4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సిటీ బస్సు -కల్చర్


ప్రతి ఊరికి కొన్ని కధలున్నట్లే అన్ని ప్రయాణ మాధ్యమాలలోను కొన్ని కధలు పుడతాయి,పెరుగుతాయి. కొన్ని అక్కడే ఆగిపోతాయి..మరి కొన్ని మాత్రం కొనసాగుతాయి. రాజమండ్రి లాంటి టౌన్ కి పక్కనే ఉన్నా గాని ౧౯౭౮ వరకు మాకు బస్ సౌకర్యం లేదు. మోటార్ సైకిల్ కొనే సామర్ధ్యం అప్పట్లో చాలా మందికి ఉండేది కాదు. పైగా మంచి స్కూటర్ కావాలంటే బుక్ చేసుకుని ఎదురు చూడవలసి వచ్చేది. ఎక్కువగా సైకిల్ మీదే ఆధార పడే వాళ్ళం. సిటీ బస్ ను మా వూరి సెంటర్ లో చూడ గానే మాకెంత ఆనందం కలిగిందంటే అదేదో దేవతల వరం వలన మాకు ప్రాప్తించినట్లుగా ఫీలయ్యాం. ఇదంతా మొదట్లో బాగానే వుండేది.
అసలు కధలన్నీ ఆ తరువాతే ప్రారంభం అయ్యాయి. ఆ రోజుల్లో ఇప్పుడున్న ట్రాఫిక్ ఉండేది కాదు. ఆ బస్ బొమ్మూరు సబ్ స్టేసన్ వదిలితే గాలిలో వచినట్లుగా వచ్చి మా ఊర్లో వాలేది. దానిని అల్లంత దూరంలోనే చూసే రోడ్ నుండి క్రిందకు దిగి పొయ్యే వాళ్ళం. ఇప్పుడున్న డబల్ రోడ్ కూడా కాదు అప్పుడు. రోడ్ కి సరిగా బెర్మ్స్ కూడా ఉండేవి కాదు. సైక్లిస్త్స్ ఇబ్బందులను బస్ డ్రైవర్స్ ఏ మాత్రం లెక్క చేసే వారు కాదు. రెండు మూడు సార్లు కింద పడ్డం కూడా జరిగింది. అప్పుడే కావలిసిన సంఘటన జరిగింది. ఒక కోమటాయన సైకిల్ నిండా సామాను కట్టుకుని రాజమండ్రి నుండి తిరిగొస్తున్నాడు. రాత్రి పది గంటల సమయం. చిమ్మ చీకటి.....జెట్ వేగంతోబస్ ఆ షావుకారుని రాసుకుంటూ పోయింది. పాపం ఆయన సైకిల్ కంట్రోల్ కాక రోడ్ పక్కన ఉన్నచిన్న చెరువులో పడ్డాడు.బస్ సెంటర్ లో ఆగింది. షావుకారు డ్రైవర్ తో కొంచెం స్పీడ్ తగ్గిస్తే తన సొమ్మేమీ పోదుగా అని అడిగాడు. ఆ డ్రైవర్ పొగరుగా తమ బస్ కు ఎక్కువ టాక్స్ కడుతున్నాం కాబట్టి రోడ్ అంతా తమదే అన్నట్లు మాట్లాడాడు. అదే టైం కు అక్కడ నిలబడి ఇదంతా చూస్తూ .. చుట్ట కాల్చుకుంటున్న ఒక పెద్ద మనిషికి ఈ సమాధానం తో చిర్రెత్తుకొచ్చింది. డ్రైవర్ ను గట్టిగా నిలదీశాడు. డ్రైవర్ మరీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అసలే గ్రామస్తుల్లో ఉక్రోషం పేరుకు పోయి ఉందేమో ...ఆ పెద్ద మనిషి డ్రైవర్ ను పట్టుకుని రెండు తగల్నిచ్చాడు. డ్రైవర్ వెంటనే బస్ వేసుకుని రాజముండ్రి వెళ్ళిపొయ్యాడు. అప్పట్లో మోటార్ వర్కర్స్ యూనియన్ అంటే అందరికీ హడల్. కానీ ఊరంతా షావుకారికి సపోర్ట్ గా నిలబడింది. మొత్తం జనం అంతా అన్ని విభేదాలు మరిచిపోయి చేతికి దొరికిన ఆయుధంతో ఏ ఉపద్రవాన్నైనా ఎదుర్కొనడానికి సెంటర్ లో సిద్దంగా కూర్చున్నారు. నాలుగు బస్ ల తో యూనియన్ జనం వూరి మొదలు వరకు వచ్చారు కానీ పరిస్థితిని తెలుసుకుని వెనుకకు తిరిగి వెళ్లి పొయ్యారు. కానీ మరుసటి రోజు నుండి బస్ లు బంద్. మా మామయ్య శ్రీ మార్ని సత్యనారాయణ తదితరులు అప్పటి మా ఎమ్మెల్యే శ్రీ వెంకటస్వామి నాయుడు గారి సహకారంతో మా ఊరికి ఆర్టీసి బస్ లు తిరిగేటట్లు చేయగలిగారు. దాంతో యూనియన్ పెద్దలు రాజీకి వచ్చారు. డ్రైవర్ క్షమాపణతో కధ సుఖాన్తమయ్యింది.
ఇదంతా ఎందుకు రాసానంటే నాకు వూహ వచ్చిన తరువాత నేను చూస్తుండగా ఏదో విధంగా ఎవరో ఒకరి ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా జనం అంతా ఏకమయ్యి దానిని ఎదిరించి ఓడించిన మొదటి పోరాటం అది. అది నాకు జీవితానికి సరిపడిన ఇన్స్పిరేసన్ ఇచ్చింది
ఆ బస్సుల్లో ఫోజులు కొడుతూ ప్రయాణించిన ఎంతో మంది జీరోలుగా మిగిలిపోతే "ముగ్ద" అనే పదానికి నిర్వచనంగా నిలిచిన ఒకమ్మాయి మా గ్రామం నుండి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న మొదటి అమ్మాయి గా చరిత్రలోకి ఎక్కింది. ఆ అమ్మాయి ఎవరో కాదు...శ్రీమతి మాధవి మా మావయ్య కూతురే...

