తెచ్చుకో వచ్చు"
నాకు నిజంగా నవ్వు వచ్చింది...నిజంగానే నవ్వేశాను.
"అలా నవ్వావేమిటి నాయనా..."
"గురువు గారూ...మీరు రామప్పంతులు కంటే క్రూరుడిని..నయవంచకుడిని ఊహించలేరు....కానీ ఇప్పుడు ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థని చూస్తే రామప్పంతులే చాలా ఆనంద పడిపోతాడు నా వారసులు ఇంతకు వేయింతలుగా ఆ లక్షణాలను మరింతగా విస్తృత  పరుచుకుని ఇంతలా అభివ్రుద్ది చెందిపొయ్యారని..."
"మరి మీకు వాళ్ళనే ఎన్నుకోవలసిన అవసరం లేదు కదా...."
"అంతా అలాంటి వాళ్ళే అయినప్పుడు"
"అదేమిటి నాయనా ...."
"నేను ఎక్కువ వివరాలు ఇచ్చేటంత  జ్ణానం ఉన్నవాడిని కాను గానీ  నా స్వానుభవంతో తెలుసుకుంటున్న విషయాలు కొన్ని ఉన్నాయి ..అవి మీకు చెప్పగలను. నాకు మా వూరు అంటే ఎంతో ఇష్టం. ఎవరికైనా అంతే అనుకోండి.ఇన్ని సంవత్సరాలు కష్టపడి  ఉద్యోగం చేసి ఇక మా వూరికెళ్ళి పోదామని నిర్ణయించుకోడమేమిటి అమలులో కూడా పెట్టడానికి సిద్ద పడ్డ తరువాత ....మా వూరు వెళ్ళి అక్కడున్న నా పాత స్నేహితులని సలహా అడిగాను. వాళ్ళంతా వెలిబుచ్చిన ఏకాభిప్రాయం ఏమిటంటే నాకు బుర్ర చెడిపోయిందని."
"అదేమిటి బాబూ...నీ వూరిలో నీవు స్థిరపడతానంటే నీ స్నేహితులు ఆనందించాలి కానీ ..."
"వాళ్ళకు ఆనందమే కానీ వాళ్ళనేదేమిటంటే ఏదో కాస్తో కూస్తో సుఖాన ఉన్న ప్రాణాన్ని కష్టాల లోకి ఎందుకు నెట్టుతున్నానా...అని"
" ఇరుకు ఇళ్ళు...ఇరుకు మనసులు.....పరుగులు.....ఇవి సుఖమా...."
"మీ లాగే నేనూ అనుకుటూ ఉండేవాడిని గురువు గారూ.....అసలు మా వూరి లో కాస్త వెసులు బాటు ఉన్నవాళ్ళంతా ఎప్పుడో టౌన్  కెళ్ళె పొయ్యారు. రక రకాల  కారణాల వలన ...వ్యవసాయాలు కిట్టు  బాటు కాక..పిల్లల చదువుల కోసం ......"
"అదేంటి బాబూ...మీ వూరిలో స్కూల్ లేదా...."
"చక్కటి స్కూల్ ఉంది"
"ఉపాధ్యాయులు లేరా..."
"బాగా చదువుకున్న వారే ఉన్నారు"
"పట్టణాల్లో ఉన్న స్కూళ్ళల్లో ఉపాధ్యాయులు మరింత విజ్ణానవంతులా.....?"
"ఏమీ కాదు గురువు గారూ...."
"బాగా వ్యాయామం. ....అదీ నేర్పి కుస్తీ పోటీల లాంటి వాటికి తర్ఫీదు ఇస్తారేమో..."
"అసలక్కడ ఆట స్థలాలే ఉండవు"
"విజ్ఞాన శాస్త్ర  అభివృద్ది కోసం మంచి ప్రయోగశాలలు ఉంటాయేమో మరి..."
"అబ్బా....అసలలాంటివేమీ ఉండంటున్నానా...."గురువుగారి అమాయకత్వానికి కాస్త విసుగు కూడా వచ్చింది.
"మరి యే ప్రత్యేకత లూ లేని ఆ స్కూళ్ళ కోసం పట్టణానికి వెళ్ళవలసిన ఆగత్యం ఏముంది నాయనా..."
" అక్కడ అహర్నిశలూ పాఠాలు వల్లె వేయిస్తుంటారు గురువుగారూ...."
"మా రోజుల్లో వేకువ ఝామునే లేచి కొంత మంది బ్రాహ్మణ కుర్రాళ్ళ చేత వేదాలు...మొదలైనవి వల్లె వేయిస్తుండే వారు...పగటి పూట కాదు...మరి యీ అహర్నిశలూ  వల్లె వేసే అంశాలు  ఏమిటో....?
"వాళ్ళ పాఠ్యాంశాలే   స్వామీ.....అంతకు మించి ఒక్క ముక్క కూడా అధికంగా తెలియనివ్వరు.."
" యీ కాస్త  దాని కోసం రోజంతా గదుల్లో బంధించి  చదివిస్తారా.....అమానుషం నాయనా......అసలు వీళ్ళు యీ సమయంలో పదిమందితో కలసి ఆటలాడుతూ ...వ్యాయామం లాంటివి చేయక పోతే వీళ్ళ బాల్యావస్థ మసి బారి పోయినట్లే కదా......"
