సమయం
|
చేసిన పని
|
తన దృష్టిలో చేసిన పని తాలూకు ఫలితం
|
|
పుణ్యం వచ్చేవి
|
పాపం తెచ్చేవి
|
||
ఉ.06.30
|
రైతు బజార్ కు
కూరగాయల కోసం బయలు దేరాడు. ఆ రోజు గురు
వారం అన్న సంగతి గుర్తుకు వచ్చి సాయి బాబా గుడి వైపుకి తిరిగాడు. అప్పటికే జనం
వచ్చేశారు. పార్క్ చేసే స్థలం లేదు . ఫరావాలేదనుకుంటూ నాలుగు వాహనాలకడ్డంగా తన బండి
పార్క్ చేసేశాడు. గుడి లో పెద్ద క్యూ ఉంది. ఎవరూ పట్టించుకోరనుకుంటూ లైన్ పట్టించుకోకుండా
ముందుకు సాగి పొయ్యాడు. ఇద్దరు ముగ్గురు కేకలు వేసారు కానీ వినబడనట్లు వెళ్లి
సాయిబాబా విగ్రహం ముందు సాష్టాంగ పడి పొయ్యాడు . బయటకు వచ్చేసరికి తన బండి అడ్డు
రావడం వలన బయటకు తీయలేక నలుగురు వాహనదారులు ఎదురు చూస్తున్నారు.
|
ఏదో
పుణ్యం ఇంతకు ముందు చేసాను కాబట్టే ఇంత సులభంగా దర్శనం దొరికింది.
|
ఎవరి
ప్రాప్తం వారిది.....అందరి సంగతీ పట్టించుకుంటే మన పనులెలా ......?
|
ఉ.08.00
|
తెచ్చిన విభూతి
తయారై కూర్చున్న పిల్లలిద్దరి ముఖాన రుద్దాడు . “ఏమిటి నాన్నా .....టైం చూడు ..ఇవాళ
టెస్ట్ కూడా ఉంది “ అన్న కొడుకు తో “ఫరవాలేదురా
నేను తీసుకు వెళ్తానుగా” అంటూ రాంగ్ రూట్ లో ఇద్దరిని గుద్దినంత పని చేసి ఎలాగైనా
కుమారుడిని టైం లో కాలేజ్ లో పడేసాడు.
|
ఈ సంవత్సరం
ఒక్క సారీ మిస్ కాకుండా ప్రతి గురువారం సాయిబాబా గుడి కి వస్తానని మొక్కుకున్నాక
....మిగిలినివన్నీ స్వామే చూసుకుంటాడు.
|
రోడ్డన్నాక
ఎవడికీ టచ్ కాకుండా డ్రైవ్ చేయకుండా ఉంటాడా...
?ఎప్పుడూ
కరెక్ట్ రూట్ లోనే వెళ్తాడా ......
|
ఉ.08.30
|
రైల్వే స్టేషన్ కు
బయలు దేరాడు. రోడ్ కడ్డంగా వేసిన వినాయక
చవితి పందిరి లో కెళ్ళి విగ్రహానికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు .
|
తృప్తిగా
ఫీలయ్యాడు ట్రాఫిక్ ఇబ్బంది కలిగించినప్పటికీ ...
|
|
ఉ.08.50
|
లోకల్ ట్రైన్
ప్లాట్ఫార్మ్ మీదకు వచ్చింది. పెద్ద రష్ లేదు కానీ దిగేవారిని తోసుకుంటూ లోపలికి
దూరిపోయాడు. పక్క వాడి దగ్గర పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు . సహజం గానే ప్రయాణీకుల
వాగ్యుద్ధం ప్రారంభమయ్యింది. “అసలు ఈ
పొలిటీషియన్స్ లో నిజాయితీ ఎక్కడుందండీ.....అందరినీ ఉరి తీసేయాలండీ ....