3, ఫిబ్రవరి 2011, గురువారం

సంక్రాంతి ముగ్గులు



ప్రతి ఒక్కరి లోనూ కళా పిపాస అనేది ఉంటుంది. కానీ అది బయటకు రావడానికి పరిస్టితులు కూడా అనుకులించాలి. ఇది స్త్రీల విషయంలో మరీను . అందులోను గ్రామీణ స్త్రీల విషయంలో ఐతే చెప్పనే అక్కర లేదు. వాళ్లకు ఆడంబరాలు ప్రదర్శించడానికి అవకాశాలు వస్తాయి కానీ కళలు ప్రదర్సిచడానికి మాత్రం అవకాశాలు రావు . మా ఊరిలో ఎలాంటి కమ్యూనిటీ భవనాలు లేవు . “కూచిపూడి ” పేరు విన్న వాళ్ళు కూడా ఉండే వారు కాదు కాబట్టి పాపం ఆడ పిల్లలు అంతా వాళ్ళకున్న కళా తృష్ణ అంతా ముగ్గుల మీదే చూపించే వారు . సంక్రాంతి సీజన్లో వీధిల్లో నడవడానికి కూడా ఖాళీ దొరికేది కాదు. ఏమాత్రం ముగ్గుల మీద కాలు వేసినా గయ్యి మనే వారు. అప్పటికింకా "గోగులు పూచే ...గోగులు కాచే..పాట పాత బడ లేదు ....కానీ ఆ పాట పాతబడుతుందా అసలు .....తెలుగు ప్రజలమంతా ఎంతో అదృష్టం చేసుకున్నాం కాబట్టి అటువంటి పాటలు వినగలుగుతున్నాం నిజమైన తెలుగు జాతి మనగలిగినంత వరకు ఆ పాటలు అజరామరంగా ఉంటాయి.
మరి ముగ్గుల మీద కాలు వెయ్యకుండా భోగి మంటలకు పోగేట్టిన పుల్లలు, దుంగలు మోసుకేల్లేది యెట్లా? దానికి మాత్రం కాస్త అనుమతి దొరికేది.
నాకు సంవత్సరం సరిగా గుర్తు లేదు కానీ ఆ సంవత్సరం మాత్రం మొత్తం కుర్రకారు అంతా మా వీర్రాఘవులు (వీరూ) నాయకత్వంలో కొత్త బాడ్మింటన్ కోర్ట్ వేద్దామని నిర్ణయించుకున్నాం. ఒక బాచ్ అంతా తవ్వడం, ట్రాక్టర్ లో లోడింగ్ చేస్తే మరొక బాచ్ అన్లోడింగ్, కోర్ట్ లో సమంగా పరచడం చేసాయి. మట్టి తవ్వడానికి వెళ్లినప్పుడే దుంగలు పోగుచేశారు కాబట్టి బాడ్మింటన్ కోర్ట్ దగ్గరే భోగి మంట కూడా వేసారు. సరిగ్గా తెల్లారే సరికల్లా తెల్లటి లైన్స్ తో కొత్త మట్టి సిగారించుకొన్న బాడ్మింటన్ కోర్ట్ అందం , మా కుర్రాళ్ళ ఆనందం ఏ మాటల్లో వర్ణించాలో అర్ధం కావడం లేదు. కానీ నిద్ర లేమి వల్లఅందరి కళ్ళల్లో మంటలు. అయినా సరే మా వీరూఒక సర్వీసు ను కట్ కొట్టి కోర్ట్ వదిలాడు.