"అయ్యో గురువు గారూ...మా అబ్బాయి  విషయంలో  యదార్ధంగా జరిగిన సంఘటన మీకు సెలవిస్తాను.వాడు నిత్యం కోతి చేష్టలు  చేస్తూ  పళ్ళికిలిస్తూనే ఉంటాడు. వాడుంటేనే మా బంధువులమంతా కలసినప్పుడు గోలగా ఉండేది. కానీ స్కూల్లో ఒక టీచర్ కు మాత్రం ఇది పెద్ద అభ్యంతరకరమైన విషయమై కూర్చుంది. మిగిలిన చాలా మంది విద్యార్ధులు టెన్షన్ తో ఎప్పుడూ ముఖాలు వేళ్ళాడేసుకుని ఉంటుంటే వీడి ఒక్కడికే అలా నవ్వు ఎలా సాధ్యమౌతుందో  ఆవిడకు అర్దం కాలేదు. మమ్మల్ని  స్కూల్ కు రప్పించి మరీ ఆవిడ వార్నింగ్ లాంటిది ఇచ్చింది. కాబట్టి నే చెప్పేదేమిటంటే ఇప్పుడున్న తరాలకు బాల్య యౌవన దశలు అనేవి ఉండవు...వూహ వచ్చిన తరువాత డైరక్ట్ గా కౌమార దశే...."
"చాలా బాధగా ఉంది నాయనా....సమాజాన్ని ఇంతలా భ్రష్టు పట్టించినందుకు మీ నాయకులు సిగ్గు పడడం లేదా...."
"అయ్య బాబోయ్ ..నేను చెప్పింది భ్రష్టు  పట్టి పోయిన ఒక రంగం గురించి మాత్రమే.....ఇటువంటివి మరెన్నో....మరి ఇక రాజకీయ రంగం గురించి విన్నారంటే ఇక్కడే భళ్ళున వాంతి చేసేసుకుంటారు."
"ఇంత కుళ్ళుని ఎలా భరిస్తున్నారు బాబూ...కష్టంగా లేదా.."
"మీరు నాలుగు రోజులుంటే మీకూ అలవాటై పోతుంది గురువుగారూ....ఒక్క ఉదాహరణ చెబుతాను. మా సినిమా రంగం లోకి చాలా మంది కొత్త హీరోలు వస్తుంటారు.అంటే వాళ్ళు గొప్ప నటులని కాదు. వాళ్ళ తాత తండ్రుల మూలాలు ఆ రంగం లో ఉన్నాయన్న ఒక్క అర్హత తోనే. మొదట్లో జనం "చీ ...వీడు హీరో ....ఏంటి " అని తిట్టుకుంటారు.కానీ కొద్ది రోజులు అలా చూసి చూసి అలవాటు చేసేసుకుంటారు. ఆ తరువాత వాళ్ళు నటనకు భాష్యాలు కూడా చెప్పేస్తారు."
"కొంపదీసి నా కన్యాశుల్కాన్ని  కూడా భ్రష్టు పట్టించేస్తారో ఏమిటో నాయనా..."
"డబ్బులొస్తాయని గారంటీ ఉంటే అది ఖచ్చితంగా  జరుగుతుంది.అంతే కాదు దానికి నంది అవార్డ్ రాదని గారంటీ కూడా ఏమీ లేదు."
"మరి ఇంత మంది మేధావులు....... చదువుకున్న వాళ్ళు ఏమి చేస్తుంటారు నాయనా..."
" మీకా భయం ఏమీ అక్కర లేదు...ఎప్పుడూ ఎవరి పనులలో వారు చాలా బిజీగా ఉంటారు"
"నాకు సరిగా అర్ధం కావడం లేదు బాబూ....."
"మీకు బయట పెద్ద గోల వినబడుతుందా....?"
"అవును బాబూ.....అదే ఏమిటా అని అడుగుదామనుకున్నాను"
"ప్రస్తుతం వినాయక చవితి సీజన్ నడుస్తోంది..దీని తరువాత వేరే సీజన్.....ఆ గోల అలానే ఉంటుంది...దానివలన మా అపార్ట్మెంట్ లోనే కనీసం పదిమంది విద్యార్ధులు బాధ పడుతున్నారు....తెల్లవార గట్ల చూడండి ప్రశాంతమైన  నిశ్శబ్దాన్ని  కలుషితం చేస్తూ మైకులు ఏ స్థాయిలో అరుస్తుంటాయో..బాధపడే  వాళ్ళు ఖచ్చితంగా వేలల్లోనే ఉంటారు. యీ మైకులు పెట్టి ఆనందించే వాళ్ళు పదుల సంఖ్యలోనే ఉంటారు.కానీ వాళ్ళంతా సంఘటితంగా ఉన్న వాళ్ళు. సంఘటితంగా ఉన్న కొంత మంది మొత్తం జనాన్ని కంట్రోల్ చేస్తున్నారు.మొత్తం రాజకీయ పార్టీల నాయకులంతా ఇంచుమించు ఆ కోవలోకే వస్తారు" 