నక్సలైట్ లు మాత్రం
కాంట్రాక్టర్ ల దగ్గర నుండి చందాలు దండుకోవడమే కదండీ .....” దిగవలసిన స్టేషన్
వచ్చే వరకూ వాగుతూనే ఉన్నాడు .
|
ఎన్నెన్ని
కుంభకోణాలు .....2G....బొగ్గు...లేదంటే దేశం ఎక్కడో ఉండేది ......ఆ మాత్రం
గట్టిగా చెప్పాలి ....
|
|
సా 5.00
|
....ట్రైన్ టైం అయి
పోతోంది....ఈ రీ స్త్రక్చరింగ్ ఎప్పుడు అవుతుందో...హాపీ గా గవర్నమెంట్ జీప్
దొరికిపోతుంది .....పిల్లల ఆటో ఖర్చు కూడా సేవ్ అవుతుంది.
|
గవర్నమెంట్
జీప్ వాడని ఆఫీసర్ భూమ్మీద ఉంటాడా ...?
|
పాపం
ఎంత మాత్రమూ కాదు
|
సా 7.00
|
“నాన్నా.....పరీక్షల
టైం లో ఈ మైకుల గోల చాలా ఎక్కువగా ఉంది....నేను ..గౌతమ్ ...ఇంకా నలుగురం కలసి ఆ
పందిరి లో వాళ్లకు సౌండ్ తగ్గించమని చెప్పొస్తాం...” అన్న కొడుకి మాటలకు ఉలిక్కి
పడ్డాడు. “ఒరేయ్ ...ఈ ఏరియా అంతా వాళ్ళ వాళ్ళే .....నీవు బెడ్ రూమ్ లోకి వెళ్లి
తలుపులు వేసుకుని చదువుకో.......”
|
మంచి
ఇంజనీర్ అవ్వ వలసిన వాడిని అనవసర గొడవలలోకి ఎలా పంపిస్తాం.
|
|
రా 8.00
|
ఆటో ఆగింది .
అమ్మాయి దిగింది . “అదేమిటమ్మా....
లేటయ్యి పోయింది .”నిర్భయ
సంస్మరణార్ధం కాండిల్స్ టో ఊరేగింపు జరిపాం ....నాన్నా....పైగా పూర్తిగా ప్రెస్
కవరేజ్ ఉంది .పేస్ బుక్ లో ఉన్న మా
కాలేజ్ పేజ్ లో అన్ని ఫోటోస్ అప్ లోడ్ చేస్తారంట .
|
పిల్లలకు
ఆ మాత్రం సోషల్ అవేర్నెస్ ఉండక పొతే ఎలా....
|
|
30, డిసెంబర్ 2013, సోమవారం
ఒక నగర వాసి జీవితంలో ఒక రోజు
23, డిసెంబర్ 2013, సోమవారం
చట్టానికి మేము అతీతులమ్మరి ..... కాకపోతే అది అమెరికా ...
నేను ఒక సారి ఏదో ఆలోచిస్తూ నా టూ వీలర్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా జరిగింది ఆ సంఘటన . చాలా స్పీడ్ గా పక్క వీధి నుండి వచ్చిన ఒక టూ వీలర్ యువకుడు రాంగ్ టర్న్ తీసుకుని నన్ను ఢీ కొట్టినంత పని చేసాడు . నేను నెమ్మదిగా డ్రైవ్ చేయడం వలన అదృష్టం కొద్దీ నాకేమీ కాలేదు కానీ ఈ ఆకస్మాత్తు సంఘటన నన్ను చాలా ఉలికి పాటు కు గురి చేసింది . ఆ ఉలికి పాటులో నా నోటి నుండి కాస్త పరుషమైన పదజాలమే బయటకు వచ్చింది . నిజంగా చెప్పాలంటే ఆ ఉలికిపాటు వలన కాస్త గట్టిగానే తిట్టేసిన మాట వాస్తవం . మా మద్య వాదోప వాదం పెరిగింది. సహజంగానే చోద్యం చూసే జనం మా చుట్టూ చేరారు . అతగాడు తను చేసిన పని లోని తప్పుని ..... అంటే పబ్లిక్ ను తప్పుదారి పట్టించడం కోసం నేను తిట్టిన తిట్లనే హైలైట్ చేస్తాడు కానీ అంతకు ముందు నన్ను అంతగా కలవరబాటుకి గురి చేసిన అతగాడి పొరబాటు గురించి మాట్లాడే ఛాన్స్ నాకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు . చోద్యం చూసే జనమే కాబట్టి అంత లోతుల్లోకి వెళ్ళరన్న అతగాడి నమ్మకాన్ని కూడా జనం నిజం చేస్తూ జనం మా ఇద్దరినీ వేరుజేయడానికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్లి పొయ్యారు .