2, ఫిబ్రవరి 2011, బుధవారం

మా వూళ్ళో కళలు -కళాకారులు

నా చిన్నప్పటి నుండీ మా వూళ్ళో వినాయక చవితి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. నాకు వూహ తెలిసినకొత్తలో మా మావయ్య శ్రీ మార్ని సత్యనారాయణ ,శ్రీ రిమ్మలపూడి గంగా రావు మొదలగు వాళ్ళు పల్లె పడుచు అనేనాటకం ఆ ఉత్సవాల్లో వేయడం నాకు గుర్తుంది. మా నాన్న గారు ఉద్యోగ రీత్యా మేము వేరే వూళ్ళో ఉండే వాళ్ళం కాబట్టిఅప్పట్లో మా ఊరిలో ఉన్న కళా కారుల గురించి ఆనాటి వాళ్ళ దగ్గర నుండీ వివరాలు సేకరించి ముందు ముందుమరింత వివరంగా రాస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కూడా పోతమ్మ హోటల్ లో సాయంత్రంఅయ్యేసరికి మా తాతయ్య తమ్ముడు శ్రీ మార్ని గనేస్వర రావు గారు ఒక పాత హార్మోనియం పెట్టెతో రాగాలాపన చేయడంఇంకా చాలా మంది గుర్తుల్లో ఉంటుంది చాటుగా ఐతే ఆయనకు ఇంకా చాలా కళలు ఉన్నాయని జనం అంటారు గానీప్రస్తుతం ఎనభై ఆరవ వసంతం నడుస్తున్న ఆయన కళల గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించడం అనవసరం. అంతేకాకుండా భజన బృందం ఒకటి ఉండేది. వాళ్ళు హై పిచ్ లో తాళం వేస్తున్నప్పుడు వినడానికి బాగుండేది. దానికి వాద్యసహకారం కూడా ఉండేది. టీవిలు జనాన్ని ఇళ్ళల్లో కట్టేస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే అవి తరువాత తరాలకుసంక్రమించే అవకాశం లేదు. నేను తాడికొండ ఆశ్రమ స్కూల్ లో చదివాను కాబట్టి నాకంటే ఈ విషయాల మీదఅవగాహన ఉన్న వారు వివరంగా రాస్తే బ్బగుంటుంది. ఇవి కాకుండా స్త్రీల కళల గురించి వేరే పోస్ట్ లో.....

31, జనవరి 2011, సోమవారం


మా నాన్న గారు ,అమ్మ. గోదావరి కి దగ్గరలోనే ఉన్న రెండు ప్రాంతాల అభివృద్ధి లో ఉన్న తేడా ల ఫలితంగా ఏర్పడిన కుటుంబ నేపధ్యాల మేలు కలయికే మా అమ్మ, నాన్న గార్లు. కాలువల వలన వచ్చిన అభివృద్ధి ఫలాలు చేతికందిన వారిలో త్వరగా మొలకెత్తే వ్యాపార దృక్పదం మా తాతయ్య( మా అమ్మ గారి తండ్రి) లో బాగా కనబడేది. కానీ బలమైన వ్యావసాయిక నేపధ్యం కాబట్టి ఏ పనైనా చాలా సహనంగా ,బలంగా చేసే వాడు. ఇంచుమించు అవే లక్షణాలు మా అమ్మవీను శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ.....