"అయ్యో నాయనా....ఇటువంటి వాళ్ళు ...అనేక పార్టీలు మారి మంత్రులైన వాళ్ళు ఈ మద్య నా 150 వ జయంతుత్సవాలకు ముఖ్య అతిధులైనందుకు   నాకు చాలా బాధగా ఉంది "
"మేము వీటన్నిటికీ అతీతులమై పోయాం గురువు గారూ...ఇంచు మించు మాలో రక్త మాంసాలు...చీమూ..నెత్తురు లాంటివి హరించుకు పొయ్యాయి...మీరు ఆ తరంలో వీటిని మీ శరీరంలో పూర్తిగా నింపుకున్న వాళ్ళు కాబట్టి కాస్త బాధగానే ఉంటుంది మరి"
"ఇంకొక చిన్న విషయం ...నా జ్ఞాన హీనతకు కొద్దిగా సిగ్గుగా ఉన్నది.....అన్యధా భావించక నాకొక్క చిన్న సందేహ నివృత్తి చేయగలవా నాయనా.....?"
"నవుయుగ వైతాళికులు.....మహా సంస్కర్త....మీకు సందేహ నివృత్తి చేయగలగడం నిజంగా నా అదృష్టం సెలవీయండి..."
"ఏమీ లేదు నాయనా.....ఈ విశాఖలోని  ఒక ముఖ్య కూడలిలో నా విగ్రహాన్ని ప్రతిష్టించారు...కానీ నాకు కొంత దూరంలోని కూడళ్ళలో ఎవరో మహనీయులనుకుంటాను ..వారి విగ్రహాలు కనబడుతున్నాయి....వారెవరో నాకు తెలియదు. నా విగ్రహం వారి పక్కన ఉండదగునో లేదో తెలియదు....కాస్త వారి గురించి సెలవిస్తే తెలుసుకుని సంతోషిస్తాను నాయనా..."
"క్షమించాలి గురువుగారూ....మేము ఇక్కడికి వచ్చి కేవలం పుష్కర కాలమే కావస్తోంది .....కాబట్టి వారి గురించి నాకేమాత్రం తెలియదు....వారి గురించి ఎక్కడా చదివిన గుర్తు కూడా లేదు......ఐనా గురువు గారూ....మీదంతా చాదస్తం కానీ విగ్రహం పెట్టాలంటే మహనీయుడే కానక్కరలేదన్న విషయం మీకింకా అర్ధం కానందుకు నాకు బాధగా ఉంది."
తననుద్దేసించోమే నన్న సంశయంతో గురువుగారు నా వంక బేలగా చూసారు.వెంటనే నాకు చేసిన తప్పు అర్ధం అయ్యింది.
"మిమ్మలనుద్దేశించి కాదు. ....మీతో వీళ్ళకు పోలికా.....
"నీవు పొరబాటుగా అర్ధం చేసుకుంటున్నట్లున్నావ్ ...మహనీయులు కాని వారి విగ్రహాల్ని ఎందుకు పెడతారు నాయనా..."
"భలే వారే......బ్రతికుంటే జైల్ లో కెళ్ళవలసి వచ్చుండే నాయకుడి విగ్రహాలు కూడా సగర్వంగా ఇంచు మించు అన్ని కూడళ్ళ లోనూ నిలబెట్టబడి ఉండడం తమరు గమనించ లేదనుకుంటాను.....అంతే కాదు.....మీకు గాంధీ మహాత్ములు...పండిట్ నెహ్రూ లాంటి మహనీయుల గురించి తెలుసు కదా..."
"అదేమిటి నాయనా వారు అటూ ఇటూగా నా సమకాలికులు కదా....గొప్ప దేశ భక్తులు... .మా రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మూల స్తంభాలు వారు"
"మరి ఆ పార్టీయే తమ నాయకుడొకరు హత్య కావించబడితే ఆ మహనీయుల విగ్రహాల  సరసనే యీ నాయకుడి విగ్రహావిష్కరణ చేయించింది....."
"నేనిక భరించలేను నాయనా......వెళ్ళి వస్తాను..".గొడుగు చేతిలోకి తీసుకుని బయటకు నడిచారు.
"గురువుగారూ....ఒక్క నిముషం ...నేనింకా చాలా చెప్పాలి" అంటూ లేవ బోయాను.కానీ  కాలికి ఏదో అడ్డం తగిలింది. అయినా  బలంగా లేవబోయాను.
"ఏమిటి నాన్నా...నా కాలుని అలా గెంటేస్తున్నావ్" అన్న సుపుత్రిడి మాతతో నిద్రాభంగ మయ్యింది కానీ కనీసం నిద్రలో నన్నా ఆ మహనీయుడితో సంభాషించగలిగానన్న తృప్తి తో గాఢంగా నిద్రపొయ్యాను.