అటువంటిదే మరలా ఇన్నాళ్ళకి మన మీడియా లో మరలా చూస్తున్నాను . మన IFS అధికారిణి ని అమెరికా వారు చాలా చిన్న చూపు చూసారన్న వార్త మొత్తం పత్రికలన్నీ ఊదరగొట్టేసాయి. అది నిజం అనే దాంట్లో ఆక్షేపణ అయితే ఏమీ లేదు కానీ అంతకు ముందు ఆమె చేసిన చట్ట ఉల్లంఘన గురించి మాత్రం ఎవరూ రాయలేదు. ఆమేమీ సామాన్యురాలేమీ కాదు . ఒక IFS అధికారిణి. ఏ దేశంలో అయితే తను భాద్యత లు నిర్వర్తిస్తుందో ఆ దేశ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన భాద్యత ఆమెదే . కానీ మన మీడియా వారికి వార్తను సరుకుగా మార్చుకోగల తెలివితేటలు ఎక్కువే కాబట్టి ఆమె నేరం కాస్తా వెనక్కు పోయింది . మన అదృష్టం కొద్దీ నిన్న ..... ఈ రోజు మాత్రం కొన్ని పత్రికల్లో ఆదర్స్ హౌసింగ్ లో ఆమెకున్న అక్రమంగా పొందిన ఫ్లాట్ ..... అంతకు ముందు ఆవిడ తండ్రి గారి అధికారిక బలం వలన ఆవిడ కు ఒనగూరిన undue advantage గురించి వార్తలు వచ్చాయి. "ఇది అందరూ చేసేదే...... దీన్ని పెద్ద విషయం చేసేస్తున్నారు" అని నెమ్మదిగా దీన్ని పలచన చేసే ప్రయత్నం కూడా మొదలయ్యింది . అసలే ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి పాపం ...... దీన్ని ఎలా వాడుకోవచ్చో అని రాజకీయ పార్టీలు కూడా తర్జనభర్జనలు పడిపోతున్నాయ్ పాపం .

25, నవంబర్ 2013, సోమవారం
నిర్జన వారధి గానే వదిలేద్దామా
“అసలు ఈ పుస్తకం ఎందుకు
చదవాలి?”అనే ప్రశ్న తోనే మనం ప్రారంభిద్దాం. అసలు పుస్తకాలే చదివేవాళ్ళు
కరువైపోతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకాన్ని ఎంత మంది చదువుతారో తెలియదు. అసలీ
పుస్తకాన్ని ఎందుకు చదవాలి ?
దానికి ఒక్కటే సమాధానం. ఒక
ఉదాత్త చరిత్రను ......మానవీయతను దర్శింఛి మీకు తెలియకుండానే మీ కళ్ళలో నుండి అది
ఆనందమో .....దుఖమో తెలియని స్థితిలో కారుతున్న నీళ్ళను కూడా పట్టించుకోలేని
అనుభూతిని మీరు కోరుకుంటే ఈ పుస్తకాన్ని చదివి తీరవలసిందే . సమాజ పరిణామం ఆగదు.
కానీ ఆ రోజుల్లో మాకు దొరికింది ......ఈనాటి యువకులకి దొరకనిది ఒక్కటే ......“ఉత్తేజం”.
భిన్న ఆలోచనలే లేని చోట నిజమైన ఘర్షణ ఉండే
అవకాశమే లేదు. భిన్న ఆలోచనల.....సిద్దాంతాల ఘర్షణ ఉన్న సమాజం లో పుట్టేదే నిజమైన
ఉత్తేజం తప్ప మిగిలినదంతా రాజు గారి భార్యలు .....ఉంపుడుగత్తెల ఆంతరంగిక పోరాటమే
తప్ప మరేమీ కాదు.
స్వాతంత్ర్య పోరాటానికి ఒక
బాలిక గా ఉన్నప్పుడే అంతగా ఎందుకు స్పందించాలి.... నిజంగా ఆమెకు జన్మనిచ్చిన
తలిదండ్రుల పెంపకం ఎంత గొప్పది....బాల్య వితంతువుకి వివాహం చేసినా ఆమెను పోరాట మార్గంలోకి అనుమతించిన ఆ మహనీయులకి .....నారాయణ
కాలేజ్ గాని..... చైతన్య కాలేజ్ గానీ ఇంటర్నల్ గా పెట్టే పరీక్షలలో మార్కులు
తక్కువ రాగానే గాభరా పడిపోయే ఈ నాటి తలిదండ్రుల మైన మాకూ ఎంత తేడా .......
