2, ఫిబ్రవరి 2011, బుధవారం
మా వూళ్ళో కళలు -కళాకారులు
నా చిన్నప్పటి నుండీ మా వూళ్ళో వినాయక చవితి ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. నాకు వూహ తెలిసినకొత్తలో మా మావయ్య శ్రీ మార్ని సత్యనారాయణ ,శ్రీ రిమ్మలపూడి గంగా రావు మొదలగు వాళ్ళు పల్లె పడుచు అనేనాటకం ఆ ఉత్సవాల్లో వేయడం నాకు గుర్తుంది. మా నాన్న గారు ఉద్యోగ రీత్యా మేము వేరే వూళ్ళో ఉండే వాళ్ళం కాబట్టిఅప్పట్లో మా ఊరిలో ఉన్న కళా కారుల గురించి ఆనాటి వాళ్ళ దగ్గర నుండీ వివరాలు సేకరించి ముందు ముందుమరింత వివరంగా రాస్తాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో కూడా పోతమ్మ హోటల్ లో సాయంత్రంఅయ్యేసరికి మా తాతయ్య తమ్ముడు శ్రీ మార్ని గనేస్వర రావు గారు ఒక పాత హార్మోనియం పెట్టెతో రాగాలాపన చేయడంఇంకా చాలా మంది గుర్తుల్లో ఉంటుంది చాటుగా ఐతే ఆయనకు ఇంకా చాలా కళలు ఉన్నాయని జనం అంటారు గానీప్రస్తుతం ఎనభై ఆరవ వసంతం నడుస్తున్న ఆయన కళల గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించడం అనవసరం. అంతేకాకుండా భజన బృందం ఒకటి ఉండేది. వాళ్ళు హై పిచ్ లో తాళం వేస్తున్నప్పుడు వినడానికి బాగుండేది. దానికి వాద్యసహకారం కూడా ఉండేది. టీవిలు జనాన్ని ఇళ్ళల్లో కట్టేస్తున్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడే అవి తరువాత తరాలకుసంక్రమించే అవకాశం లేదు. నేను తాడికొండ ఆశ్రమ స్కూల్ లో చదివాను కాబట్టి నాకంటే ఈ విషయాల మీదఅవగాహన ఉన్న వారు వివరంగా రాస్తే బ్బగుంటుంది. ఇవి కాకుండా స్త్రీల కళల గురించి వేరే పోస్ట్ లో.....
31, జనవరి 2011, సోమవారం
మా నాన్న గారు ,అమ్మ. గోదావరి కి దగ్గరలోనే ఉన్న రెండు ప్రాంతాల అభివృద్ధి లో ఉన్న తేడా ల ఫలితంగా ఏర్పడిన కుటుంబ నేపధ్యాల మేలు కలయికే మా అమ్మ, నాన్న గార్లు. కాలువల వలన వచ్చిన అభివృద్ధి ఫలాలు చేతికందిన వారిలో త్వరగా మొలకెత్తే వ్యాపార దృక్పదం మా తాతయ్య( మా అమ్మ గారి తండ్రి) లో బాగా కనబడేది. కానీ బలమైన వ్యావసాయిక నేపధ్యం కాబట్టి ఏ పనైనా చాలా సహనంగా ,బలంగా చేసే వాడు. ఇంచుమించు అవే లక్షణాలు మా అమ్మవీను శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ.....
30, జనవరి 2011, ఆదివారం
మా అత్తా మామ గార్లు
మా అత్త మామ గార్లు...... కనుమరుగవుతున్న గ్రామీణ స్వచ్చతకు దర్పణంగా ఉండేవారు. ఇంకా ఉండేవారేమో....డిసెంబర్ ౨ ౨౦౦౭ తెల్లవారు ఝాము మా మామగారి కి మృత్యు పాశం విసరక పొతే......ప్రస్తుతం మనం అనుకుంటున్నా అభివృద్దికి చక్రాలు ఉంటున్నాయి కానీ కళ్ళు వుండడం లేదు. వేగం ఒక్కటే దానికి తెలుసు. పల్లెలు ఆ అభివృద్ధి కి అలవాటు పడేటప్పటికి వాటి మూలాలు సమూలంగా కనుమరుగయ్యేతట్లున్నాయి.
ఎన్ని మార్పులు.....
తలుచుకుంటుంటే ఒక్కక్కప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ ఊరిలో మార్పులు చూసినా మన దేశంలో మార్పులు అర్ధం చేసుకోవచు. మాఊరేమీ ప్రత్యేకం కాదు. ముందు ముందు ఇంకా ఏ మార్పులు రానున్నాయో వుహిస్తుంటే ఎప్పటి కప్పుడు ఒక వీడియో కెమెరా తో జరుగుతున్న ప్రతి ఫంక్షన్ రికార్డు చేసుకోవాలని పిస్తోంది. అది ఎవరిదైనా మరణం కావచు లేదా పెళ్ళైనా కావచ్చు. మన చేస్తున్న పనిలో నిజాయితీ శాతం చూస్తుంటేనే బాధగా వుంటుంది. ఇంటికి వెళ్ళగానే అతిధులకి ఇత్తడి చెంబుతో కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళిచ్చి ఆహ్వానించే రోజులనుండి ముక్తసరిగా ఒక్క మాటతో పలకరించి టీవి సీరియల్ లో తలడుర్చే సంప్రదాయానికి vacchesaము .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)