29, సెప్టెంబర్ 2012, శనివారం

కనుమరుగైన / అవుతున్న పాత్రలు

"ఏరోయ్.....ఎప్పుడు వచ్చావ్..వూర్లోకి...."
బజార్లో తిరుగుతున్న నన్ను మా  బంధువు ఒకాయన పలకరించాడు.
"రెండు రోజులయ్యింది మావయ్యా...అక్క ఎలా ఉంది?
"అంతా బాగానే ఉన్నార్రా....నేను కూడా మీ నాన్నను కలసి చాలా రోజులయ్యింది..ఎలా ఉన్నాడు?"
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.ఏమీ మాట్లాడకుండా నిలుచున్నాను.
"మీ పెద్ద మావయ్యకు అంతగా బాగుండట్లేదు...యీ మద్యేమైనా వెళ్ళాడా?"
మళ్ళీ ఆయనే అడిగాడు.నా నుండి మాత్రం మరలా మౌనమే సమాధానంగా మిగిలింది.
అప్పుడాయనకు అనుమానమొచ్చింది.
"యేరా...మీ ఇంటికి వెళ్ళదం లేదా..?"
లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాను.
"మొత్తానికి చదుకొన్నోళ్ళూ లేనివాళ్ళూ ఒకేలా ఉన్నార్రా..బాబూ.."
"నా పొరబాటు ఏమీ లేదు మామయ్యా...మా అమ్మ..."
"సరేలేరా....రెండు రోజులు పొయ్యాక అమ్మాయి..నువ్వూ..మన వూరు రండి....లీవ్ ఉంది కదా..మన వాళ్ళందరనీ ఒక సారి చూసి నట్లుంటుంది"
ఉందన్నట్లు తల వూపాను.రెండు రోజుల తరువాత శ్రీమతి  తో కలసి బయలుదేరాను.
సాయంత్రం అయ్యింది.
"పద..అలా పొగాకు బారెన్ల దాకా వెళ్దాం"
ఆయనతో బయటకు నడిచాను.
"ఇప్పుడు చెప్పు...నీ ప్రాబ్లెం"
చెప్పడానికి ఉద్యుక్తుడనయ్యాను.కానీ నాకాయన చాన్స్ ఇవ్వ లేదు.
"నీ అలోచన అంతా న్యాయం  కావచ్చు కానీ నీ చిన్నప్పటి అంటే నెలల పిల్లాడిగా ఉన్నప్పటి సంగతి చెబుతాను.మీ పెద నాన్న చేసిన గొడవ వలన మీ తాతయ్య పోగానే పొలాన్ని పంపకాలు చేసేసారు.అందరికీ తలా కాస్త పొలం..కొంత అప్పూ వచ్చాయి. మిగిలిన వాళ్ళకు అంతగా ఇబ్బందేమీ లేదు కానీ..డిగ్రీ ఆఖర్లో ఉన్న మీ నాన్నకు అదనపు ఖర్చుగా నీవు.డబ్బుకు కటటలాడి పొయ్యేవాడు.ఎవరినీ వంద రూపాయల అప్పు అడగలేని గ్రామీణ అభిమానం.అలాంటప్పుడు ఒక రోజు నీకు తీవ్రంగా జ్వరం వచ్చింది.వేళ్ళాడి పోతున్నావ్. ఇంట్లో పైసా లేదు.మీ నాన్నకు యేమీ చేయాలో పాలుపోనప్పుడు నేను మీ ఇంటికి రావడం జరిగింది.మీ నాన్న కళ్ళలో నీళ్ళు ..దైన్యం.వెంటనే నిన్ను తీసుకొని కొత్తగా ప్రాక్టీస్  పెట్టిన నా స్నేహితుడి దగ్గరకు తీసుకెళ్ళి పరిస్థితి అంతా వివరించాను.నిజం చెప్పాలంటే అప్పటికి నేను కూడా స్టూడెంట్ నే కాబట్టి నా దగ్గర కూడా డబ్బులేమీ లేవు.నా స్నేహితుడు మాత్రం " అయ్యో డబ్బ్లున్నప్పుడే తీసుకొచ్చి ఇవ్వండి" అని మందులు కూడా ఇచ్చాడు.కాబట్టి పెద్ద వయసులో అందులోనూ ఒక కొత్త కుటుంబంతో నీ అనుబంధం పెరుగుతున్నప్పుడు వీళ్ళకు కాస్తంత ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ రావచ్చు...ఎంతైనా ఒక్కడివే కదా...."
ఆ తరువాత ఏమైందన్నది ఇక్కడ అప్రస్తుతం.
ఆ తరువాత మా తలిదండ్రులు యేదైనా విషయం లో కాస్త అన్యాయంగా మాట్లాడినా...ప్రవర్తించినా దానిని న్యాయాన్యాయాల దృక్కోణంతో చూడడం మానుకున్నాను.
ఆఫీస్ లో పై వాడు అన్యాయంగా మాట్లాడతాడు ..ఎదిరించగలుగుతున్నామా....పిల్లలకు పరీక్షలవుతుంటాయి..పక్కనున్న గుళ్ళోనో..మసీదులోనో..చర్చ్ లోనో లౌడ్ స్పీకర్ లు మ్రోగుతుంటాయి ఐనా మాట్లాడలేము. తలిదండ్రుల విషయంలో మాత్రం మనం ఆ సమ్యమనాన్ని ఎందుకు పాటించం...లోకువ కాబట్టి..