గూండాలను తరిమి తరిమి కొట్టిన
ఆ మహనీయురాలి జ్ఞాపకాలలోని విజయవాడ ను కుల రక్కసి కరాళ నృత్యంచేస్తున్న నేటి
విజయవాడ ను పోల్చి చూస్తే చాలు మన రాజకీయ పార్టీలు .....మీడియా... ప్రజలను ముందుకు
తీసుకు వెళ్తున్నాయో ....వెనుకకు తీసుకు వెళ్తున్నాయో చెప్పడానికి . అసలు అభ్యుదయం అంటే ఏమిటో తిరోగమనం అంటే ఏమిటో తెలియకుండా
పిల్లలను పెంచేస్తున్న మాకూ ....తన తరువాతి రెండు తరాలవారిలో కూడా అత్యున్నత చైతన్యం నింప గలిగిన ఆ నిత్య
యౌవ్వనరాలు తో పోలిస్తే మేమేప్పుడో వృద్దులమై పోయాం. వోట్లు రాల్చగలిగే గూండాల ...ఫాక్షనిస్టుల
విగ్రహాల మాటున జాతీయ నాయకుల విగ్రహాలు దాక్కుంటుంటే చూసి కూడా టీవీ రియల్ కోసం....ఆఫీస్ టైం కోసం .....పిల్లల
కాలేజ్ టైం అయిపోతుందని ........క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం పరుగులు తీస్తున్నాం .
ఆ తరువాత కూడా ఇంకా టైం ఉందనుకుంటే ముందుగానే టికెట్స్ రిజర్వు చేయించుకుని తిరుపతి
...షిర్డీ యాత్రలకు వెళ్తాం తప్ప .....పరలోక సుఖాలకు కర్చీఫ్ వేసుకుంటాం తప్ప......ఎంతో
అవసరమైతే తప్ప వోటు వేయడానికి కూడా బయటకు రాలేము. ఎలా వస్తాం..... రోడ్ మీద
మెత్తగా జారిపోయే కార్లను కలర్ టీవీలో అందులోనూ పక్కన మాంచి అమ్మాయి కూర్చుంటే
డ్రైవ్ చేస్తుంటే ఉండే మజా ను చూపిస్తుంటే ఆనందంగా కలలలోకి జారిపోతూ బ్రతికేస్తున్నాం.
ఎప్పుడో విద్యార్ధి దశలో “వీరులార.....వీరులార.....ఎర్రజెండ....యోధులార .....” అని
పాడుకున్న రోజులు జ్ఞాపకానికి కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నాం.
కానీ ఈ పుస్తకం మరొక్క సారి
మాకొక మార్గం చూపించింది. తన జీవితం మరొకరికి భారం కాకుండా ఆ మహనీయురాలు ఎలా
జాగ్రత్త పడిందో చూసిన తరువాత ఇప్పుడు మేము నడుపుతున్న పడవను ఇప్పుడున్న
పరిమితులలోనే ఒక తీరానికి చేర్చిన తరువాత మరలా మేము ఏ బాట పట్టాలో తెలిపింది . ఆ
మహా తల్లిని నిర్జన వారధిగా మిగలనీయం.
అటువంటి అమ్మమ్మ దొరికిన
అనూరాధ ధన్యురాలైతే .....ఈ పుస్తకాన్ని బయటకు తీసుకు రావడానికి కృషి చేసిన అనురాధ (చిన్ని)
తో పరిచయం ఉన్న మేమంతా ధన్యులం.
20, నవంబర్ 2013, బుధవారం
క్రీడా రాజకీయాలు ..... రాజకీయ క్రీడలు
చాలా కాలానికి ఒక ఆలోచన రేకెత్తించే వార్త. మామూలుగా ఐతే అది పెద్ద వార్తగా అనిపించదు . కానీ కాస్త లోతుల్లోకి వెళ్తే మాత్రం అది వార్తే . ఒక్క సారి ఈ రోజు ఈనాడు లోని 14 వ పేజీ లో ఎడమ వైపున ఉన్న "సచిన్ అలా .... "అన్న వార్త ఒక్క సారి చూడండి . నిజంగా ఐతే అది వార్త కాదు .... ఒక ఆటగాడి పరిచయం .
అనిల్ గౌరవ్ అనే మరుగున పడిపోయిన ఆటగాడి వ్యదార్ధ గాధ మనసున్న మనుషులకెవరికైనా మనసు చివుక్కుమనేలా చేస్తుంది . అతగాడు అన్న ఒక్క మాట అర్ధం చేసుకోగలిగితే భారత దేశ ప్రస్తుత సమాజ పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు . "ముఖ్యంగా అతనికి మంచి కుటుంబ నేపధ్యం ఉంది " అన్న అతడి మాటలో ఉన్న ఆర్తి ఈ వార్త చదివిన ఎంతమందిని కదిలించిందో నాకు సరిగ్గా తెలియదు కానీ నాకైతే అతడు సమాజాన్ని విప్పి చూపించాడనిపించింది. మనకుండే సామాజిక నేపద్యాలు ...... మన రాజకీయాభిప్రాయాలు ..... మన ఆచరణలు ...... వీటి బట్టి రాజ్యం యొక్క ప్రతి స్పందన ఉంటుందన్న విషయం చాలా మందికి అర్ధం కాదు . ఒక జేబుదొంగ గానీ ..... సైకిల్ దొంగ గానీ కనీసం ఒక ఎస్సై తో కూడా ఎక్కువ సేపు మాట్లాడే అదృష్టం పొంద లేడు.
ఒక వ్యక్తి విప్లవ కవిత్వం రాయడం తప్ప వేరే నేరం చేయక పోవచ్చు ..... కానీ నీకు జైలు లో న్యూస్ పేపర్ కూడా దొరకక పోవచ్చు . అతడి భావజాలం అందరికీ ఆమోద యోగ్యం కాక పోవచ్చు ..... కానీ అతడికీ .... వేల కోట్ల కుంభకోణాల ఆరోపణల మీద విచారణ కోసం జైల్లో పెట్టబడిన రాజకీయ నాయకుడికి జైల్లో లభించే సౌకర్యాలు .... హక్కులు పరిశీలించి చూస్తే చాలా విషయాలు అర్ధం చేసుకోవచ్చు . అంతే కాదు విచారణ పూర్తి చేసుకుని నిరపరాధి క్రింద బయటకు రాకముందే అన్ని రాజకీయ పక్షాల నాయకులు మహామహులైన కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కూడా అటువంటి నేపధ్యం ఉన్న నాయకులను కలవడం కోసం తమ విలువైన సమయాన్ని చక్కగా ఖర్చు పెట్ట గలుగుతారు. కానీ తాము పూర్తిగా ఏకం కావడం మూలంగా భారత రాజకీయాలలో వచ్చే మార్పుల గురించి ఏ విధమైనా చర్చా జరపడానికి సుముఖలవ్వరు . ఇంత అధ్వాన్న పరిస్థితులలో కూడా సోషలిస్ట్ శక్తుల ఏకీకరణకు ఏ మాత్రం కృషి చేయని కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల వైఖరే భారత ప్రజల పట్ల జరుగుతున్న అతి పెద్ద రాజకీయ కుట్ర అని నా అభిప్రాయం . ప్రస్తుతం ఉన్న యువకులకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ సిద్దాంతం అంటూ ఒకటుంది అని తెలిసే లోగా ఈ పార్టీలు కనుమరుగు కాకూడదని కోరుకుంటున్నాను .
కనీసం భారత రత్న ఇచ్చే విషయంలో ఒక మంచి చర్చ జరుగుతోంది . నిజంగా సచిన్ మన క్రీడా రంగపు ఆణిముత్యం కావచ్చు ..... కానీ ముందున్న ఆణి ముత్యాలను వదిలేద్దామా ...... అంతే కాకుండా క్రీడా రంగపు రాజకీయాలన్నిటి మీదా ఒక ఆరోగ్యకరమైన చర్చ జరిగితే బాగుంటుంది . కేవలం క్రికెట్ ఒక్కటే మన జాతీయ క్రీడగా ఎందుకు మారుతోంది .... లాంటి విషయాలను అనిల్ గౌరవ్ మాటల నేపద్యంతో ఆలోచించాలి

6, నవంబర్ 2013, బుధవారం
రూపం మార్చిన కానిబాల్స్
" నిజంగానే కానిబాల్స్ (మానవులని తినే మనుష్య జాతి )ఈ రోజుల్లో ఉన్నారంటావా ..?"