ఇటువంటిదే ఇంకొక సంఘటన గురించి చెబుతాను . మా అత్తవారిల్లు మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఇలా అనడం కంటే మా ఎదురింట్లో ఉన్న అమ్మాయినే నేను చేసుకున్నాననడం బాగుంటుంది.మా మావ గారు వరసకు నా మేనమామే. వాళ్ళది చాలా కాలం ఒక పెద్ద ఉమ్మడి కుటుంబం.దానికి అధినేతగా మా శ్రీమతి  నానమ్మే ఉండేది. ఆవిడకు మనుమలంటే వల్లమాలిన అభిమానం.వాళ్ళ మీద ఈగ వాలనిచ్చేది కాదు.అంత వరకూ ఐతే ఫరవాలేదు కానీ కాలేజ్ లో చదువుతున్న నాతో తన మనమరాళ్ళను అస్సలు మాట్లాడనిచ్చేది కాదు.మొదట్లో నేను పట్టించుకోకపోయినా తరువాత తరువాత నాలో హీరో కావాలనుకునే నా సంకల్పానికి  యీవిడ చాలా ప్రతిబంధకంగా మారడం నేనస్సలు సహించలేకపోయాను.ఇంటికెదురుగా ఉన్న ఇద్దరు మరదళ్ళు తన వెనక బడక  పోవడాన్ని అంధ్ర లో ఉన్న ఏ బావ కూడా క్షమించడు కాబట్టి నేను కూడా క్షమించ లేదు.యీ ప్రతిబంధకాన్ని ఎలా వదిలించుకోవాలో అలోచించిన నాకు మా పెద్ద బావ మరిది ఆపద్భందవుడిలా కనిపించాడు.అప్పట్లో వాళ్ళకు రెండు ఇళ్ళు ఉండేవి.ఒకటి మా ఇంటికి ఎదురుగా ఉండే ఇల్లు..మరొకటి పక్క వీధిలో ఉండేది...పైగా అది చాలా పెద్దది.మా ఇంటికెదురుగా ఇద్దరు మామయ్యలు ఉంటే పక్క వీధిలో ఉండే ఇంట్లో ఇంకొక మామయ్య ఉండేవాడు.కాబట్టి ఒక శుభోదయాన  వాడికి జ్ఞాన బోధ చేసాను.
" మీరందరూ..చదువుకుంటున్నారు...అక్కడ ఇల్లు ఖాళీ యే కాబట్టి మీ మామ్మను అక్కడ ఉండమనొచ్చు కదా..మీకు కొంత గోల తగ్గుతుంది .."
కొంచెం ఎక్కువగా మాట్లాడే ఆవిడ అలవాటుని నేను ఆ విధంగా కాష్ చేసుకున్నాను.నేను అన్నదే తడవుగా మా బావ మరిది వాళ్ళ నానమ్మ మీద విరుచుకు పడి పోయి ఆవిడ ఆ ఇంటికి మారిపొయ్యేలా చేసాడు.