"ఉండొచ్చేమో ... "
"నిజంగానే అండమాన్ నికోబార్ దీవుల్లోని sentinels కానిబాల్సే నంటావా ?
"అవ్వొచ్చు .... "
"మరి .... మనకు ఇంత సమీపంలోనే కానిబాల్స్ ఉంటే వాళ్ళను సంస్కరించవలసిన అవసరం లేదా ... ?"
"ఏం చేస్తే బాగుంటుంది ?"
"ఏదోలా వాళ్ళ భాష వచ్చిన వాళ్ళను పట్టుకుని వాళ్ళు చేస్తుంది ఎంత ఘోరమైన పనో అర్ధం అయ్యేలా చెప్పొచ్చు .."
"వాళ్ళు మారతారా .. ?"
"కనీసం ప్రయత్నం చెయ్యాలిగా .."
"ప్రయోజనం ఉండదు "
"మరీ అంత ఖచ్చితంగా చెబుతున్నావ్ "
"తెలుసు కాబట్టి .... "
"ఎలా ..... ?"
"వాళ్ళ నాగరికతలో బయట మానవులను తినడం ... సహజమైన విషయం గా భావిస్తారు కాబట్టి "
"మరీ అంత దారుణంగా ... "
"నీ నాగరికత .... నా నాగరికతలకు అది దారుణం కావచ్చు .... కానీ వాళ్లకు కాదు ... అంతే .... "
"ఒక వేళ మన లాంటి వాళ్ళం ప్రయత్నం చేస్తే ....?"
"నిన్ను చక్కగా డీప్ ఫ్రై చేసుకుని మరీ తినేస్తారు .."
" ఛీ ... "
"ఏంటి ఫ్రైయ్యా ... బాగానే ఉండొచ్చు "
" ఆపు బాబూ వాంతోచ్చేలా ఉంది ..."
"వాళ్లకు రుచికరమైన ఆహారం .... నీకు వాంతి తెప్పిస్తోంది ..... "
"అలా కాదు .... చైతన్యం కలిగిన ప్రాణిని తినే బదులు సహజంగా ఈ అడవిలో దొరికే పళ్ళు .. తేనె తినొచ్చు కదా ... ఎవరికీ బాధ ఉండదు .... వాళ్ళ జిహ్వ కోసం తోటి మనిషిని ..... "
"నయం ..... ఈ నీతులన్నీ నాకు చెప్పావు ..... కాబట్టి సరిపోయింది ..... "
"అంటే ...... "
"తోటి మానవులని నీ స్వార్ధం కోసం హింసించ కూడదు ..... ప్రజల ఆస్తులు అన్యాయంగా దోచుకోకూడదు ... అధికారం ఉంది కదా అని ప్రభుత్వ భూములను నీ తాబేదార్లకు ధారాదత్తం చేయకూడదు ..... చట్టాలను అంత విస్రుంఖలంగా అతిక్రమించకూడదు ...... నీ అధికార దాహానికి ప్రజల మధ్య చిచ్చు పెట్ట కూడదు ..... లాంటి నీతులు ఏ ఫ్యాక్షనిస్ట్ కుటుంబంలో పుట్టి ..... ఆ నాగరికతనే నిలువెల్లా ఒంటపట్టించుకున్న నాయకుడికెవరికైనా చెప్పావనుకో ... అసలే సామాన్య మానవుడివి ..... వాడు నిన్ను ఎలా అయినా తినేస్తాడు ..... వాడి చుట్టూ తిరిగే తోడేళ్ళు వాడు తినగా మిగిలింది పీక్కుని తినడానికి రెడీ గా వాడి చుట్టూ చేరి ఉంటున్నాయి ..... జాగ్రత్త ... "
"అంటే కానిబాల్స్ కోసం అండమాన్ నికోబార్ వెళ్ళనక్కరలేదన్న మాట ..... "
(డాక్టర్ జె . పీ . లాంటి మచ్చ లేని మనిషి నిన్న విశాఖపట్నం లో తనకు తెలిసిన కొన్ని గతం లోని విషయాలను బయట పెట్టినందుకు ....శాస్త్రీయంగా సమాధానం చెప్పలేని తోడేళ్ళ నిజమైన ప్రేలాపన ..... భాష .. విన్న తరువాత ..... తట్టుకోలేక .....)