పాపం ఆవిడ దారిన వెళ్తున్న ప్రతి వాళ్ళతోనూ వీడిని చిన్నప్పటి నుండీ ఎంత గారాబంతో పెంచిందో ఆఖరుకి ఆవిడను ఎలా పంపించాడో చెప్పి తెగ బాధపడిపోతూ ఉండేది.ఒక విధంగా అప్పట్లో అర్ధం కాలేదు కానీ ఇప్పుడు తలచుకుంటుంటే మాత్రం కొంచెం బాధ గానే ఉంటుంది.కాక పోతే తరువాత నేను ఆవిడ మనమరాలినే వివాహం చేసుకున్న తరువాత ఇవన్నీ ఆవిడ మర్చి పోయింది. మా అమ్మాయి చంటి పిల్ల గా ఉన్నప్పుడే ఎత్తుకుని ముద్దులాడుతూ
" ఇది బాబు కంటే నాలుగాకులు ఎక్కువే చదువుద్ది " అని అంటూ మురిసిపోయేది.

సెల్ ఫోన్ ల సంస్కృతి పెరిగిన తరువాత విజయా వారి సినిమాలు రిలీజ్   కు నోచుకోనట్లే యీ పాత్రలేవీ మునుముందు కనిపించవన్న బాధ ఆనాడు తెలియ లేదు తెలిసిన ఇప్పుడు పైనుంచి కురుస్తున్న కుళ్ళుని ఎలా అపాలో తెలియడం లేదు.

4, సెప్టెంబర్ 2012, మంగళవారం

సుపుత్రుడికి సున్నితమైన జ్ఞాన బోధ..మీరు కూడా చెయ్యాలని మనవి ..

  "వస్తాం సార్" కాంట్రాక్టర్లు వెళ్ళడానికి లేచి నిలబడ్డారు.
"మరి మా బిల్...." మరలా వాళ్ళే నసిగారు
" రేపు తప్పకుండా చూస్తానండీ... సండే కాబట్టి యీ రోజు మా అబ్బాయి సినిమా కు తీసుకెళ్ళమని తినేస్తున్నాడు " మర్యాదగా చెప్పాను.
"మాకు చెప్పరేమిటి సార్..టికెట్స్ తెప్పెంచేద్దుం కదండీ ..."
"అయ్యో ..ఫరవాలేదండీ ...రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యింది ..కాబట్టి ఇబ్బందేమీ  ఉండదులెండి"

మొత్తానికి వాళ్ళను వదిలించుకొని సినిమాకి రెడీ అవడం మొదలు పెట్టాను.
"నాన్నా ....వాళ్ళు సినిమా టికెట్స్ పంపిస్తానన్నప్పుడు ఔననొచ్చు కదా...."
మా వాడికి కూడా యీ మధ్య కొద్దిగా తెలివి తేటలు పెరిగి పోతున్నాయి
"ఒరేయ్...ఒక వేళ బిల్ చేయడం కాస్త లేట్ అయ్యిందనుకో ..లో లోపల బండ బూతులు తిట్టుకుంటారు తెలుసా..."
ఆ...లో లోపలే కదా ఫరవాలేదులే నాన్నా...."
మా వాడు బాగా ముదిరి పోతున్నదనిపిస్తోంది.
" నేను పెద్ద వాడైన తరువాత సివిల్ ఇంజనీర్ నే అవుతాన్నాన్నా..."
అంటే వీడు కూడా అసలైన వారసుడు గా తయారయ్యే ఉద్దేశం పెంచుకుంటున్నాడన్న మాట..అమ్మో వీడికి అర్జెంట్ గా జ్ఞానోపదేశం చేయడం నా ప్రధమ కర్తవ్యంగా తోచింది.నాకు వచ్చిన సున్నితమైన భాష లోనే వాడికి కర్తవ్య బోధ మొదలు పెట్టాను.
" ఒరేయ్ ..పనికి మాలిన వెధవా..నీకు దేంట్లో ఆసక్తి ఉంటే దాంట్లో పరిజ్ఞానం  పెంచుకోవాలి తప్ప నన్ను బట్టి కాదు.సొంత తెలివి తేటలు లేని వాళ్ళు..వేరే వేరే విషయాల మీద యే మాత్రం అవగాహన ..ఆసక్తి  లేని వాళ్ళే నాన్నలను ఇమిటేట్ చేస్తారు.

ఐనా గాని ఒరేయ్ సన్నాసీ...నాకేదో కాస్త  ప్రభుత్వోద్యోగం దాని వలన సంక్రమించిన అధికారం ఏడ్చాయి కాబట్టి  నాతో అవసరం ఉన్న వాళ్ళు నన్ను కాస్త గౌరవించడం చూసిన వెంటనే నీకు వెధవ బుద్దులు..అంటే వాళ్ళను ఎలా ఉపయోగించోసుకోవచ్చో నన్న ఊహలు మనసులో పుట్టుకొచ్చేస్తున్నాయ్... అమ్మ ..నా కొడకా...నీతో ముందు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలొరే...