4, నవంబర్ 2013, సోమవారం
ఉగ్రవాద బీజాలు ....... ఎక్కడనుండి ..... ఎవరి వలన .....
మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న గారు పెద్ద R.S.S. లీడర్ నాన్నా ..... మా వాడు వాళ్ళ స్నేహితుడి కుటుంబం గురించి చెబుతున్నాడు .
సీమాంధ్ర లో R.S.S. లో ఉన్న వాళ్ళంతా కాస్త అగ్ర కులాల వారే నని నా నమ్మకం . కేవలం ఇది నా నమ్మకం మాత్రమే కాబట్టి దయుంచి దీంట్లో తప్పొప్పులు వెదకొద్దని మనవి . కానీ మా వాడి మాటల ద్వారా తెలిసిందేమిటంటే వాళ్ళ స్నేహితుడిది వెనుకబడిన కులాల జాబితాల్లో ఉన్న కులం . ఈ విషయం కూడా తరువాత తెలిసింది . సరే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి ఈ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు . ఒక రోజు నేను మా వాడిని ఏదో ప్రాజెక్ట్ చేయవలసిన పని కోసం వాళ్ళ స్నేహితుడి ఇంటికి తీసుకెళ్ల వలసి వచ్చింది . సరిగ్గా అదే సమయానికి వాళ్ళింటి సమీపం లోని మసీదు లో నమాజ్ .... దాని తరువాత ఏదో ఉపన్యాసం ప్రారంభమయ్యాయి. దాని సౌండ్ ఎన్ని decibels ఉంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా కొద్ది నిముషాలు అక్కడే ఉంటే నా తలలో నరాలు బద్దలవ్వడం ఖాయమన్న ఫీలింగ్ వచ్చేసింది . నాకప్పుడు అనిపించింది ..... ఆ ఏరియా లో ఉన్న ఏ హిందువైనా కూడా (నిజానికి ముసల్మానులు కూడా అది భరించడం కష్టమే ) ఆ సౌండ్ ఆపడానికి ఏ పనైనా చేస్తాడు .
మొన్న దసరా కి మా రాజవోలు వెళ్లాను . ఆ ఊరంతటికీ ఒకడే టైలర్ . అతడు నా క్లాస్ మేట్ కూడా . ఈ నాటికీ అలా బట్టలు కుట్టుకుంటూ కుటుంబ భారం మోస్తున్నాడు . బట్టలు కుట్టించవలసి వచ్చి మా శ్రీమతి తనకు ఫోన్ చేసింది .
"అయ్యో ...పాపమ్ అమీర్ కు వంట్లో బాగుండ లేదంట .... లేవడం లేదంట "
ఫోన్ పెట్టేసి చెప్పింది . ఒక సారి ఊరు కూడా తిరిగినట్లుంటుందని చెప్పులు వేసుకుని అమీర్ ఇంటి వైపుగా బయలు దేరాను . అతడి ఇంటి చుట్టూ మూడు దేవీ నవరాత్రి పందిళ్ళు . మూడు మైకుల్లోనూ మూడు పాటలు . సౌండ్ గురించి చెప్పనక్కర లేదు . నన్ను చూడగానే పడుకుని ఉన్న అమీర్ లేచి కూర్చున్నాడు .
"ఎలా ఉంది .. ?"
"పెద్దగా నలతేమీ లేదు ప్రసాదూ .... కానీ బట్టల కుట్టడానికి మిషన్ ఎక్కలేనంత గోల .... నరాల్లోనుండి పైకి తన్నుతున్నహోరు .... కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరి తో గొడవ పెట్టుకోలేను . మిషన్ ఎక్కి 10 రోజులయ్యింది . మొన్నటి వరకూ వినాయక చవితి పందిళ్ళు .... నీవు చెప్పు ప్రసాదూ ... ఇదంతా భక్తి కోసమే నంటావా ..... "
వేరే విషయాలు మాట్లాడి ఇంటి వైపుకి తిరిగాను .
అక్కడుండ గానే ఆదివారం వచ్చింది .
"మరీ ఇంత గోలా ..... "
"ఏం చెయ్యమంటారు అన్నయ్య గారూ .... ఏదైనా గట్టిగా అంటే గొడవలని భయపడుతున్నాం ...... పిల్లలు ప్రశాంతంగా చదువుకోలేక పోతున్నారు "
మా బావమరిది భార్య వాపోయింది .
ఆలోచిస్తే నవ్వొచ్చింది . నగరం లోనే రాత్రి 12 గంటల తరువాత పది మంది కూడా లేని పిల్ల కాయలు కొన్ని వేల మందికి నిద్ర లేకుండా ఊరేగింపులు చేసేస్తున్నారు .
సమాజంలో ఉన్న మూడు నాలుగు మతాల వారు తోటి వారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తుంటే కంట్రోల్ చేయవలసింది ఎవరు ... ?
కావాలని చేస్తున్న ఈ ఉపేక్ష వెనుక పాలక వర్గాల కుట్ర నగ్నంగా కనపడ్డం లేదా ? ఇటువంటి ఉపేక్ష వలన కాదా .... మొత్తం సమాజం భారీ ఉపద్రవాల బారిన పడింది . టెర్రరిజానికి బీజాలు పడేది ఇక్కడనుండి కాదా .......

29, అక్టోబర్ 2013, మంగళవారం
మంచి .... చెడుల మీద మన భాష్యాలు
మంచి .... చెడుల మీద మన భాష్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి . నిజంగా అంతరాత్మ వాణి అంటూ ఉంటారు ...... అది ఎంత మందికి ఉంటుందో నాకు తెలియదు . ఒక చిన్న ఉదాహరణ చూద్దాం . మా పెళ్ళైన కొత్తలో మాతో చాలా దగ్గరగా మెసిలే అమ్మాయి ఎప్పుడూ వాళ్ళమ్మ గురించి మా దగ్గర వాపోతూ ఉండేది ఆవిడ పిసినారి తనం గురించి . అప్పటికి ఆ అమ్మాయి కాలేజ్ లో డిగ్రీ చదువుతూ ఉండేది . ఆ తరువాత చాలా కొద్ది కాలానికే ఆ అమ్మాయి పెళ్లైంది . వాళ్ళమ్మ తను చేసిన వడ్డీ వ్యాపారం వల్ల నైతే నేమి .... జాగ్రత్త వల్లనైతే .... నేమి పోగైన డబ్బుతో ఆ అమ్మాయికి బోల్డు బంగారు నగలు వగైరా చేయించగలిగింది . ఇప్పుడు ..... పరిస్థితేమంటే ఈ అమ్మాయి సూది కొన్నా కూడా వాళ్ళమ్మతో "for your approval please..." అంటూ మాట్లాడుతుంది . ఒకప్పుడు తను అసహ్యించుకున్న పిసినారితనమే ఇప్పుడు తనకు లాభం చేసేసరికి అమ్మ కాస్తా బెల్లంగా మారింది . సినిమాకి వెళ్ళడానికో ...... మంచి బట్టలు కొనుక్కోడానికో అడ్డుపడిన తల్లి పిసినారితనం ఆ అమ్మాయిని బాధించింది కానీ తల్లి వసూలు చేస్తున్న అధిక వడ్డీలు ఎప్పుడూ బాధించ లేదు .
ఇప్పుడు మొత్తం సమాజంలో అధిక భాగం యొక్క మంచి చెడుల విచక్షణ పైన ఉదహరించిన అమ్మాయి ఆలోచనా విధానం లోనే ఉంది కాబట్టే మొత్తం సమాజాభివ్రుద్ది అన్న కాన్సెప్ట్ నుండి రాజకీయ పార్టీలు అనవసర సబ్సిడీ ల వైపు వెళ్ళుతున్నారు . సబ్సిడీలు క్రింది వారికి ఎంతవరకూ అందుతాయో తెలియదు కానీ అన్ని చోట్లా రాజకీయ దళారీలు మాత్రం బాగా తయారయ్యారు. ఇది రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రయ్యాక బాగా పెరిగింది . క్రింది చిత్రాన్ని చూడండి .
ఇప్పుడు నిజాయితీపరుల ..... దేశ / రాష్ట్ర అభివృద్దిని కోరుకునే వాళ్ళ ముఖ్య కర్తవ్యం అనవసర సబ్సిడీల నిజ స్వరూపాన్ని బయట పెట్టడమే .... నా మాట మీద వివరణ కావాలంటే పక్కనున్న పుస్తకాన్ని చదవండి .

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)