ఇంజనీర్ అవ్వాలంటే కొన్ని విషయాల్లో ..ముఖ్యంగా..మేథమేటిక్స్ ...సైన్సెస్ లో మంచి పరిజ్ఞానం వగైరా ఉండాలి...అవన్నీ ఉన్నాయో లేదో చూసుకొని కదా...నీవు ఇంజనీర్ అవ్వాలని కలలు కనాలి. ఉదాహరణకు నీవు రాజకీయ నాయకుడివి కావాలనుకుంటే కనీసంగా సమాజం.... దాంట్లో ఉండే వైరుధ్యాలు,పొరలు,చరిత్ర కొంతైనా తెలిసి ఉండాలి...అంతే కాదు కొన్ని ప్రజా ఉద్యమాలలో ఐనా పాల్గొని ఉండాలి. అలాకాకుండా నీ వెనుక ఉన్న కులబలంతోనో ,ధన బలంతొనో అవుదామనుకుంటే మాత్రం నీ అంత లుచ్చా మాత్రం ఇంకొకడు ఉండడన్న మాట.అంతే కాదు ప్రజల సొమ్ము అంటే రైతుల భూములు...సహజ వనరులు..ఇవన్నీ ప్రజలవేనన్న కనీస స్పృహ ఉండాలి..అలా కాకుండా అవన్నీ ఎవడికో ధార పోసి ..నిన్ను రాష్ట్రానికి శాశ్వతంగా పట్టాభిషిక్తుడిని చేయడం లాంటి వెధ్వాలోచనలు  నాకు మాత్రం రావొరే. ఐనా నన్ను చూస్తున్నావు కదరా...ఆనందంగా మంచి పుస్తకాలు చదవడం,మంచి సంగీతాన్ని వినడం..మన లాంటి నలుగురికి వీలున్నంత సహాయం చేయడం..ఆనందంగా ఉన్నామా లేమా.యీ రోజు నీవు నీ వెనక ఎవడో ఉన్నాడని అడ్డకోలుగా ఏదో చేయొచ్చు...అవన్నీ నీవనుభవిస్తావన్న గారంటీ ఏమైనా ఉందా....నీ లాంటి ఎంత మంది వెధవలు జైల్ కు వెళ్ళున్నారో చూస్తున్నావు కదా....అందు చేత నీతిగా..సింపుల్  గా బ్రతకడం నేర్చుకో.ఒక వేళ వెధవ పనులు చేసి జైల్ కెళ్ళినా దేభ్యం మొహం వేసుకొని అలాగే ఉండు,అంతే గాక   ఎవరినో ఉద్దరించినట్టు రెండు వేళ్ళు పైకి లేపడం లాంటివి చేయడం..వెధవ నవ్వు నవ్వడం లాంటివి చేయకు. మళ్ళీ అలాంటివి ఫొటో లు తీసుకొని నీ దగ్గర స్కూల్లో చాక్లెట్ ఫ్రీ గా తినడం మరిగిన వెధవెవడైనా నిన్ను యే వివేకానందుడి వంటి వారితోనో పోలుస్తూ స్కూల్లో ఫ్లెక్సీలు పెట్టించేస్తాడు. అఫ్కోర్స్ మానవ జాతిలో పుట్టిన వాడు అలాంటి పనులు చేయడనుకో..కానీ ఏం చేస్తాం...అలాంటి వాళ్ళు కూడా ఎక్కువవుతున్నారు కదా.అసలు ఒక్క విషయం చెప్పొరే....నీవిచ్చే చాక్లెట్లు చూసి కాక నిజంగా నిన్ను చూసి నీ వెంట వచ్చే వాళ్ళు ఎంత మంది? నేనైతే ఏదో కష్టపడి  సివిల్ ఇంజనీర్ను అయ్యాను కాబట్టి ఏదో ఆ కాంట్రాక్టర్లు కొద్దిపాటి మర్యాదగా ఉన్నారనుకో...మరి ఏ ఒక్క మంచి లక్షణం  లేని నీవు కూడా జన్మంతా అలాంటి మర్యాదలు కావాలనుకున్నావు చూడు  అందుకు నిన్ను........ మన వైజాగ్ లో ఇప్పుడు పెద్దగా కనబడ్డం లేదు కానీ లేదంటే డ్రైనేజీల్లో తిరిగే పందుల తో తొక్కి చంపించేద్దామని ఉందొరే...నీవు ప్రహ్లాదుడంటి వాడివి కాదు కానీ నిన్ను చూసి మాత్రం నాకు హిరణ్య కశిపుడికొచ్చిన ఆవేశం వచ్చేస్తోంది.ఉన్న ఈ డబల్ బెడ్ రూం చాల్లేదు...హాల్లో మ్యూజిక్ సిస్టం లేదు..అది లేదు ..ఇది లేదు అని ఎప్పుడూ నసుగుతూ ఉంటావు.నీకంటూ చాన్సొస్తే   నన్ను మర్డర్ చేసేసి మీ అమ్మను కూడా తీసుకొని నా శ్రేయోభిలాషుల  దగ్గరికి వెళ్ళి అనాధలమై పోయామని చెప్పి చందాలు దండేసి వాటితో నీక్కావలిసిన వన్నీ కొనుక్కుని అనుభవించడానికేమీ జంకవొరే.మీ అమ్మకెలాగూ నీవంటే పిచ్చి గారం కాబట్టి నీవు వెధవ్వని తెలిసినా చచ్చినట్టు నీతో వస్తుంది.నేను ఇంత నెమ్మదిగా చెబుతుంటే అలా కునుపాట్లు పాడతావేంట్రా దున్న పోతా...

మొన్నేదో స్కూల్ నాటకంలో హీరో వేషం తగలెట్టావంట. ఎవడ్రా నీకా వేషం ఇచ్చింది. కాస్తంత రంగు...పొడుగూ..చాతీ..ఉంటే హీరో అయిపోడ్రా  గాడిదా. నటనంటే నాలుగు ఫైట్లు....నాలుగు స్టెప్పులూ...అది కార్పిస్తా...ఇది కార్పిస్తా లాంటి వెధవ డైలాగ్ లు కాదురా....పైగా నీకు ఉత్తమ నటుడి అవార్డ్ కూడా నట.ఇచ్చే వాళ్ళకు సిగ్గు లేక పోతే తీసుకొనడానికి నీకన్నా సిగ్గుగా లేదురా.నీ జన్మెట్టు కొని ఒక్క మంచి సినిమా చూసావురా."బైసికిల్ థీవ్స్" లాంటి గొప్ప విదేశీ  చిత్రాలు కాకపోవచ్చు..కనీసం "మనుషులు మారాలి"లాంటి మన భాషా చిత్రాలన్నా చూసావా.నీవు నటించిన నాటకం ఒక చెత్త అని నీకు తెలుసు.మరి అలాంటప్పుడు ఇంకా ఎంతో కొంత మంచి నాటకాలలో మంచి నటన చేసిన వాళ్ళను రికమండ్ చేయొచ్చు కదా...విత్తనాల కోసం లైన్ లో నిలబడి ..మరలా ఎరువుల  కోసం ఎండలో  చెప్పులరిగేలా తిరిగి ...రాత్రుళ్ళు నిద్ర లేకుండా పవర్ ఇచ్చినప్పుడే బోర్ నడిపి ..పంట పండిన తరువాత...కిట్టుబాటు ధర అస్సలు లేదని విచారంగా కూర్చున్నప్పుడు ..కాలేజ్ కెళ్ళిన కుమారుడొచ్చి " నాన్నా....యీ సంవత్సరం నుండి మన ఫీజులు మనమే కట్టుకోవాలి" అన్నప్పుడు...ఆ రైతు ముఖం ఎలాఉంటుందో ఒక్క సారి  నటించి చూపించు...నీవొక నటుడివని ఒప్పుకుంటాను.అంత వరకూ పెద్ద హీరోలా  నీ చాక్లెట్ బాచ్ చేత చప్పట్లు కొట్టించుకొంటే మాత్రం నిన్ను చెప్పుచ్చుక్కొట్టేయాలొరే....

 ఇంత సేపూ నీవు చెప్పింది విన్నాను కాబట్టి నాకు కే .ఏఫ్.సీ.నుండి చికెన్ మంచూరియా... గాడిద గుడ్డు తెచ్చి పెట్టు అంటే పళ్ళు రాలగొట్టేయగలనొరే.నువు తిన్న ప్రతి వంద కూ పది రూపాయలు ఎవడో విదేశీ  వాడు తింటాడన్న సంగతి నీకు తెలియక పోవచ్చు కానీ నాకు తెలుసు కాబట్టి ఏమోయ్..హాయిగా మాంచి ఉప్మా వండు..దానికి వరల్డ్ హెరిటేజ్ ఫుడ్ స్టేటస్ కూడా వచ్చింది. ఆ చికెన్లకు దేనికీ అలాంటిదేమీ లేదు.


అసలు ముందు యే విషయాన్నైనా  నాలా సున్నితంగా చెప్పడం నేర్చుకో చాలు.